twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss 5పై మొదటిసారి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఈసారి ఎన్ని రోజులంటే.. హైలెట్ అదే?

    |

    ఇండియన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో అయినటువంటి బిగ్ బాస్ షో మొదట అసలు సౌత్ ఇండస్ట్రీలో క్లిక్కవుతుందా లేదా లేదా అనుమానాలు చాలానే వచ్చాయి. ముఖ్యంగా తెలుగులో మన వాళ్లకు నచ్చడం చాలా కష్టమని కూడా అనుకున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం చాలా తొందరగానే అలవాటు పడ్డారు. మొదటి షో తోనే ఎన్టీఆర్ భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత నాని నాగార్జున మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ఐదవ సీజన్ కూడా మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే ఇక ఈ సారి అంతకు మించి అనేలా మంచి ఎంటర్టైన్మెంట్తో రాబోతున్నట్లు మొదటి సారి నాగార్జున వివరణ ఇచ్చారు.

    ఈసారి భారీగా రెమ్యునరేషన్

    ఈసారి భారీగా రెమ్యునరేషన్

    గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ 5వ సీజన్ కు సంబంధించిన అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కంటెస్టెంట్స్ విషయంలో ఫుల్ ఫైనల్ లిస్ట్ కూడా ఇదేనని కథనాలు వెలువడ్డాయి. ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్స్ అయితే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా అందుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక అందులో యూట్యూబ్ స్టార్స్ తో పాటు టెలివిజన్ రంగానికి సంబంధించిన చాలామంది నటీనటులు ఉన్నట్లు టాక్ అయితే వచ్చింది.

    Recommended Video

    Bigg Boss-5 టైం విషయంలో షాకిచ్చిన స్టార్ మా.. నేటి నుంచి క్వారంటైన్ లో...!! || Filmibeat Telugu
    హైలెట్ అవే అంటూ..

    హైలెట్ అవే అంటూ..

    ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలు కాబోతున్న సందర్భంగా హోస్ట్ గా చేయబోతున్న నాగార్జున మొదటిసారి స్పందించారు. డ్రామా, రొమాన్స్‌, యాక్షన్‌, వినోదంను నూతన టాస్క్‌లను హైలెట్ చేస్తూ ఆసక్తికరమైన పోటీదారులతో మొత్తం కుటుంబానికి సమగ్రమైన వినోదాన్ని అందించనున్నట్లు చెప్పారు. గత కొద్ది నెలలు ప్రతి ఒక్కరికీ కరోనా వలన పరిస్థితులు సవాల్‌గా నిలిచాయి. అయితే ఈసారి కూడా బిగ్ బాస్ షోతో మా అభిమానుల జీవితాలలో ఆనందం, ఉల్లాసం తిరిగి తీసుకురావాలనేది మా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

    ఎంటర్టైన్మెంట్ డోస్ మరింత ఎక్కువగా

    ఎంటర్టైన్మెంట్ డోస్ మరింత ఎక్కువగా

    అంతే కాకుండా ఓ నటుడిగా నా అనుభవంతో పోటీదారుల వాస్తవ భావాలను వెలుపలికి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రేక్షకులు కూడా వారిని మరింతగా అర్థం చేసుకోగలరని, కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించే ఈ షోలో భాగం కావడం పట్ల నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను అని కింగ్ నాగార్జున వివరణ ఇచ్చారు. ఇక ఈసారి గతంలో కంటే ఎంటర్టైన్మెంట్ డోస్ మరింత ఎక్కువగా ఉంటుందని కూడా షో నిర్వాహకులు వివరించారు.

     మొత్తం ఎన్ని రోజులంటే..?

    మొత్తం ఎన్ని రోజులంటే..?

    బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5 స్టార్‌ మాలో సెప్టెంబర్‌ 5 నుంచి మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు తొలి ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. అనంతరం 15 వారాల పాటు రాత్రి 10 గంటలకు సోమవారం-శుక్రవారం వరకూ కొనసాగుతుంది. ఇక రాత్రి 9 గంటలకు శని-ఆదివారాలలో ప్రసారమవుతుందని తెలియజేశారు. అంటే దాదాపు 100 రోజుల పాటు ఈ ఎంటర్టైన్మెంట్ షో కొనసాగుతుందన్నమాట. ఇక గత సీజన్ లో భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకున్న బిగ్ బాస్ తెలుగు షో ఈ సారి ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.

    English summary
    Bigg boss 5 latest clarification from host akkineni nagarjuna season full details,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X