నా దాంపత్య విషయంలో నాకే క్లారిటీ లేదు.. ఇంకా లవ్ చేస్తున్నా.. కానీ..: ఆర్టిస్ట్ ప్రియ

బిగ్ బాస్ సీజన్ 5 మూడో నామినేషన్స్ ఆసక్తికరంగా మారింది. ఈసారి హౌస్ నుండి ఎవరు బయటికి వెళ్లి పోతారు అనే విషయంలో ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పోటాపోటీగా కొనసాగుతూ మధ్య మధ్యలో ఎమోషనల్ గా కూడా ఫీల్ అవుతున్నారు. అయితే ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయిన కూడా టాస్క్ ల విషయానికి వచ్చే సరికి కంటెస్టెంట్స్ అందరూ కూడా శత్రువులుగా మారిపోతున్నారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వారి స్థాయిని పెంచుకునే విధంగా పోరాడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ విషయంలో మూడవ వారం పోటీ తీవ్రత కాస్త సాధారణంగానే కొనసాగింది. ఇక బిగ్ బాస్ ఈసారి కాస్త గొడవలు తగ్గించి పర్సనల్ విషయాలను కూడా చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చారు. తొలిప్రేమ టాస్క్ లో భాగంగా ప్రతి ఒక్కరి తొలిప్రేమ అనుభూతిని చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో ఆర్టిస్ట్ ప్రియా ఎవరూ ఊహించని విధంగా సమాధానం ఇచ్చింది. పర్సనల్ విషయాల పై కాస్త ఎమోషనల్ అవుతూ తెలియజేసిన విధానం కంటెస్టెంట్స్ ను కూడా ఎంతగానో భావోద్వేగానికి గురి చేసింది.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 ఎలిమినేషన్స్ లో బలమైన కంటెస్టెంట్స్

ఎలిమినేషన్స్ లో బలమైన కంటెస్టెంట్స్

ఈవారం ఎలిమినేషన్ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఆ డేంజర్ జోన్ లో ఉన్న దాదాపు ఐదు మంది కూడా హౌస్ లో పోటాపోటీగా తలపడుతున్న వారే. సింగర్ శ్రీరామచంద్ర కెప్టెన్ కాకపోయినప్పటికీ హౌస్ లో కొన్నిసార్లు టాస్క్ లలో లీడర్ గా మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. అతనికి ప్రత్యర్థిగా ఉన్న మానస్ కూడా అప్పుడప్పుడు తనలోని అధికార ప్రతిభను చాటుకున్నాడు. మిగతా సభ్యులను కూడా అతను చాలా చక్కగా హ్యాండిల్ చేస్తున్నాడు. ఈసారి నామినేషన్స్ లో లహరి, ఆర్టిస్ట్ ప్రియ, ప్రియాంక కూడా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఐదుగురిలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారో చెప్పడం ఊహలకు అయితే అందడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి.

 అందరి ఫోకస్ ఆమె పైనే..

అందరి ఫోకస్ ఆమె పైనే..

బిగ్ బాస్ హౌస్ లో గత రెండు వారాలు కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు అయితే గట్టిగానే జరిగాయి. ఎమోషన్స్ తో పాటు మరోవైపు నామినేషన్ విషయంలో కూడా ఒకరిపై ఒకరు ఫిజికల్ గా ఎటాక్ చేసుకునే వరకు వెళ్లారు. పవర్ ఫుల్ ఫైర్ బ్రాండ్ గా మంచి క్రేజ్ అందుకున్నటువంటి సరయు ఉమాదేవి రెండు వారాల్లోనే బయటకు వెళ్ళి పోవడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళిద్దరు హౌస్ లో ఉండి ఉంటే షో లో హడావుడి మరోలా ఉండేది. ఇక ఇప్పుడు మూడో వారం అందరి చూపు ఆర్టిస్ట్ ప్రియ పైనే ఉంది. ఆమె బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

సిరి, ప్రియాంక ఎమోషనల్ లవ్ స్టొరీ

సిరి, ప్రియాంక ఎమోషనల్ లవ్ స్టొరీ

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారు చెప్పడం అంత ఈజీ కాదు అనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ హౌస్ లో అందరూ కూడా వారి వ్యక్తిగత విషయాలను చెప్పుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొందరు అయితే చాలా ఎమోషనల్ గా కూడా అవుతుంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ అందరికీ వారి తొలి ప్రేమ గురించి చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఇక ఆ విషయంలో కొందరు సరదాగా వివరణ ఇవ్వగా మరికొందరు మాత్రం చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు ముఖ్యంగా సిరి తను మొదట ప్రేమించిన అబ్బాయి యాక్సిడెంట్ లో మరణించాడు అని చెప్పింది. ఇక ప్రియాంక అమ్మాయిగా మారిన తర్వాత ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు అని తెలిపింది.

అలా మొదటి ప్రేమ

అలా మొదటి ప్రేమ

అందరిదీ ఒక తరహాలో ఉంటే టాలీవుడ్ సీనియర్ నటి అయినటువంటి ప్రియ ప్రేమ మాత్రం మరొక తరహాలో ఉన్నట్లు అర్థమయింది. ప్రియా గత 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆమె వ్యక్తిగత విషయాల గురించి బయట ఎక్కువగా చెప్పుకోలేదు. మొదటిసారిగా తన పర్సనల్ విషయాలను చెప్పుకున్నారు. తను యాడ్స్ కు సంబంధించిన షూట్ కు వెళ్లినప్పుడు ఒక స్టూడియో దగ్గర ఒక అబ్బాయి కలిశాడని ఆ తర్వాత ఇంట్లో వాళ్లందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది.

Recommended Video

Director Sekhar Kammula Exclusive Interview About 'Love Story' | Part 3
నా దాంపత్య జీవితం గురించి అర్థం కావడం లేదు

నా దాంపత్య జీవితం గురించి అర్థం కావడం లేదు

అతన్ని నేను ముద్దుగా కేక్ అని పిలుచుకుంటాను అని చెప్పిన ప్రియ కొన్నాళ్ళపాటు సంతోషంగా జీవితం కొనసాగినట్లు వివరణ ఇచ్చింది. అయితే ఒక వ్యక్తి తో మనం ఉన్నా లేకపోయినా కూడా ప్రేమ ఇష్టం అనేవి అలానే ఉంటాయి. ఏదేమైనా అతను నా ఫస్ట్ లవ్ అని చెప్పాలి కాబట్టి చెబుతున్నాను అతన్ని ముద్దుగా నేను కేక్ అని పిలుచుకుంటాను. అతని అసలు పేరు కిషోర్. ఇంకా అతన్ని లవ్ చేస్తూనే ఉన్నాను. అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కోల్పోతే ప్రేమ ఇష్టం కూడా దాని కిందకి వచ్చేస్థాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ ముందు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను మ్యారీడా సపరేటేడా లేక డివోర్స్ అనేది తెలియదు. నా దాంపత్యం జీవితం గురించి నాకే ఒక క్లారిటీ లేదు. కానీ ఏది ఏమైనా కూడా అతనే నా మొదటి ప్రేమ. నా మొదటి వ్యక్తి అతనే. మా ఇద్దరికి ఒక మంచి అబ్బాయి కూడా పుట్టాడు అంటూ బెలూన్ పై కేక్ అనే పేరు రాసి ప్రియ గాలిలోకి వదిలేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X