మోనాల్ కోసం అవకాశాన్ని జార విడిచిన హారిక.. పాపం అభిజిత్‌కు అది అగ్ని పరీక్షే!!
బిగ్ బాస్ షోలో 14వ వారం ఒక్కొక్కరికి ఒక్కోలా గడుస్తోంది. అరియానా సోహెల్ ఒకలా బాధపడుతుంటే.. అభిజిత్ మరోలా హర్ట్ అవుతున్నాడు. అఖిల్ మోనాల్ సంగతి ఎవరికీ అర్థం కాదు. ఇక హారిక మాత్రం కొత్త స్నేహ బంధాలను ఏర్పర్చుకుంటోంది. ఇలా ఈ పద్నాలుగో వారంలో ఒక్కొక్కరు ఒక్కోలా బాధపడుతున్నారు. ప్రేక్షకులు ఓట్లు వేయమని అప్పీల్ చేసుకునే అవకాశం కోసం అందరూ బాగానే కష్టపడుతున్నారు.

మొదటి చాన్స్..
రాజు రాణి టాస్క్ ఇచ్చి ఎంటర్టైన్ చేయాలన్న టాస్క్‌లో అరియానా బాగా చేసిందని అభిజిత్ సోహెల్ ఓట్లు వేశారు. ఇక అరియానాకు ఎక్కువ ఓట్లు పడేసరికి ఓట్ల కోసం అప్పీల్ చేసుకునేందుకు, ఆడియెన్స్‌తో నేరుగా మాట్లాడేందుకు మొదటి చాన్స్ వచ్చింది.

రెండో అవకాశం అలా..
ఎవరికి ఓపిక ఎక్కువ అనే టాస్క్ పెట్టి రెండో చాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ ఆటలో సోహెల్ అందరి కంటే ఎక్కువగా ఓపిగ్గా ఉండి టాస్క్ విజేతగా నిలిచాడు. అలా రెండో టాస్క్ గెలిచి.. ఓట్లను అప్పీల్ చేసుకునేందుకు సోహెల్ కన్ఫెషన్ రూంలోకి వెళ్లాడు. అక్కడే ప్రజలను ఓట్లు అడిగి.. బిగ్ బాస్‌తో తన బాధంతా వివరించి చెప్పుకున్నాడు.

మూడో టాస్క్‌లోనూ అరియానా..
నిన్నటి ఎపిసోడ్‌లో ఏకాగ్రత అనే టాస్క్ ఇవ్వగా అందులోనూ అరియానా గెలిచింది. ముప్పై నిమిషాలు లెక్కించడంలో అరియానాయే అందరి కంటే ముందుగా నిలిచింది. అరియానా 37 నిమిషాల్లో తన టాస్క్‌ను పూర్తి చేసేసింది. తనను డిస్టర్బ్ చేసినా కూడా ఏకాగ్రతను కోల్పోలేదు. అలా రెండో సారి అరియానా పీపుల్స్‌ను ఓట్లు అప్పీల్ చేసుకునేందుకు అర్హత సాధించింది.

నేటి ఎపిసోడ్‌లో..
ఇక నేడు బిగ్ బాస్ చివరి చాన్స్ ఇచ్చినట్టు కనిపించింది. నాల్గో అవకాశంగా ఇంటి సభ్యులకు నాన్ స్టాప్ డ్యాన్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో చివరి వరకు ఎవరు డ్యాన్స్ చేస్తూ ఉంటారో వారికే గోల్డెన్ మైక్ లభిస్తుంది. ఆ తరువాత ప్రేక్షకులతో నేరుగా మాట్లాడుతూ ఓట్లను అప్పీల్ చేసుకునే చాన్స్ దొరుకుతుంది.
Recommended Video
అభిజిత్‌కు అగ్ని పరీక్షే..
అసలే డ్యాన్స్అంతగా రాని అభిజిత్‌కు నేడు ఇవ్వనున్న ఈ టాస్క్ అగ్ని పరీక్ష లాంటిదే. అభిజిత్ అంతగా డ్యాన్స్ వేయలేడు.. పైగా సోహెల్, మోనాల్, హారిక వంటివారితో అసలే పోటీ పడలేదు. అయితే ఈ టాస్క్‌లో చివరి వరకు హారిక మోనాల్ ఉంటారని, మోనాల్ కోసం హారిక త్యాగం చేయనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











