twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మానస్ తో ప్రియాంక సింగ్ లవ్ సీన్స్.. తొలిసారిగా అలా బయట కనిపించిన బిగ్ బాస్ జంట!

    |

    బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితుల ప్రభావం వలన ఒకరిపై మరొకరు ఎంతో ఆప్యాయతను పెంచుకుంటూ ఉంటారు. ఈ ఆటలో కొంతమంది మంచి స్నేహితులుగా మారుతుంటే మరికొంతమంది ఒక మంచి లవ్ బర్డ్స్ దర్శనమిస్తూ వుంటారు. బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆ తరహా రిలేషన్ అయితే తెలుగులో ఇంతవరకు కొనసాగలేదు. ఇక రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా మానస్ ప్రియాంక సింగ్ ఇద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉంటున్నట్లు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా మానస్, ప్రియాంక ఇద్దరూ కూడా మొదటిసారి బయట ప్రపంచంలో క్యూట్ లవ్ సీన్ తో దర్శనమివ్వడం విశేషం. పూర్తి వివరాల్లోకి వెళితే..

    బిగ్ బాస్ తో మంచి క్రేజ్

    బిగ్ బాస్ తో మంచి క్రేజ్

    అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిపోయిన ప్రియాంక సింగ్ మొదట పలు రియాల్టీ షోలలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకుని ఆ తర్వాత టీవీ రంగంలో బిజీగా కనిపించే ప్రయత్నం చేసింది. ఆమెకు ఎక్కువగా బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మంచి క్రేజ్ అయితే దక్కింది.

     పొరపాట్లు చేసినప్పటికీ..

    పొరపాట్లు చేసినప్పటికీ..

    బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో మంచి కంటెస్టెంట్ గా పోరాడిన ప్రియాంక సింగ్ మధ్యలో కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ కూడా ఫైనల్ వరకు వెళుతుంది అని అందరూ అనుకున్నారు. తప్పకుండా ఆమె కూడా బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు కూడా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. కానీ ప్రియాంక సింగ్ మాత్రం పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళలేక పోయింది.

    ఆమెతో స్పెషల్ బాండింగ్

    ఆమెతో స్పెషల్ బాండింగ్

    బిగ్ బాస్ లో ప్రియాంక సింగ్ ఇతర కంటెస్టెంట్స్ తో అయితే మంచి బంధంతో కొనసాగింది. ముఖ్యంగా ఆర్టిస్ట్ ప్రియతో కూడా ఆమెకు మంచి బాండింగ్ ఏర్పడింది. వీరిద్దరు కూడా తరచూ కలుసుకుంటూనే ఉంటారు. తల్లీకూతుళ్ల తరహాలో ఉండే ఈ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు.

     మానస్ తో హద్దులు దాటి..

    మానస్ తో హద్దులు దాటి..

    అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక సింగ్ ఎక్కువగా మానస్ తో కూడా ఒక స్పెషల్ బాండింగ్ ను ఏర్పరుచుకుంది. అతనికి ఎంతగానో ఆకర్షితురాలైన ప్రియాంక సింగ్ కొన్నిసార్లు హద్దులు దాటేసి మాట్లాడేసింది. తన జీవితం అందరిలానే ఉండి ఉంటే తప్పకుండా నీతో ఇష్టమైన జీవితాన్ని కొనసాగించేదాన్నని కూడా ఆమె తెలియచేసింది. ఇక మానస్ మాత్రం ఆమెను ఒక మంచి స్నేహితురాలిగా మాత్రమే చూశాడు.

    లవ్ సీన్..

    ఇక బయటకు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మనస్ ప్రియాంక ఇద్దరు కూడా ప్రత్యేకమైన ఇన్ స్టాగ్రామ్ పోస్టులతో ఆడియన్స్ ను ఆశ్చర్యపడుతున్నారు. రీసెంట్గా ప్రియాంక సింగ్ మానస్ తో ఒక లవ్ సీన్ తో రీల్ చేసింది. 'అబ్బాయిలు స్మార్ట్ గా ఉండడం కన్నా కూడా ఇన్నోసెంట్ గా ఉంటేనే బాగుంటుంది.. నాకు వాడి ఇన్నోసెన్స్ చాలా ఇష్టం..' అనే డైలాగ్ ను చెప్పిన ప్రియాంకను మనస్ చూసి సిగ్గుపడిపోయాడు. ప్రస్తుతం ఆ రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

    English summary
    Bigg boss 5 contestants Priyanka singh and manas love scene video viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X