twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss 5 finale: చరిత్రలోనే తొలిసారి అలా విన్నర్ సెలక్షన్.. అంచనాలను అందుకుంటూ విజేతగా సన్నీ

    |

    అనేక అంచనాలతో మొదలై, హాట్ టాపిక్ గా మారిన బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే విన్నర్ ను బిగ్ బాస్ టీమ్ తరపున స్వయంగా నాగార్జున అనౌన్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    సిరి ఎలిమినేట్

    సిరి ఎలిమినేట్

    టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఉన్న సిరి, మానస్, షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీలలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. ముందుగా రాజమౌళిని స్టేజ్ పైకి పిలిచి 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి మాట్లాడారు నాగార్జున. ఆ తర్వాత పుష్ప టీమ్ తరపున లోపలి వెళ్ళిన రష్మిక, దేవి శ్రీ ప్రసాద్ తమతో సిరిని ఎలిమినేట్ చేసి తీసుకు వచ్చారు.

    మానస్ ఎలిమినేట్

    మానస్ ఎలిమినేట్

    ఆ తర్వాత 'శ్యామ్ సింగరాయ్' సినిమా నటీనటులు నాని, సాయి పల్లవి, కృతిశెట్టిలు స్టేజ్ పైకి వచ్చారు. ముందుగా సాయిపల్లవి, కృతిశెట్టిలను హౌస్ లోకి పంపించారు. ఆ తరువాత నాని ఓ సిల్వర్ బాక్స్ తో హౌస్ లోకి వెళ్ళాడు. అలా వెళ్లిన నాని హౌస్ మేట్స్ కి ఒక ఆఫర్ చేశారు. తన చేతిలో ఉన్న సిల్వర్ బాక్స్ కావాలంటే ఈ నిమిషమే బయటకు వచ్చేయాలని చెప్పారు. విన్నర్ ఒక్కరే అని.. ప్రాక్టికల్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలని చెప్పారు. కానీ హౌస్ మేట్స్ ఎవరూ కూడా ఆ ఆఫర్ తీసుకోలేదు. ఆ తర్వాత హౌస్ మేట్స్ తో గేమ్ ఆడించి.. మానస్ ఎలిమినేట్ అయినట్లు అనౌన్స్ చేశారు.

    శ్రీరామచంద్ర ఎలిమినేట్

    శ్రీరామచంద్ర ఎలిమినేట్

    ఆ తరువాత నాని లాగానే నాగచైతన్య గోల్డెన్ బ్రీఫ్ కేస్ పట్టుకొని హౌస్ లోకి వెళ్లారు. సిల్వర్ సూట్ కేస్ కంటే ఇందులో మూడు రెట్లు ఎక్కువ అమౌంట్ ఉందని హౌస్ మేట్స్ ని టెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ ముగ్గురూ కూడా ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశారు. దీంతో హౌస్ మేట్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ సలహా తీసుకోమని అడగ్గా.. వాళ్లు కూడా సూట్ కేసు తీసుకోవద్దని చెప్పారు. ఆ తర్వాత చిన్న గేమ్ ఆడి శ్రీరామచంద్ర ఎలిమినేట్ అయినట్లు చెప్పారు.

    ఇద్దరితో కాసేపు సరదాగా

    ఇద్దరితో కాసేపు సరదాగా

    ఇక హౌస్ లో సన్నీ, షన్ను ఇద్దరూ మిగిలారు. వాళ్ళ ఇద్దరినీ మరింత టెన్షన్ పెట్టడానికా అన్నట్టుగా లోపలి ఫరియా అబ్దుల్లాను పంపి ఒక గేం ఆడించారు. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చేసింది. ఆ తరువాత నాగార్జున హౌస్ లోపలి వెళ్ళాడు. మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్ లోనే నాగార్జున అలా లోపలి వెళ్లి ఇద్దరితో కాసేపు సరదాగా గడిపారు.

    సన్నీ విజేతగా

    సన్నీ విజేతగా

    అక్కడి నుంచి బయటకి తీసుకొచ్చిన నాగార్జున చాలా సేపు అటు ఆడియన్స్ ను ఇటు సన్నీ, షన్నులను బాగా టెన్షన్ పెట్టి చివరికి సన్నీ విజేతగా గెలిచినట్టు ప్రకటించారు. దీంతో యాభై లక్షల ప్రైజ్ మనీ, ట్రోపీ, సువర్ణ భూమి వారి సువర్ణ కుటీర్ తరపు నుంచి పాతిక లక్షలు విలువ చేసే భూమి, ఒక టీవీఎస్ బైక్ ను గెలుచుకున్నారు. ఆ అన్నింటినీ కూడా తన తల్లి కళావతితో కలిసే సన్నీ తీసుకున్నారు. మొత్తం మీద సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచారు.

    English summary
    VJ sunny bagged the Bigg Boss telugu 5 title.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X