Bigg Boss 5 finale: మానస్ చేతికి 'బ్రహ్మాస్త్రం' .. ఆ మాటలకు ఫిదా అయి ఇచ్చేసిన జక్కన్న!
బిగ్ బాస్ సీజన్ 5 ఈ రోజు ఫినాలే ఎపిసోడ్ తో పూర్తి కానుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని మునుపెన్నడూ లేని విధంగా గ్రాండ్ గా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈ ఈవెంట్ కి రాజమౌళి, అలియా భట్, నాని, దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్, రష్మిక, సాయి పల్లవి, కృతిశెట్టి ఇలా చాలా మంది సినీ స్టార్స్ అతిథులుగా హాజరయ్యారు. ఇక ఒకరిని ఎలిమినేట్ చేస్తానని చెబుతూనే రాజమౌళితో ఒక స్పెషల్ పవర్ ఇప్పించారు నాగార్జున. ఆ వివరాల్లోకి వెళితే

అదృష్టం నాకు కలిగింది
ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఉన్న సిరి, మానస్, షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే సమయం వచ్చేసిందని నాగార్జున చెప్పారు. అయితే ముందుగా రాజమౌళిని స్టేజ్ పైకి పిలిచి 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి ప్రస్తావించారు నాగార్జున. ఇక ఈ సందర్భంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఒకే తెరపై చూడడం గొప్ప అనుభూతి కలిగిందని నాగార్జున అంటే ఇద్దరు స్టార్ హీరోలను ఒక సినిమాలో చూపించే అదృష్టం నాకు కలిగింది అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.

'బ్రహ్మాస్త్ర'
ఆ తర్వాత 'బ్రహ్మాస్త్ర' సినిమా గురించి మాట్లాడారు. మూడేళ్ల క్రితం కరణ్ జోహార్ ఫోన్ చేసి.. దర్శకుడు అయాన్ ను తన దగ్గరికి పంపించారని.. ఆయన చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని రాజమౌళి చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు అయాన్, అలియా భట్, రణబీర్ కపూర్ లు స్టేజ్ పైకి ఆహ్వానించారు. ఇక వీరంతా వచ్చాక వీరిని హౌస్ మేట్స్ అందరికీ చూపారు.

దబిడి దిబిడే
ఇక వీరందరినీ చూసి లోపల ఉన్న వారు బాగా ఎగ్జైట్ అయ్యారు. నాగార్జున అయితే కుళ్ళు కున్నారు కూడా. సన్నీ అయితే అలియా అంటూ గట్టిగా అరిచాడు. వెంటనే అలియా 'సన్నీ ఐ లవ్ యూ' అని చెప్పింది. అది విన్న సన్నీ మూర్చపోయి కింద పడి పోతూ కనిపించారు. తను యాంకర్ గా పని చేసినప్పుడు అలియాని కలిశానని.. ఆమెతో బాలయ్య డైలాగ్ చెప్పించానని.. మరోసారి వినాలనుకుంటున్నాను అన అడగ్గా.. 'దబిడి దిబిడే' అంటూ బాలయ్య డైలాగ్ చెప్పి ఆకట్టుకుంది అలియా.

తమలో ఉండే పవర్ గురించి
ఆ తరువాత హౌస్ మేట్స్ తో బ్రహ్మాస్త్రం అనే గేమ్ ఆడించారు. ఇందులో టాప్ 5 కంటెస్టెంట్స్ తమలో ఉండే పవర్ గురించి చెప్పాలని.. ఎవరి పవర్ దైతే బాగా నచ్చుతుందో వాళ్లకి 'బ్రహ్మాస్త్రం' ఇస్తామని చెప్పారు. ఎంతో కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చానని.. అదే తన పవర్ అని చెప్పాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా.. కామ్ గా ఉంటూ డెసిషన్ తీసుకోవడం తన పవర్ అని చెప్పారు మానస్.

మానస్ 'బ్రహ్మాస్త్రం'
ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఇండిపెండెంట్ గా ఉంటూ లక్ష్యాన్ని చేరుకోవడం తన పవర్ అని చెప్పారు శ్రీరామ్. పేషెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ తన పవర్ అని షణ్ముఖ్ చెప్పాడు. ఇక స్మైల్ అండ్ కాన్ఫిడెన్స్ తన పవర్ అని చెప్పింది సిరి. మానస్ చెప్పిన ఆన్సర్ తనకు నచ్చింది అని చెప్పిన రాజమౌళి అతనికే 'బ్రహ్మాస్త్రం' ఇచ్చారు. అయితే ఇది ఎందుకు వాడవచ్చు అనే విషయం మీద క్లారిటీ రాలేదు.


Click it and Unblock the Notifications











