Bigg Boss 5: బెడ్ రూమ్ లో ఆర్టిస్ట్ ప్రియ హాట్ సెల్ఫీ.. బ్యూటీఫుల్ కాదు, అంతకుమించి!

బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విభిన్నమైన స్టైల్ తో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తరహాలో క్రేజ్ అందుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో గొడవలు ఎన్ని జరిగినా కూడా పొరపాట్లు ఎన్ని చేసినా కూడా చివరికి వెళ్లి పోయే సమయంలో మంత్రం చాలా కూల్ గానే బయటకు వస్తున్నారు. ఇక ఆర్టిస్ట్ ప్రియ కూడా అదే తరహాలో జనాలను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు వీడియోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల తన బెడ్ రూమ్ లో తీసిన ఒక సెల్ఫీ వీడియో కూడా కుర్రాళ్ళను మతి పోగొట్టేస్తోంది.

 ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్

ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్

బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఆర్టిస్ట్ ప్రియా గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ లోకి అడుగు పెట్టక ముందు ప్రియా పర్సనల్ లైఫ్ గురించి అయితే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఆమె పోస్ట్ చేసే ఫోటోలు రెగ్యులర్ గా వైరల్ అవుతుంది ఉంటాయి. ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా ఇటీవల 1 మిలియన్ దాటింది.

మంచి నటిగా..

మంచి నటిగా..

గత 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆర్టిస్ట్ ప్రియా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు అందుకున్నారు. ఆమె ఎలాంటి పాత్రలు చేసినా కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఎమోషనల్ పాత్రలలో ప్రియా నటించే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా నెగటివ్ పాత్రల్లో కూడా ఆమె ఆమె మంచి క్రేజ్ అయితే అందుకున్నారు. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి చెల్లెలిగా కూడా కనిపించిన విషయం తెలిసిందే.

గొడవలతో హైలెట్ గా

గొడవలతో హైలెట్ గా

ఇక బిగ్ బాస్ సీజన్ 5 లోకి ప్రియా అడుగుపెడుతుందని ఎవరూ ఊహించలేదు. మొదట్లో కాస్త సైలెంట్ గా ఉన్న ప్రియ ఆ తర్వాత మెల్ల మెల్లగా అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటూ వచ్చింది. అయితే యాంకర్ రవి తో మాత్రం ఆమె గొడవ పెట్టుకున్న విధానం హైలెట్ గా నిలిచింది. అంతేకాకుండా కాజల్ తో కూడా పలు సమయాల్లో సీరియస్ గా మాట్లాడటం కూడా హైలేట్ గా నిలిచింది. ఏదేమైనప్పటికీ ప్రియా తొందరపడి మాట్లాడినా కూడా ఓ వర్గం వారి నుంచి మాత్రం మంచి సపోర్ట్ అందుకుంది

ఎలిమినేషన్ కు కారణం..

ఎలిమినేషన్ కు కారణం..

కానీ సన్నీ విషయంలో మాత్రం ప్రియా తొందరపడి కామెంట్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సన్నీ తో గొడవ పడడమే కాకుండా అనవసరంగా అతనిని ఇబ్బందుల్లో పడేయాలని చూసినట్లు ఓ వర్గం ప్రేక్షకులకు అనిపించింది. కావాలనే ప్రియ అతన్ని రెచ్చగొట్టింది అని కూడా కామెంట్స్ అయితే వచ్చాయి. అదే ఆమెను ఎలిమినేట్ అయ్యేలా చేసింది.

Recommended Video

Akhanda Movie టార్గెట్.. | Naga Chaitanya మాస్ లో క్లాస్ ! || Filmibeat Telugu
 ప్రియ హాట్ సెల్ఫీ..

ప్రియ హాట్ సెల్ఫీ..

ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ నుంచి ఒక విభిన్నమైన తరహాలో బయటకు వచ్చిన ప్రియా మళ్ళీ ఎప్పటిలానే సినిమాలతో బిజీ గా మారిపోయారు. ఇటీవల తన బెడ్ రూం లో ఒక హాట్ సెల్ఫీ వీడియో తీసుకున్నా ప్రియ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో పోస్ట్ చేసింది. అందులో ప్రియా ఒక లాంగ్ బ్లాక్ డ్రెస్లో అందంగా కనిపించింది. పాతికేళ్ల అమ్మాయి తరహాలో ప్రియ చాలా అందంగా కనిపిస్తుందని నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా మళ్లీ బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X