Bigg Boss 5 finale: చైతు వచ్చి టెంప్ట్ చేసినా తగ్గని టాప్ 3.. అనుకున్నట్టుగానే ఎలిమినేషన్!
బిగ్ బాస్ ఫినాలే ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్ లు లోపలి నుంచి బయటకు రాగా ఇప్పుడు మరో కంటెస్టెంట్ బయటకు రావడానికి సమయం ఆసన్నమైంది. అనూహ్యంగా ముందు నుంచి ఎలాంటి విచారణ లేకుండా నాగచైతన్య హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. మూడవ కంటెస్టెంట్ ని ఆయన ఎలిమినేట్ చేసి బయటకు తీసుకువచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

ప్రోమో కూడా
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫినాలే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హౌస్ లోకి నాగచైతన్య ఎంటరయ్యారు ప్రో కబడ్డీ లీగ్ తెలుగు టైటాన్స్ జట్టు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి రావడమే కాక మోషన్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ విధంగా ఆయన స్వయంగా నటించిన ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా విడుదల చేశారు. అయితే ఆసక్తికరంగా నాగచైతన్య నాగార్జున కి సంబంధించిన ఒక ప్రోమో కూడా కట్ చేయించి విడుదల చేయించారు.

బిగ్ బాస్ జర్నీ అంతా
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సీజన్ 5 జర్నీ ఏ.వీను చూపించారు నాగచైతన్య. బిగ్ బాస్ జర్నీ అంతా చూపగా అందరూ కూడా దానిని ఎంజాయ్ చేశారు. ఆ తరువాత ఇంతకు ముందు గతంలో ఎలా అయితే నాని లోపలికి వెళ్లి సిల్వర్ బ్రీఫ్ కేస్ తో నలుగురిని ఎట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించారో, ఇప్పుడు లోపలికి అలాంటి ఒక గోల్డెన్ బ్రీఫ్ కేస్ తో నాగచైతన్య ఎంటర్ అయ్యారు. సిల్వర్ బ్రీఫ్ కేసు లో ఉన్న మొత్తానికి మూడింతలు డబ్బు ఈ గోల్డ్ బ్రీఫ్ కేసు లో ఉంది అని ఎవరైనా దానిని ఆక్సెప్ట్ చేయగలిగితే ఆ డబ్బుతో బయటకు వచ్చేయొచ్చు అని ఆఫర్ ఇచ్చాడు.

తమ బిడ్డే విన్నర్ అని
అయితే లోపల ఉన్న సన్నీ షణ్ముక్ శ్రీరామచంద్ర ముగ్గురు కూడా ఈ ఆఫర్ స్వీకరించడానికి సిద్ధంగా లేరు.. ముగ్గురిని ఒక్కొక్కసారి అడిగిన తర్వాత వాళ్ళు ఎవరు తీసుకోవడానికి సిద్ధంగా లేరు అని అర్థం చేసుకున్న నాగార్జున వెంటనే బయట ఉన్న వాళ్ళ తల్లిదండ్రులను కూడా అడిగారు.. అయితే ఆసక్తికరంగా బయట ఉన్న తల్లిదండ్రులు కూడా ఎవ్వరూ ఈ ఆఫర్ తీసుకోవడానికి సిద్ధపడలేదు. ఎవరి తల్లిదండ్రులు తమ బిడ్డే విన్నర్ అని భావిస్తూ మాకు ఎలాంటి డబ్బు అవసరం లేదు అని కామెంట్ చేశారు.

శ్రీ రామచంద్ర ఎగ్జిట్
ఇక ఆ తర్వాత ఎట్టకేలకు నాగార్జున కోరిక మేరకు నాగచైతన్య ఎలిమినేషన్ ప్రాసెస్ అయ్యేవరకు లోపలే ఉన్నారు. ఇక బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రాసెస్ ప్రకారం షణ్ముఖ్ సన్నీ సేవ్ కాగా శ్రీ రామచంద్ర 3 కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు రాబోతున్నాడు. శ్రీరామ్ చంద్ర ఎలిమినేట్ అయ్యాడు. చైతన్య శ్రీరామ్ చంద్రను తీసుకొని స్టేజి పైకి వచ్చాడు.. ఇక మొత్తంమీద నాగచైతన్య ఎంట్రీ తో ఆసక్తికరంగా సాగిన ఈ వ్యవహారం శ్రీ రామచంద్ర ఎగ్జిట్ తో ముగిసింది. ఇక చూడాలి విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనేది.


Click it and Unblock the Notifications











