twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే.. మరోసారి సోహెల్ కూడా..

    |

    బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పుడు అంచనాలు బాగానే ఉన్నప్పటికీ సరైన ఓపెనింగ్స్ అయితే అందుకోలేదు. మొత్తానికి 105రోజుల ప్రయాణాన్ని విజయవంతంగా ముగించారు. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా ఎంతగానో క్రేజ్ అందుకున్న బిగ్ బాస్ ఈ సీజన్ మధ్యలో కొంత నిరాశపరిచినప్పటికి ఫైనల్ లో మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది. ఇక సీజన్ 4 విజేతగా అనుకున్నట్లుగానే అభిజిత్ గెలిచేశాడు. ఇప్పుడు సీజన్ 5కోసం రెడీ అవుతున్నారు.

    సీరియల్స్ కంటే తక్కువ రేటింగ్స్

    సీరియల్స్ కంటే తక్కువ రేటింగ్స్

    బిగ్ బాస్ షో మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో పెద్దగా ఆకట్టుకోని బిగ్ బాస్ మధ్యలో కూడా కొంత వరకు బోర్ కొట్టిచిందనే చెప్పాలి. ఊహించని విధంగా కొన్నిసార్లు సీరియల్స్ కంటే దారుణమైన రేటింగ్స్ ను అందుకున్నాయి. ఒకసారైతే స్టార్ మా టాప్ ప్రోగ్రామ్ లిస్టులో 5వ స్థానానికి పడిపోయింది. ఇక ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులతో షో మళ్ళీ గాడిలో పడింది.

    విన్నర్ విషయంలో ముందే క్లారిటీ..

    విన్నర్ విషయంలో ముందే క్లారిటీ..

    మొత్తానికి అందరూ ఉహించినట్లుగానే అభిజిత్ గెలిచేశాడు. షో మొదలైన రెండు నెలలకే అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అని దాదాపు అందరు పసిగట్టేశారు. మిగతా వాళ్ళు చేసిన పొరపాట్లే అతనికి బాగా కలిసొచ్చాయి. అభిజిత్ నిజానికి కొంతమంది మంది పడిన కష్టంలో కొంచెం కూడా పడలేదు. వీలైనంత వరకు పొరపాట్లు చేయకుండా తన గేమ్ తన స్టైల్ లో ఆడుతూ వచ్చాడు.

     సీజన్ 5.. లేటెస్ట్ అప్డేట్

    సీజన్ 5.. లేటెస్ట్ అప్డేట్

    ఇక సీజన్ 5 కోసం కూడా బిగ్ బాస్ నిర్వాహకులు అప్పుడే ఏర్పాట్లను షురూ చేసినట్లు సమాచారం. ఏప్రిల్ చివరి వారంలో లేక ఆ తరువాత జూన్ మొదటి వారంలో షోను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. సీజన్ 5లో గత సీజన్ కంటే గ్రాండ్ గా నిర్వహించాలని నిర్వాహకులు ప్లాన్స్ గట్టిగానే వేస్తున్నట్లు సమాచారం. హోస్ట్ గా అయితే మళ్ళీ నాగార్జుననే ఫిక్స్ చేసినట్లు టాక్.

    సోహెల్ కూడా..

    సోహెల్ కూడా..

    ఇక 5వ సీజన్ కోసం కంటెస్టెంట్స్ విషయంలో భారీ స్థాయిలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఇక సీజన్ 5లో సోహెల్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ను ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మరి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.

    Recommended Video

    KGF Chapter 2 : Yash & Prashant Neel Plans For a Powerful Climax
     సీజన్ 4కు పడిన ఓట్లు.. ఎన్నంటే..

    సీజన్ 4కు పడిన ఓట్లు.. ఎన్నంటే..

    గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్ 4కు వచ్చిన మొత్తం ఓట్ల సంఖ్య చాలా డబుల్ అని చెప్పవచ్చు. కంటెస్టెంట్స్ చాలా వరకు వారికంటూ ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకోవడంతో ఓట్లు కూడా భారీగానే పడ్డాయి. గతంలో ఎప్పుడు లేని విదంగా బిగ్ బాస్ సీజన్ 4కు మొత్తం 15కోట్ల 55లక్షలక్ ఓట్లు దక్కినట్లు నాగార్జున వివరణ ఇచ్చారు.

    English summary
    Bigg Boss Season 4 has successfully completed a total of 105 days of travel. Bigg Boss, which received a lot of craze as the biggest reality show in the middle of this season, gave some entertainment in the final but never before. Abhijit won the season 4 as expected. However, the Bigg Boss show has set a new record for most votes cast.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X