Bigg Boss 5 finale: షన్నుతో రిలేషన్ గురించి నోరు విప్పిన సిరి.. అందుకే అలా అంటూ కామెంట్స్!

బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి అంకానికి చేరింది. ఇంకా క్షణాల వ్యవధిలోనే బిగ్ బాస్ ఐదో సీజన్‌కు అంతా గుడ్ బై చెప్పబోతోన్నారు. ఇప్పటికే సన్నీ ఈ సీజన్ విజేత అని క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు జరుగుతున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో టాప్ ఫైవ్ నుంచి ముందు సిరి ఎలిమినేట్ అయింది. అయితే స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

సిరి ఎలిమినేట్

సిరి ఎలిమినేట్

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి సిరి హన్ముంతు ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చింది. టాప్‌-5లో సిరి, మానస్‌, షణ్ముఖ్‌, శ్రీరామ్‌, సన్నీలు ఉండగా ఆదివారం జరిగిన ఫినాలేలో హౌస్‌ నుంచి బయటకు వచ్చిన మొదటి కంటెస్టెంట్ గా సిరి నిలిచింది. అంతకుముందు 'పుష్ప' టీమ్‌ వచ్చి హౌస్‌లో సందడి చేసింది. దర్శకుడు సుకుమార్‌, కథానాయిక రష్మిక, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ 'పుష్ప' గురించి ప్రమోషన్స్ చేస్తుకున్నారు.

ఐదుగురు కంటెస్టెంట్‌ల ఫొటోలతో

ఐదుగురు కంటెస్టెంట్‌ల ఫొటోలతో

ఇక ఆ తరువాత రష్మిక, దేవిశ్రీ ఇద్దరూ హౌస్‌లో వెళ్లారు. టాప్‌-5 కంటెస్టెంట్‌లను పలు ప్రశ్నలు అడిగారు. ఐదుగురు కంటెస్టెంట్‌ల ఫొటోలతో ఉన్న డ్రోన్స్‌ వస్తాయని వాటిలో ఒకటి ఎగిరిపోతుందని ఆ డ్రోన్‌పై ఎవరి ఫొటో ఉంటే వారే హౌస్‌ నుంచి బయటకు వస్తారని తెలిపారు. అలా సిరి ఫొటో ఉన్న డ్రోన్‌ ఎగిరిపోగా, ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చింది.

ధన్యవాదాలు

ధన్యవాదాలు

ఆ తర్వాత నాగార్జున ఉన్న స్టేజ్ మీదకు వచ్చి సిరి మాట్లాడుతూ ''19మంది కంటెస్టెంట్‌లలో ఒకరిగా వచ్చిన నేను టాప్‌-5లో నిలవడం సంతోషంగా ఉందని, బిగ్‌బాస్‌ జర్నీ చాలా బాగుందని, చాలా సార్లు ఎమోషనల్‌ అయ్యా. ఏదైనా హౌస్‌లో నాకు నచ్చినట్టు నేను ఉన్నానని 15 వారాలు నన్ను భరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు మీరు లేనిదే నేను లేను'' అని భావోద్వేగానికి గురైంది.

ఇన్ డైరెక్ట్ గా స్పందించిం

ఇన్ డైరెక్ట్ గా స్పందించిం


ఇక తనకు తండ్రి లేడు కాబట్టి తండ్రి ప్రేమ లేదు, తల్లి బిజినెస్ లో ఉండడంతో ఆమెకు దూరమయ్యానని చెపింది. అందుకే నేను ఎమోషనల్ పర్శన్ అని ఒక్కోసారి ఎమోషనల్ అయ్యానని చెబుతూ షన్నుతో రిలేషన్ గురించి ఇన్ డైరెక్ట్ గా స్పందించింది. ఇక షోకి వచ్చి ఎవరిని అయినా గెలిచావా అంటే షన్ను అని చెప్పుకొచ్చింది.

 సిరి మదర్ శ్రీదేవీ ఎమోషనల్

సిరి మదర్ శ్రీదేవీ ఎమోషనల్


ఇక అంతకుముందు సిరి మదర్ శ్రీదేవీ మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. సిరికి బిగ్ బాస్ ఇంట్లో చెప్పిన మాటలతో అందరూ తనను తిట్టారని శ్రీదేవీ చెప్పుకొచ్చింది. అలా చెప్పకూడదని అందరూ అన్నారంటూ శ్రీదేవీ తెలిపింది. అయితే నాగార్జున మాత్రం శ్రీదేవిని ఓదార్చి, అమ్మ చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు.. మీ మనసులో ఏముందో అది చెప్పారు కదా? దాంట్లో తప్పేం లేదు అని నాగార్జున చెప్పుకొచ్చాడు.

హగ్గులు నాకు నచ్చలేదు

హగ్గులు నాకు నచ్చలేదు


షన్నుని హగ్ చేసుకోవడం నచ్చలేదు.. మీ హగ్గులు నాకు నచ్చలేదు.. ఓ అన్నలా, తండ్రిలా, ఫ్రెండ్స్‌లా షన్ను సాయం చేస్తున్నాడంటూ సిరి, షన్నుల గురించి శ్రీదేవీ చెప్పిన మాటలు పెను రచ్చకు దారి తీశాయి. అయితే ఈ విషయం మీద కూడా నాగార్జున మీ అమ్మ ఇలా అన్నారని అనడంతో నాకు తెలుసనీ, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడంతో అలా అని ఉంటారని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X