Bigg Boss 5 Grand Finale: నాని ఆఫర్ చేసిన సిల్వర్ బాక్స్..బంగారం లాంటి ఛాన్స్ మిస్.. అతను అవుట్!
బిగ్ బాస్ సీజన్ 5 లో ఎవరు గెలుస్తారు అనేది కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. ఫైనల్ ఎపిసోడ్ రోజు నాగార్జున ప్రతి ఒక్కరిని కూడా చాలా ఉత్కంఠకు గురి చేశారు. ఇక టాప్ 5 లో ఉన్న వారిలో మొదట సిరి హౌస్ లో నుంచి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇక సిరి ఎలిమినేట్ అయిన తర్వాత ప్రత్యేకమైన టాస్క్ ద్వారా నాని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. శ్యామ్ సింగరాయ్ టీమ్ గా వచ్చిన సాయి పల్లవి కృతి శెట్టి శెట్టి ముగ్గురు కూడా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ను బిగ్ బాస్ స్టేజిపైకి తీసుకువచ్చారు. అయితే అంతకంటే ముందు నాగార్జున ద్వారా కంటెస్టెంట్స్ అందరికి కూడా నాని ఒక ఆఫర్ అయితే ఇచ్చాడు.

దీప్తిని గుర్తు చేసిన నాని
శ్యామ్ సింగరాయి ప్రమోషన్లో భాగంగా నాని సాయి పల్లవి అలాగే కృతి శెట్టి కూడా బిగ్ బాస్ సీజన్ 5 లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక నాగార్జున నానితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇదివరకే నాని బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా వ్యవహరించారని గుర్తు చేశారు. ఇక నాని దీప్తి సునయన గురించి కూడా వివరణ ఇవ్వడం మరొక విశేషం. అందుకు షణ్ముఖ అయితే చాలా సిగ్గుపడిపోయాడు.

నాని ఆఫర్..
సీజన్ 5 ఫైనల్ ఎపిసోడ్ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగింది. టాప్ 5 లో విజే సన్నీ శ్రీరామచంద్రం మానస్ షణ్ముఖ్ జస్వంత్ పోటాపోటీగా కొనసాగుతూ వచ్చారు. అయితే మొదట సిరి హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఆమెను దేవి శ్రీ ప్రసాద్ రష్మీక మందన్న స్టేజ్ పైకి తీసుకు వచ్చారు. ఇక మిగతా నలుగురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ముందు నాని బంపర్ ఆఫర్ ఇచ్చారు. తప్పకుండా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతాడని అయితే మీ నలుగురికి ఒక ఆఫర్ కూడా ఇస్తున్నట్లు తెలియజేశారు.

నాని ఆఫర్ ను రిజెక్ట్ చేసిన కంటెస్టెంట్స్
సిల్వర్ బాక్స్ తన వద్ద ఉంది అని అందులో మంచి క్యాష్ ఉంటుందని అయితే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలవలేను అని అనుకున్నవారు ఈ క్యాష్ తీసుకొని వెళ్లిపోవచ్చు అని తెలియజేశారు. అయితే అందుకు ఎవరు కూడా ఒప్పుకోలేదు. దీంతో నాగార్జున మరొక అవకాశం కూడా ఇచ్చాడు. మ్యూజిక్ రావడంతో సాయిపల్లవి కొత్త టెన్షన్ పడుతూ పక్కకు వెళ్లిపోయింది.

మొదట సన్నీ, షన్ను
ఇక ఎవరు కూడా నాని ఇచ్చిన ఆఫర్ కు ఒప్పుకోకపోవడంతో నాగార్జున తదుపరి ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించారు. నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలి అంటే ఒక రివర్ పుల్లర్ ను లాగాలి అని.. అయితే ఎవరు ఫోటో అయితే కింద పడుతుందో వారు ఎలిమినేట్ అయినట్లు అని నాగార్జున తెలియజేశారు. ఇక మొదట సన్నీ సేఫ్ జోన్ లోకి రాగా తరువాత షణ్ముక్ సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

మానస్ ఎలిమినేట్
ఇక ఆ తర్వాత శ్రీ రామచంద్ర మానస్ ఇద్దరు కూడా ఒకేసారి పుల్లర్ ను లాగుతూ ఉండడంతో అందరిలో చాలా టెన్షన్ కనిపించింది. ఇక చివరికి మానస్ ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు. సాయి పల్లవి నాని కృతి శెట్టి ముగ్గురు కూడా అందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతూ మానస్ ను హ్యాపీగా హౌస్ లో నుంచి బయటకు తీసుకు వెళ్లారు. అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి శ్యామ్ సింగ్ సినిమా చూడాలి అని నాని ప్రత్యేకంగా కోరుకున్నారు.


Click it and Unblock the Notifications











