Bigg Boss Grand finale: నాగార్జునను సర్‌ప్రైజ్ చేసిన నాగచైతన్య.. గోల్డెన్ ఆఫర్ కూడా మిస్!
బిగ్ బాస్ సీజన్ 5, 105 రోజుల ప్రయాణంలో పోటాపోటీగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ చివరి వరకు వచ్చారు. అయితే ఈ ఫైనల్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునేది ఎవరు అనే విషయంలో ముందుగానే ఆడియన్స్ లో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అనుకున్నట్టుగానే మొదట సిరి ఎలిమినేట్ కాగా ఆ తరువాత మనస్, శ్రీ రామచంద్ర హౌస్ లో నుంచి బయటకు వచ్చేశారు. మొత్తానికి కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బలంగా పోరాడుతూనే వచ్చారు. ఇక చివరగా ఫైనల్ త్రీ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు నాగచైతన్య వచ్చి ఒక గోల్డెన్ ఆఫర్ కూడా ఇచ్చాడు. అంతే కాకుండా నాగార్జునకు మంచి ఆఫర్ కూడా ఇచ్చారు.

13కోట్ల ఓట్లు..
గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ విన్నర్ గా నిలిచేది సన్నీ అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈసారి బిగ్ బాస్ టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా 13 కోట్లకు పైగా ఓట్లు వచ్చినట్లు నాగార్జున వివరణ ఇచ్చారు. ఈ సారి జనాలు ఆదరణ కూడా భారీ స్థాయిలో దక్కినట్లు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఆ విషయంలో చాలా అదృష్టవంతులు అని వివరణ ఇచ్చారు

గట్టి నమ్మకంతో ఉన్నాడు. కానీ..
అందరూ ఊహించినట్లుగానే మొదట సిరి హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయిపోగా ఆ తర్వాత మనస్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. శ్రీ రామచంద్ర తప్పకుండ ఉంటాడు అని ఓ వర్గం వారు అనుకున్నారు. ఇక శ్రీ రామచంద్ర కూడా గట్టి నమ్మకంతో ఉన్నాడు. కానీ ఆ తర్వాత అతను కూడా ఎలిమినేట్ ఇవ్వక తప్పలేదు. ఇక చివరి వరకు సిరి, షన్ను ఇద్దరు కూడా చాలా ఆసక్తిగా బిగ్ బాస్ టైటిల్ కోసం ఎదురు చూశారు.

బ్రాండ్ అంబాసిడర్ గా నాగచైతన్య
పెద్దగా ఆసక్తిగా లేకుండా ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ను హౌస్ లోనే ప్రకటించడం జరిగింది. అయితే అంతకంటే ముందు నాగ చైతన్య నాగార్జున ఒక ప్రత్యేకమైన సర్ ప్రైజ్ ఇవ్వడం హౌస్ లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ నెల 22 నుంచి మొదలు కాబోయే ప్రో కబడ్డీ నాగచైతన్య ప్రత్యేకంగా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నట్లు నాగార్జున వివరణ ఇచ్చారు.

సర్ ప్రైజ్ ఇచ్చిన నాగచైతన్య
నాగార్జున కు సంబంధించిన ప్రత్యేకమైన AVని నాగ చైతన్య ద్వారా ప్రదర్శించడం జరిగింది. అందులో నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ ప్రయాణాన్ని చూపించారు. కామెడీ రొమాంటిక్ లవ్ ఎమోషనల్ సీరియస్ అయిన హైలెట్ మూమెంట్స్ ని చూపించారు. ఇక ఆ మూమెంట్స్ తనను ఎంతగానో ఆనందానికి గురి చేశాయని నాగార్జున ఎమోషనల్ నవ్వుతూ చెప్పాడు. ఒక కుటుంబ సభ్యులను కలుసుకున్నంత ఆనందం గా ఉంది అని ఇంత ఆనందాన్ని తనకు ఇచ్చిన నాగచైతన్య కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అని వివరణ ఇచ్చారు.

నాగచైతన్య ఆఫర్ మిస్..
ఇక నాగచైతన్య ఒక గోల్డెన్ బాక్స్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ముగ్గురికి ఒక ఆఫర్ ను కూడా ఇచ్చాడు. నాని ఇంతకుముందు తెచ్చిన సిల్వర్ బాక్స్ కంటే కూడా ఇందులో మూడింతలు ఎక్కువగా ప్రైజ్ మనీ ఉంది అంటూ.. ఎవరైతే టైటిల్ విన్నర్ కాలేము అనుకుంటున్నారో ఈ బాక్స్ తో తనతో రావచ్చు అని ఆఫర్ ఇచ్చాడు. కానీ ఎవరు కూడా ఆఫర్ కు ఒప్పుకోలేదు. శ్రీరామ్ సన్నీ షన్ను ముగ్గురు కూడా బిగ్ బాస్ టైటిల్ కోసం డబ్బు అవసరం లేదని తేల్చి చెప్పేశారు. నాని తరహాలోనే నాగ చైతన్య కూడా గోల్డెన్ బాక్స్ ను ఎవరికి ఇవ్వలేకపోయాడు.


Click it and Unblock the Notifications











