Bigg Boss 5: కిందికి వంగాను.. ఫటక్‌ అని ముద్దు పెట్టేశాడు.. జెస్సి కిస్సుకు ప్రియాంక ఆనందం

బిగ్ బాస్ లో ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాకూడా అప్పుడప్పుడు రొమాంటిక్ డోస్ మాత్రం గట్టిగానే కనిపిస్తూ ఉంటుంది. కంటెస్టెంట్స్ తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ ఒక్కసారిగా మైమరిచిపోయి రొమాంటిక్ యాంగిల్ ను బయట పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు అది ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చు. బుల్లితెరపై బిగ్ బాస్ షో మొదలైనప్పటి నుంచి కూడా ఇలాంటివి కొన్ని రెగ్యులర్ గా మారాయి ఇక ఈ సారి మాత్రం కంటెస్టెంట్స్ మధ్యలో కొనసాగుతున్న కెమిస్ట్రీ మాత్రం అంతగా కనెక్ట్ అవ్వడం లేదు అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. కానీ కొందరు రొమాన్స్ విషయంలో మాత్రం చాలా దూకుడుగా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తోంది. ఇక ప్రియాంక అయితే విభిన్నమైన తరహాలో అందరితోనూ కెమిస్ట్రీని కొనసాగించేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

 ప్రియాంక జెస్సి రొమాన్స్

ప్రియాంక జెస్సి రొమాన్స్

మానస్ తో ఎక్కువగా స్పెషల్ బాటింగ్ ను కొనసాగించిన ప్రియంక మళ్ళీ వెంటనే ప్లాన్ మార్చేస్తోంది. ఇక ఇటీవల ఆమె ఎక్కువగా జెస్సితో కనిపించడం విశేషం. మొన్న జెస్సికి కొంచెం అస్వస్థతగా ఉండడంతో పక్కనే కూర్చుని అతన్ని గరాబంగా ముద్దు చేసింది. అయితే ఇక తనకు ముద్దు పెట్టవచ్చు కదా అంటూ జెస్సి కూడా ఓపెన్ గా అడిగేసాడు. అంతేకాకుండా పక్కనే ఉన్న జెస్సి కూడా మరొక వైపు నుంచి ముద్దు పెట్టమని చెప్పాడు. కీర్తి సిరి కాస్త కౌంటర్ ఇచ్చినప్పటికీ ప్రియాంక మాత్రం అతనికి కాస్త సపోర్ట్ గా ప్రవర్తించింది.

జెస్సిలో అలాంటి యాంగిల్

జెస్సిలో అలాంటి యాంగిల్

జెస్సి అప్పుడప్పుడు తనలోనే లవర్ బాయ్ ను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాడు. రెగ్యులర్ గా టాస్క్ లలో గొడవ పడడం కామన్ అయిపోయింది అనుకొన్నాడో ఏమో గాని రొమాంటిక్ యాంగిల్ లో కూడా చూపించాలి అని బాగానే ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. గతంలో శ్వేతతో కూడా మనోహర అంటూ రొమాంటిక్ డాన్స్ చేయాలని ఉందని బిగ్ బాస్ ను ప్రత్యేకంగా రిక్వెస్ట్ కూడా చేశాడు.

ప్రియాంకకు జెస్సి కిస్

ప్రియాంకకు జెస్సి కిస్

ప్రియాంక పై అతను ఈ మధ్య ఎక్కువగా ట్రావెల్ అవుతున్నాడు. అయితే ఈ వారం టాస్క్ లో భాగంగా సూపర్ విల్లన్స్ టీమ్ గెలవడంతో ఆ టీం లోని సభ్యులు అందరూ కూడా ఒక్కసారిగా సంబరాలు చేసుకున్నారు. జెస్సి అయితే ఏకంగా ప్రియాంకకు ముద్దు కూడా పెట్టేసాడు. సెలబ్రేషన్స్ ఈ రేంజ్ లో చేసుకుంటారు అని ఎవరు అయితే ఊహించలేదు. ప్రియాంక వెనుక నుంచి ఆఫ్ చేసుకొని ఉండగా అతను మాత్రం ఏకంగా ముద్దు పెట్టేసాడు.

Recommended Video

105 Minutes Movie Official Teaser || Hansika Motwani
 ‘ఛీ నేను ఎందుకు పెడతాను..

‘ఛీ నేను ఎందుకు పెడతాను..

అయితే జెస్సీ ముద్దు పెట్టినందుకు ప్రియాంక పెద్దగా సీరియస్ అయితే కాలేదు. వీళ్లను చూసిన శ్రీరాముడు పెద్దగా నవ్వేశాడు. ఇక అదే విషయాన్ని షణ్ముఖ్ జస్వంత్ కి కూడా తెలియజేశాడు. ఆ విషయం తెలియగానే అతను కూడా ఆశ్చర్యపోతూ ఏంటీ ముద్దు పెట్టేశావా? అని అనగానే 'ఛీ నేను ఎందుకు పెడతాను.. వాడే పెట్టాడు.. కంగ్రాట్స్ అని కిందికి వంగాను.. ఫటక్‌ అని ముద్దు పెట్టేశాడు' అంటూ ప్రియాంక సిగ్గుపడుతూ క్లారిటీ ఇచ్చేసింది. జెస్సి ముద్దులకి ప్రియాంక బాగానే హ్యాపీ అయినట్లు అర్ధమవుతుంది. మరి వీరి సంబరాలు ఇంకా ఎంతవరకు వెళతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X