అఖిల్ సోహెల్ మధ్య కుదిరిన ఒప్పందం.. వామ్మో బిగ్ బాస్ టైటిల్‌పై గురి.. ఆశలు మామూలుగా లేవు!!
బిగ్ బాస్ షోలో అఖిల్ సోహెల్ మిత్రబంధం గురించి అందరికీ తెలిసిందే. ఒక్కక్షణంలోనే గొడవలు పడుతుంటారు.. మరుక్షణంలోనే కలిసిపోతుంటారు. సోహెల్ కోసం అఖిల్, అఖిల్ కోసం నిలబడుతుంటారు. ఫినాలె టిక్కెట్టును సోహెల్ త్యాగం చేసి అఖిల్‌ను టాప్ 5లోకి పంపించేశాడు. అలా ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధానికి ఎన్నో ఉదహరణలున్నాయి. అయితే సోహెల్ అఖిల్ నిన్నటి ఎపిసోడ్‌లో గొడవలు పడ్డారు. కానీ అంతకుముందు ఓ విషయంపై చర్చలు పెట్టుకున్నారు.

ఖాళీగా ఉంటే ఏంచేస్తావ్..
పద్నాలుగో వారంలో అఖిల్ ఫుల్ చిల్ అవుతున్నాడు. నామినేషన్స్‌లో లేడు. టాప్ 5కి టికెట్ సంపాదించాడు. మొత్తం రిలాక్స్ మోడ్‌లో ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు అఖిల్. నిన్న మాటల్లో మాటగా.. అఖిలో సోహెల్ ముచ్చట్లు పెట్టుకుంటూ టైటిల్ విన్నర్ అయితే ఏం చేస్తారో బయటకు చెప్పుకొన్నారు. ఇంట్లో ఖాళీగా ఉంటే ఏం చేస్తావ్ అంటూ సోహెల్‌ను అఖిల్ అడగటంతో అసలు కథ మొదలైంది.

ల్యాప్ టాప్ లేదు..
అఖిల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఖాళీగా ఉంటే సినిమాలు చూస్తానని సోహెల్ చెప్పుకొచ్చాడు. ఎందులో చూస్తావ్ అని అఖిల్ మళ్లీ అడిగాడు. ఫోన్ లోనే చూస్తాను అని సోహెల్ అన్నాడు. నాకు ల్యాప్ టాప్ లేదు.. రూంలో ఎవడో ఎత్తుకెళ్లాడంటూ సోహెల్ చెప్పుకొచ్చాడు. నా దగ్గర కూడా లేదంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు.

బయటకు వెళ్లాక..
అలా ల్యాప్ ట్యాప్ గురించి చర్చ వచ్చాక సోహెల్ ఓ మాట అనేశాడు. బయటకు వెళ్లాక ఓ ల్యాప్ టాప్ కొనాలి అని సోహెల్అంటే... నేను కూడా కొనాలి అంటూ అఖిల్ పేర్కొన్నాడు. నేను టైటిల్ గెలిస్తే నీకు కొనిస్తా అని సోహెల్ ముందుగా ఉన్నాడు. ప్రామీస్ వేసి చెప్పంటూ సోహెల్‌ను అఖిల్ అడిగాడు.
Recommended Video

నేను గెలిస్తే నీకు..
ఇక అఖిల్ సోహెల్ మధ్య ఓ ఒప్పందం కూడా కుదిరింది. నేను గెలిస్తే నీకు బైక్, ల్యాప్ టాప్ కొనిస్తా అంటూ అఖిల్ చెప్పాడు. ఒక వేళ నువ్ గెలిస్తే నాకు కొనివ్వాలంటూ సోహెల్‌కు చెప్పాడు. అలా ఈ ఇద్దరి మధ్య బైక్, ల్యాప్ టాప్‌ల ఒప్పందం కుదిరింది. కానీ ఈ ఇద్దరూ విన్ అవుతారా? అన్నది సందేహమే. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ ప్రకారం.. అభిజిత్ బిగ్ బాస్ టైటిల్‌ను గెలిచే అవకాశమే ఎక్కువగా ఉంది.


Click it and Unblock the Notifications











