twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ ద్వారా లాభపడిన ఆనీ మాస్టర్.. కెరీర్ లోనే అత్యధిక పేమెంట్..11 వారాలకు వచ్చింది ఎంతంటే!

    |

    ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ దాదాపు అన్ని భాషల్లోనూ సక్సెస్ అవుతూనే ఉంది. మొదట హిందీ లో సక్సెస్ అయినా ఈ కాంట్రవర్సి షో ఆ తర్వాత తెలుగు తమిళ్ లో కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. అసలైతే తెలుగులో సక్సెస్ అవుతుందో లేదో అనే అనుమానాలు చాలానే వచ్చాయి. ఇక మొదట్లోనే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం తో భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది.

    అయితే ఈ షో చిన్నతరహా సెలబ్రిటీలకు కూడా మంచి బూస్ట్ ఇస్తుంది అని చెప్పాలి. కేవలం కెరీర్ పరంగానే కాకుండా డబ్బు సంపాదించుకునేందుకు కూడా బిగ్ బాస్ దోహదపడుతోంది. ఇక ఇటీవల ఎలిమినేట్ అయిన ఆనీ మాస్టర్ తన కెరీర్ లోనే అత్యధిక పేమెంట్ అందుకున్నట్లు తెలుస్తోంది.

    రియాలిటీ షోలతో..

    రియాలిటీ షోలతో..

    సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆనీ మాస్టారు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుంది అని ఎవరూ ఊహించలేదు. ఇదివరకే కొన్ని టెలివిజన్ రియాలిటీ డాన్స్ షో లలో జడ్జ్ గా కొనసాగిన ఆనీ మాస్టారు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మరింత క్రేజ్ అందుకున్నారు.

    సపోర్ట్ చేసినప్పటికీ..

    సపోర్ట్ చేసినప్పటికీ..

    ఇక స్టార్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మొదట్లో కొంత నిదానంగానే కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఆమెకు పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఏర్పడలేదు. అంతేకాకుండా హౌస్ లో కూడా ఎవరి నుంచి ఆమెకు పెద్దగా మద్దతు లభించలేదు. కేవలం ఆమెపై పెద్దరికం తోనే మర్యాద ఇచ్చారు అని అర్థమైంది. కొందరు సపోర్ట్ చేసినప్పటికీ కూడా మాస్టర్ కు ఎలిమినేషన్లో పెద్దగా ఉపయోగపడలేదు.

    అంతకంటే ఎక్కువ పేమెంట్

    అంతకంటే ఎక్కువ పేమెంట్

    ఆనీ మాస్టర్ నిజ జీవితంలో ఎంతో కష్టపడి టాలీవుడ్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకున్నారు. ఇండస్ట్రీలో పలు అగ్రహీరోలతో కూడా ఆమె వర్క్ చేశారు. ఎక్కువగా పూరి జగన్నాథ్ సినిమాలకు కూడా ఆమె రెగ్యులర్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అయితే ఆనీ మాస్టర్ సినిమా ఇండస్ట్రీలో అందుకున్న రెమ్యునరేషన్ అయితే చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ లోనే ఆమెకు అంతకంటే ఎక్కువ పేమెంట్ అందినట్లు తెలుస్తోంది.

    మొత్తం వచ్చింది ఎంత?

    మొత్తం వచ్చింది ఎంత?

    బిగ్ బాస్ తో అనీ మాస్టర్ రోజుకు రూ.50 వేల డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. కాబట్టి ఆమెకు వారానికి 3.5 లక్షలు సంపాదించుకున్నారు. ఇక ఈ సంఖ్య నిజమైతే, సెప్టెంబర్ 5 మరియు నవంబర్ 20 మధ్య, అనీ మాస్టర్ సంపాదించిన మొత్తం మొత్తం రూ. 40 లక్షలని తెలుస్తోంది.

    Recommended Video

    Akhanda Movie టార్గెట్.. | Naga Chaitanya మాస్ లో క్లాస్ ! || Filmibeat Telugu
    అప్పుడే వెళ్లిపోవాల్సింది..

    అప్పుడే వెళ్లిపోవాల్సింది..

    ఆనీ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఎలివేషన్ రౌండ్ లో అయితే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు. ప్రతి సారి కూడా నామినేట్ అవుతోంది డేంజర్ జోన్ లో పోరాడుతూనే వచ్చారు. ఇక 10వ వారం నుంచి ఆమె వెళ్ళిపోతుంది అనే కామెంట్స్ అయితే చాలానే వినిపించాయి. మధ్యలో జెస్సి అనారోగ్యంతో బయటకు వెళ్ళిపోవడం తో మరో వారం ఉండేందుకు ఆనీ మాస్టర్ కు దోహదపడింది. ఇదిలా ఉంటే, పన్నెండవ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ చేయబడిన పోటీదారులు షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామ, సిరి, సన్నీ, కాజల్, రవి మరియు ప్రియాంక.

    English summary
    Bigg boss 5 contestant anee master total remuneration
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X