ఓట్లు అడగటం కోసం వెళ్లి ఏడ్చేశాడు.. తన కోపంపై సోహెల్ కామెంట్స్
బిగ్ బాస్ షో ముగిసేందుకు వచ్చింది. పద్నాలుగో వారంలో బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ నామినేట్ చేసేశాడు. అయితే నామినేషన్ చేసిన బిగ్ బాస్ ఆ కంటెస్టెంట్లకు ఓ ఆఫర్ ఇచ్చాడు. ఫినాలే టికెట్ పొందిన అఖిల్ ఈ వారం కూల్‌గా ఉన్నాడు. అయితే మిగతా ఇంటి సభ్యులు ప్రజలను ఓట్లు అడిగే అవకాశాన్ని ఇచ్చాడు. టాస్క్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి.. ఎంటర్టైన్ చేస్తూ ప్రేక్షకులను ఓట్ల కోసం అప్పీల్ చేసుకోవచ్చని బిగ్ బాస్ తెలిపాడు.
అలా మొదటి టాస్క్ రాజు రాణిలో అరియానా బెస్ట్ పర్ఫార్మ్‌గా ఎంపిక చేశారు. అలా అరియానా కన్ఫెషన్ రూంలోకి వెళ్లిన అరియానా ప్రేక్షకులను ఓట్లు వేయమని అప్పీల్ చేసుకుంది. అయితే ఆ సమయంలోనూ అరియానా ఏడుస్తూనే ఓట్లు వేయమని అడిగేసింది. నేడు సోహెల్ కూడా అలాంటి అవకాశాన్ని పొందినట్టున్నాడు. ఎవరు ఓపిగ్గా ఉంటారనే టాస్క్‌లో సోహెల్ గెలిచినట్టున్నాడు.

అందుకే రెండో ఛాన్స్‌లో సోహెల్ కన్ఫెషన్ రూంలోకి వెళ్లాడు. అయితే అక్కడ సోహెల్ చిన్న పిల్లాడిలా మారిపోయి ఏడ్చేశాడు. తన కోపమే తనకు శత్రువు అంటూ.. తనకు కోపం ఒక్కటే మైనస్ అని.. దాన్ని తగ్గించుకుంటానని, అరియానాతో కావాలని గొడవ పడలేదని.. అలా జరిగిపోయిందంటూ బిగ్ బాస్‌కు చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇలా సోహెల్ తాను చేసిన దానికి పశ్చాత్తాపడటంతో అందరూ పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











