Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Bigg Boss 5పై మొదటిసారి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఈసారి ఎన్ని రోజులంటే.. హైలెట్ అదే?
ఇండియన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో అయినటువంటి బిగ్ బాస్ షో మొదట అసలు సౌత్ ఇండస్ట్రీలో క్లిక్కవుతుందా లేదా లేదా అనుమానాలు చాలానే వచ్చాయి. ముఖ్యంగా తెలుగులో మన వాళ్లకు నచ్చడం చాలా కష్టమని కూడా అనుకున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం చాలా తొందరగానే అలవాటు పడ్డారు. మొదటి షో తోనే ఎన్టీఆర్ భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత నాని నాగార్జున మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ఐదవ సీజన్ కూడా మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే ఇక ఈ సారి అంతకు మించి అనేలా మంచి ఎంటర్టైన్మెంట్తో రాబోతున్నట్లు మొదటి సారి నాగార్జున వివరణ ఇచ్చారు.
ఈసారి భారీగా రెమ్యునరేషన్
గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ 5వ సీజన్ కు సంబంధించిన అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కంటెస్టెంట్స్ విషయంలో ఫుల్ ఫైనల్ లిస్ట్ కూడా ఇదేనని కథనాలు వెలువడ్డాయి. ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్స్ అయితే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా అందుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక అందులో యూట్యూబ్ స్టార్స్ తో పాటు టెలివిజన్ రంగానికి సంబంధించిన చాలామంది నటీనటులు ఉన్నట్లు టాక్ అయితే వచ్చింది.
Recommended Video
హైలెట్ అవే అంటూ..
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలు కాబోతున్న సందర్భంగా హోస్ట్ గా చేయబోతున్న నాగార్జున మొదటిసారి స్పందించారు. డ్రామా, రొమాన్స్, యాక్షన్, వినోదంను నూతన టాస్క్‌లను హైలెట్ చేస్తూ ఆసక్తికరమైన పోటీదారులతో మొత్తం కుటుంబానికి సమగ్రమైన వినోదాన్ని అందించనున్నట్లు చెప్పారు. గత కొద్ది నెలలు ప్రతి ఒక్కరికీ కరోనా వలన పరిస్థితులు సవాల్‌గా నిలిచాయి. అయితే ఈసారి కూడా బిగ్ బాస్ షోతో మా అభిమానుల జీవితాలలో ఆనందం, ఉల్లాసం తిరిగి తీసుకురావాలనేది మా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
ఎంటర్టైన్మెంట్ డోస్ మరింత ఎక్కువగా
అంతే కాకుండా ఓ నటుడిగా నా అనుభవంతో పోటీదారుల వాస్తవ భావాలను వెలుపలికి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రేక్షకులు కూడా వారిని మరింతగా అర్థం చేసుకోగలరని, కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించే ఈ షోలో భాగం కావడం పట్ల నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను అని కింగ్ నాగార్జున వివరణ ఇచ్చారు. ఇక ఈసారి గతంలో కంటే ఎంటర్టైన్మెంట్ డోస్ మరింత ఎక్కువగా ఉంటుందని కూడా షో నిర్వాహకులు వివరించారు.
మొత్తం ఎన్ని రోజులంటే..?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 స్టార్ మాలో సెప్టెంబర్ 5 నుంచి మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు తొలి ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. అనంతరం 15 వారాల పాటు రాత్రి 10 గంటలకు సోమవారం-శుక్రవారం వరకూ కొనసాగుతుంది. ఇక రాత్రి 9 గంటలకు శని-ఆదివారాలలో ప్రసారమవుతుందని తెలియజేశారు. అంటే దాదాపు 100 రోజుల పాటు ఈ ఎంటర్టైన్మెంట్ షో కొనసాగుతుందన్నమాట. ఇక గత సీజన్ లో భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకున్న బిగ్ బాస్ తెలుగు షో ఈ సారి ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.