Bigg Boss 5: బాలయ్య లుక్కుతో సన్నీ కామెడీ.. పవర్ స్టార్ జోష్ లో మానస్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ తుది దశకు చేరుకుంటున్న కొద్ది ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా విబిన్నంగా పోరాడుతున్నారు. టాప్ ఫైవ్ లో గెలిచేది ఎవరు బిగ్ బాస్ టైటిల్ ను ఎవరు గెలుచుకుంటారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ వారం బిగ్ బాస్ జరిగే టాస్క్ లు కంటెస్టెంట్స్ కు చాలా కీలకం కానున్నాయి. ఎవరికి వారు పోటాపోటీగా ప్రయత్నం చేసి ఛాలెంజెస్ లో గెలవాలని చూస్తున్నారు.

వరుస కొట్లాటలతో
ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరు కూడా వారికి నచ్చిన స్టార్స్ తరహాలో కనిపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్టార్స్ ను ఇమిటేట్ చేస్తూ అందుకు తగ్గట్టుగా డాన్సులు కూడా చేయాల్సి ఉంటుంది. గత కొన్ని రోజులుగా వరుస కొట్లాటలతో బిజీ బిజీగా కొట్లాడిన కంటెస్టెంట్స్ ఈరోజు మాత్రం కాస్త ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతోంది.

బాలయ్య బాబుగా సన్నీ
ఓటు అప్పీల్ చేసే అర్హత గెలుచుకోవడానికి బిగ్ బాస్ మరొక అవకాశం ఇచ్చాడు. అయితే ఈ మూడవ ఛాలెంజ్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా వారు ఎంచుకున్న స్టార్స్ తరహాలోనే వ్యవహరించాల్సి ఉంటుంది. కామెడీతో మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసే సన్నీ నందమూరి బాలకృష్ణ తరహాలో సిద్ధమయ్యాడు. కూల్ గా ఉండే మానస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్ లో కనిపించాడు. షణ్ముఖ్ జస్వంత్ అయితే రాజశేఖర్ తరహాలో కనిపించినట్లు అర్థమవుతోంది.

శ్రీదేవిగా కాజల్
సింగర్ శ్రీరామచంద్ర మెగాస్టార్ చిరంజీవి ముఠామేస్త్రి తరహాలో కనిపించగా మిగిలిన ఇద్దరు అమ్మాయిలు కాజల్ అతిలోక సుందరి శ్రీదేవి గా దర్శనమిచ్చింది. ఇక సిరి మాత్రం జెనీలియా తరహాలో కనిపించడం విశేషం. మీ అందరూ కూడా పరిస్థితులను బట్టే వారి టాలెంట్ ను బయటపెట్టాలి ఉంటుంది. ముందుగా కంటెస్టెంట్స్ స్టార్స్ కు తగ్గట్టుగా డాన్సులతో అలరించాల్సి ఉంటుంది.
సిరి జెనీలియాగా..
మధ్య మధ్యలో సన్నీ అయితే తన బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ తో ఫన్ క్రియేట్ చేశాడు అనిపిస్తోంది. ఇలియానా బాగున్నావా అంటూ సిరిని పలకరించడంతో ఆమె నేను ఇలియానా కాదు జెనీలియా అంటూ కౌంటర్ వేయడం చాలా బాగుంది. ఇక ఆ తరువాత ఇద్దరూ కలిసి మరొకసారి మాస్ స్టెప్స్ వేయడం విశేషం. శ్రీ రామచంద్ర కాజల్ ఉద్దేశిస్తూ తింగరబుచ్చి అని సంపాదించగా సన్నీ దాని అర్థం నేను చెబుతాను అంటూ కౌంటర్ ఇచ్చాడు.
Recommended Video

మాస్ స్టెప్పులతో..
ఇక శ్రీదేవి ని చూసిన కళ్ళతో కాజల్ ను ఆ గెటప్ లో చూడండి పై సన్నీ ఊహించని విధంగా కామెడీ కౌంటర్లు వేశాడు. జలకన్య కథ అంటూ మళ్లీ దేవకన్య అంటూ కాజల్ ను కాస్త కన్ఫ్యూజన్ లో పడేశాడు. ఇక మానస్ , కాజల్ అబ్బనీ తియ్యని దెబ్బ అంటూ స్టెప్పులు వేశారు. ఆ తరువాత మానస్ పవర్ స్టార్ గబ్బర్ సింగ్ స్టెప్పులతో బాగానే ఆకట్టుకున్నాడు. చూస్తుంటే ఈరోజు కంటెస్టెంట్స్ చాలా గట్టిగానే ఎంటర్టైన్మెంట్ అంఫించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











