Bigg Boss Telugu 4 నుంచి 8వ వారంలో అవుట్ అయ్యేది ఎవరు? దివికి అన్యాయం.. సమంత న్యాయం చేసిందా?

ఇండియన్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ 4 కరోనా సమయంలో కూడా బాగానే హడావుడి చేసింది. తెలుగులో మొదలైన తరువాతనే ఇతర భాషల్లో కూడా స్టార్ట్ చేశారు. నాగార్జున చాలా తెలివిగా షోను ముందుకు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చివరికి ఎలిమినేషన్స్ లో మాత్రం బిగ్ బాస్ పై జనాలు కాస్త అసంతృప్తితోనే ఉన్నట్లు అర్ధమయ్యింది. ఫిల్మీ బీట్ ఇటీవల పోల్ నిర్వహించగా అందులో చాలా మంది వారి అభిప్రాయంపై స్పందించారు.

ఎలిమినేషన్ ప్రక్రియలో అన్యాయం?

ఎలిమినేషన్ ప్రక్రియలో అన్యాయం?

షో మొదలైన రోజు నుంచి కూడా హౌజ్ లో ఆశ్చర్యపరిచే పరిస్థితులు ఏమి చోటు చేసుకోలేదు. ఈ సారి ఎక్కువగా ట్రయాంగిల్ లవ్ స్టొరీ లేదంటే అక్కడక్కడా కొన్ని టాస్క్ లతో బిగ్ బాస్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది. ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ టీమ్ రేటింగ్ గురించి ఆలోచించే మోసం చేస్తోందనే రూమర్స్ వస్తున్నాయి. ఇక అన్యాయం జరిగిందని కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తరువాత అసలు విషయాలను బయటపెడుతున్నారు.

దివిని కూడా అలానే పంపించేశారా?

దివిని కూడా అలానే పంపించేశారా?


దివి బిగ్ బాస్ హౌజ్ లో పెద్దగా హడావుడి చేయకపోయినప్పటికి చాలా వరకు తన పని తాను చేసుకుంటూ సైలెంట్ గానే ఆడింది. గేమ్ లో కెమెరాలను ఆమెను ఎక్కువగా ఫోకస్ చేయలేదు. అయితే ఆమెకు కూడా అన్యాయం జరిగిందని ఓ వర్గం జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 67% వరకు దివికి ఎలిమినేషన్ ప్రక్రియలో అన్యాయం జరిగిందనే అంటున్నారు.

 డేంజర్ జోన్ లో అమ్మా రాజశేఖర్

డేంజర్ జోన్ లో అమ్మా రాజశేఖర్

బిగ్ బాస్ 8వ వారంలో నామినేట్ అయిన వారిలో ఫోకస్ ఎక్కువగా ఎక్కువగా అమ్మా రాజశేఖర్ పైనే ఉన్నట్లు తెలిసిపోయింది. లిస్ట్ లో ఉన్న అరియానా వెళ్లే సమస్య లేదు. లాస్యకు కూడా ఆడియెన్స్ సపోర్ట్ ఉంది. ఇక మోనాల్, మెహబూబ్, అమ్మా డేంజర్ జోన్ లో ఉన్నట్లు అర్ధమవుతోంది. అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ అవుతాడని 34% జనాలు ఓటు వేశారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Jordar Sujatha Re Entry In Bigg Boss House
సమంత న్యాయం చేసిందా?

సమంత న్యాయం చేసిందా?


ఇక గతవారం నాగార్జున స్థానంలో హోస్ట్ గా దర్శనమిచ్చిన సమంత ఎంతవరకు న్యాయం చేసిందనే విషయంలో జనాలు ఆమెకు కొంతవరకు సపోర్ట్ చేశారని అనిపిస్తోంది. బాగుంది అని 45% ఓట్స్ వచ్చాయి. అయితే పూర్తి స్థాయిలో ఆమె సరైన న్యాయం చేయలేదనే వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ ఆమె వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వైల్డ్ డాగ్ షెడ్యూల్ ని మార్చుకున్న నాగ్ యధావిధిగా బిగ్ బాస్ ను కంటిన్యూ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X