For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 5: తెలిసే నిన్ను తిట్టాడు, వాడి గురించి నికేంటి అవసరం.. ప్రియాంక పర్సనల్ లవ్ పై నాగార్జున సీరియస్

  |

  బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. కంటెస్టెంట్స్ మధ్యలో ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా రోజురోజుకు మారుతూనే ఉంటాయి. ఒకప్పుడు ప్రేమగా ఉన్నవారు ఆ తర్వాత శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. బిగ్ బాస్ మొదటి అడుగు పెట్టినప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా తుది దశకు చేరుకుంటే మాత్రం ఒకరితో మరొకరు పోటీ పడక తప్పదు. అందుకే వీలైనంత వరకు కూడా స్నేహానికి కొందరు దూరంగానే ఉంటున్నారు. ఇక ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా చెప్పుకునే అవకాశం ఇచ్చాడు.

  ఆ బాధలు ఆడియన్స్ కు ఏమాత్రం కనెక్ట్ అయిన కూడా బిగ్ బాస్ హౌస్ లో కొన్నాళ్ళు ఓట్లతోనే సేఫ్ గా ఉండవచ్చు. ఒక విధంగా ఆడియెన్స్ మనసు గెలుచుకుంటే ఏ టెన్షన్స్ లేకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల నాగార్జున ప్రియాంక పింకీ తన ఎమోషనల్ స్టోరీ పై ఎవరు ఊహించని విధంగా స్పందించారు. అంతేకాకుండా మధ్యలో కాస్త సీరియస్ అయ్యారు.

  ఆ ఒక్క విషయంలో..

  ఆ ఒక్క విషయంలో..

  బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ విషయంలో ఓ వర్గం ప్రేక్షకులు పూర్తి స్థాయిలో అయితే సంతృప్తిగా లేరని సోషల్ మీడియాలో సర్వేలు చెబుతున్నాయి. గతంలో కంటే ఈసారి కొంత ఎక్కువ స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు తీసుకువస్తారని అనుకున్నారు. బిగ్ బాస్ మాత్రం ఆ విషయంలో పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదని కామెంట్స్ అయితే వస్తున్నాయి. అయితే టాస్క్ విషయంలో మాత్రం అప్పుడప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గకూడదని ఎంటర్టైన్మెంట్ కూడా పెంచుతున్నారు.

  అబ్బాయితో ప్రియాంక ప్రేమ కథ

  అబ్బాయితో ప్రియాంక ప్రేమ కథ

  రీసెంట్ గా కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి తొలి ప్రేమ గురించి కెమెరా ముందు వివరించిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా భిన్నంగా వారి తొలి ప్రేమ గురించి తెలుపగా మరికొందరు మాత్రం ఎంతగానో బాధపడుతూ తెలియజేశారు. అయితే జబర్దస్త్ ప్రియాంక పింకీ మాత్రం కంటతడి పెట్టించే విధంగా తన ప్రేమ కథను తెలియజేసింది. తను అమ్మాయిగా మారకముందు నుంచి కూడా ఒక అబ్బాయితో చాలా క్లోజ్ గా ఉండే దాన్ని అంటూ అతనితో నా జీవితాంతం గడపాలని అనుకున్నట్లు కూడా ప్రియాంక తెలియజేసింది.

  నన్ను ఎవరు అంత బాధ పెట్టలేదు

  నన్ను ఎవరు అంత బాధ పెట్టలేదు

  అయితే అమ్మాయి గా మారిన తర్వాత పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ కూడా చేసినట్లు వివరించిన ప్రియాంక మొదట్లో అతను పాజిటివ్ గా స్పందించినట్లు కూడా వివరణ ఇచ్చింది. అమ్మాయిగా మారిన అనంతరం కొన్నాళ్ళకు అతను వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆ తర్వాత ఎంత బతిమాలినా కూడా తనతో ఉండడం ఇష్టం లేదని అన్నాడు. అంతే కాకుండా నువ్వు అమ్మాయివే కాదు, పిల్లలను కూడా పట్టరు కదా అంటూ గుచ్చి గుచ్చి అవమానించారు అంటూ ఏడుస్తూ చెప్పిన పింకీ ఎవరు కూడా తనను ఆ స్థాయిలో బాధ పెట్టలేదు అని అతని వెళ్లిపోయే సమయంలో పరిగెత్తుకుంటూ బైక్ వెనకాల వెళ్లినట్లు కూడా తెలిపింది.

  నాగార్జున సీరియస్

  నాగార్జున సీరియస్

  ఇక ఆ తర్వాత అతను సంతోషంగా ఉండాలని ఏ కష్టం వచ్చినా కూడా నేను ఉన్నాను అని ప్రియాంక ఓపెన్ గా వివరణ ఇచ్చింది. అదే విషయం పై నాగార్జున స్పందిస్తూ ఎవరూ ఊహించని విధంగా ప్రియాంకకు ఒక విధంగా మద్దతు ఇస్తూనే మరొక విధంగా ఆమెకు పాజిటివ్ గా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అతను బాధించే విధంగా గుచ్చి గుచ్చి కావాలని అవమానించాడు.

  అయినప్పటికీ కూడా నువ్వు అతడిని చాలా మంచివాడు అన్నట్లు చెప్పడం ఎవరికీ నచ్చలేదు. వాడు తెలిసే నన్ను తిట్టాడు. అయినా కూడా వాడి గురించి ఆలోచించడం మంచిదే అయినప్పటికీ కావాలని అతను నన్ను బాధ పెట్టాడు. ఆ విషయం గురించి ఆలోచించిన వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడింది సరైనది కాదు..అని అన్నారు.

  Bigg Boss Telugu 5, Episode 19 Highlights || Filmibeat Telugu
  వాడి గురించి నీకు ఏంటి అవసరం..

  వాడి గురించి నీకు ఏంటి అవసరం..

  అతను వదిలి వెళ్లిపోయిన తర్వాత వాడి గురించి నీకు ఏంటి అవసరం నువ్వు జీవితంలో అంతకంటే పెద్ద కష్టాలను చూసి ఇక్కడి వరకు వచ్చావు. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది కాబట్టి ఇక్కడితో నువ్వు నీ గురించి పట్టించుకోని.. వాడి గురించి ఆలోచించకూడదు. ధైర్యంగా ముందుకు వెళ్లి నువ్వు అనుకున్నది సాధించాలి అని నాగార్జున కాస్త సీరియస్ గానే ప్రియాంక కు మనో ధైర్యాన్ని ఇచ్చారు.

  ఇక ఆ తర్వాత ప్రియాంక కూడా నాగార్జున చెప్పిన విషయాలను కు కృతజ్ఞతలు చెప్పింది నిజంగా మీరు చెప్పింది నిజం అని, ఇప్పటి నుంచి నేను అలానే ముందుకు సాగుతానని ప్రియాంక కూడా నవ్వుతూ వివరణ ఇచ్చింది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

  అయితే డేంజర్ జోన్ లో ఉన్నటువంటి ముగ్గురిలో లహరి వెళ్లి పోవడం ఖాయమని తెలుస్తోంది. మరి ఆమె వెళ్ళిపోయే ముందు ఎవరికి షాక్ ఇస్తుందో చూడాలి. అలాగే ప్రియ విషయంలో రావికి ఆమె షాక్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  English summary
  Bigg boss 5 Nagarajuna serious on priyanka love story
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X