For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 5: మంచి వాడని నమ్మి 40 లక్షలు ఇచ్చా.. చివరికి నన్నే మోసం చేశాడు: యాంకర్ రవి

  |

  టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న యాంకర్ రవి ఇటీవల బిగ్ బాస్ 5 నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా యాంకర్ రవి కి సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఇక ఇటీవల రవి తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాడు. గతంలో జరిగిన ఒక మోసం గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  Bigg Boss Telugu 5 : BJP MLA Raja Singh Fires On Anchor Ravi Elimination || Filmibeat Telugu
  టెంప్ట్ అవ్వలేదు

  టెంప్ట్ అవ్వలేదు

  బిగ్ బాస్ ద్వారా యాంకర్ రవి మంచి క్రేజ్ అందుకున్నాడు. అయితే అతడికి గతంలోనే రెండుసార్లు రియాల్టీ షో నుంచి పిలుపు వచ్చింది. రెండవ సీజన్ తో పాటు నాలుగవ సీజన్ లో కూడా యాంకర్ రవి కంటెస్టెంట్ గా పిలవాలి అని అనుకున్నారు. కానీ అప్పట్లో రవి బిజీగా ఉండటం వలన అటు వైపు ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయాడు. పారితోషికం ఎంత ఇస్తామనా కూడా రవి మాత్రం టెంప్ట్ అవ్వలేదు.

   మొదట్లో నెగిటివ్ టాక్

  మొదట్లో నెగిటివ్ టాక్

  ఇక మొత్తానికి సీజన్ ఫైవ్ ద్వారా యాంకర్ రవి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. మొదట్లో ఒక విషయంలో అతడు వ్యవహరించిన తీరు తీవ్ర స్థాయిలో నెగిటివ్ టాక్ వచ్చేలా చేసింది. అదే కాకుండా ఆర్టిస్ట్ ప్రియా తో కూడా అతను వ్యవహరించిన తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. ఇన్నేళ్ళు సంపాదించుకున్న గౌరవం రెండు మూడు ఘటనలతో పోయిందని యాంకర్ రవి బాధపడ్డాడు.

  పాజిటివ్ రియాక్షన్

  పాజిటివ్ రియాక్షన్

  ఇక మొత్తానికి మెల్లగ తన తప్పు తెలుసుకున్న రవి కొన్ని రోజుల తరువాత నిలకడగా వ్యవహరించాడు. తన యాంకరింగ్ అనుభవాన్ని బిగ్ బాస్ షోలో అయితే గట్టిగా ఉపయోగించాడని అర్థమైంది. ఎప్పుడైతే రవి ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి అతని స్థాయి కూడా ఒక్కసారిగా మారిపోయింది. నెగిటివ్ కామెంట్స్ చేసినవారు కూడా అతనికి పై పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం మొదలు పెట్టారు.

  టాప్ 5లోకి వెళ్లకుండానే..

  టాప్ 5లోకి వెళ్లకుండానే..

  అయితే బిగ్ బాస్ నుంచి యాంకర్ రవి అంత ఈజీగా బయటకు వెళ్లిపోవాతాడని అస్సలు అనుకోలేదు. అతడు టాప్ 5లో కూడా ఉంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ తొందరగానే బయటకు రావడం అభిమానుల్లో కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తికి గురిచేసింది. మొత్తానికి రవి అయితే చాలా సంతోషంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు అని అర్ధమయ్యింది.

  నమ్మక ద్రోహం

  నమ్మక ద్రోహం

  బయటకు వచ్చిన తర్వాత యాంకర్ రవి వరుస ఇంటర్వ్యూలతో బిజీ అవుతున్నాడు. అయితే ఒక ఇంటర్వ్యూలో రవి గతంలో తనకు జరిగిన మోసం గురించి వివరణ ఇచ్చాడు. గతంలో నాకు ఒక నమ్మక ద్రోహం జరిగింది. అన్నయ్య బిజినెస్ పెట్టాలి అంటూ తెలిసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి 45లక్షలు తీసుకున్నాడు. అతడికి ఎలాంటి చెడు అలవాట్లు లేకపోవడంతో దాదాపు రెండేళ్లపాటు తనతో ఉండడంతో మంచివాడు అని నమ్మి డబ్బులు ఇచ్చాను.. అని అన్నాడు.

  మోసం చేసి డబ్బులు ఇవ్వలేదు

  మోసం చేసి డబ్బులు ఇవ్వలేదు

  20 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను అని అతను ఎంతో నమ్మించాడు. నా వల్ల ఒకడు బాగుపడితే చాలు అనుకోని నా పరిస్థితి కూడా చూసుకోకుండా లెక్క పత్రం లేకుండా 45లక్షలు మాట మీద ఇచ్చాను. కానీ ఆ తర్వాత తనను మోసం చేసి డబ్బులు ఇవ్వలేదు. ఆ విషయంలో నా కుటుంబ సభ్యులు కూడా బాధపడ్డారు. ముఖ్యంగా నా భార్య ఆ డబ్బు తిరిగి రావాలి అని చాలా సార్లు ఉపవాసం చేసి దేవుడికి పూజలు చేసింది. ఆ ఘటన తనపైనే కాకుండా నా ఫ్యామిలీపై కూడా తీవ్ర ప్రభావం చూపినట్లు రవి వివరణ ఇచ్చారు.

  English summary
  Bigg boss 5 contestant anchor ravi about huge money cheating..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion