Bigg Boss 5: దిండుతో అలాంటి పని.. పోనీ ప్రియాంకతో చేస్తావా.. నాగ్ రొమాంటిక్ పంచ్

బిగ్ బాస్ సీజన్ 5 లో ఎవరూ ఊహించని విధంగా ఆసక్తికరమైన సన్నివేశాలు చాలానే చోటుచేసుకుంటున్నాయి. ఈ సీజన్ స్టార్ట్ ఆయినప్పటి నుంచి కూడా కంటెస్టెంట్స్ విషయంలో ఓ వర్గం ప్రేక్షకులు అయితే అంతగా ఆసక్తి చూపడం లేదనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ బిగ్ బాస్ మాత్రం టాస్క్ లతో ఎప్పటికప్పుడు ఆటను మరింత ఇంట్రెస్టింగ్ గా మారుస్తూనే ఉన్నాడు. మొత్తానికి ప్రియాంక ఈ వారం ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించాడు. ఇక ఆమె వెళ్లే సమయంలో నాగార్జున ప్రియాంకను అలాగే హౌస్ మెంట్స్ ను కూడా పలు రకాల గేమ్స్ ఆడించే మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారు.

మొదట్లోనే ఎలిమినేట్ అవుతుందేమో అని..

మొదట్లోనే ఎలిమినేట్ అవుతుందేమో అని..

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో అందరికంటే కాస్త భిన్నంగా ప్రియాంక మాత్రం చాలా బలంగా ముందుకు సాగింది. మొత్తానికి అందరూ ఊహించినట్లే ఆమె ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. షో స్టార్ట్ అయినప్పుడు మధ్యలోనే వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నారు. మొదట్లో కాస్త నిదానంగా ఎలాంటి గొడవలు లేకుండా ముందుకు సాగిన ప్రియాంక కొద్దిరోజుల తర్వాత ఒక్కసారి తనలోని దూకుడును చూపించింది. ఇక ఉమాదేవితో అవే చాలా రకాలుగా గొడవలు పడింది. అప్పుడే ప్రియాంక ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే గట్టిగానే వచ్చింది.

చివరికి..కాజల్ , ప్రియాంక

చివరికి..కాజల్ , ప్రియాంక

ఏదేమైనప్పటికీ కూడా ప్రియంక 90 రోజులపాటు బిగ్ బాస్ లో తన శక్తిని చూపించి జనాల్లో మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఆమె వెళ్లిపోయే సమయంలో మిగతా కంటెస్టెంట్స్ అందరి మంచి కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. ముఖ్యంగా మానస్ తో ఆమెకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ప్రియాంక చాలా ఎమోషనల్ అయ్యింది. డేంజర్ జోన్ లో ఉన్నవారితో లూడో గేమ్ ఆడించిన నాగార్జున చివరికి కాజల్ ప్రియాంక ఉండడంతో కాజల్ సేఫ్ అయ్యిందని ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించేశారు.

దిండుతో రొమాన్స్

దిండుతో రొమాన్స్

ఇక ప్రియాంక వెళ్లేముందు మానస్ కు నాగార్జున ఒక ప్రత్యేకమైన ఛాలెంజ్ ఇచ్చాడు. దిండుతో కలిసి మంచి రొమాంటిక్ సీన్స్ ను క్రియేట్ చేయాలి అని చెప్పడంతో మానస్ కొద్దిసేపు ఇబ్బంది పడుతున్నట్లు చేశాడు. ఛాలెంజ్ గా తీసుకున్న మానస్ మెల్ల మెల్లగా దిండుతో బాగానే ట్రై చేశాడు కానీ ఆ విషయంలో నాగ్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక దిండుతో రొమాన్స్ ఎలా చేస్తామని ప్రశ్నించడంతో నాగ్ ఎవరూ ఊహించని విధంగా పంచ్ ఇచ్చాడు.

ప్రియాంకతో చేస్తావా?

ప్రియాంకతో చేస్తావా?

దిండుతో రొమాన్స్ చేయడం రావడం లేదు కదా అయితే ప్రియాంకతో చేస్తావా అంటూ నాగ్ ప్రశ్నించడంతో అందరూ షాక్ అయ్యారు. అస్సలు వద్దు అంటూ అలా చేయడం కన్నా కూడా దిండుతో చేయడమే నయం అని మానస్ ఊహించని విధంగా సమాధానం ఇవ్వడం విశేషం.

Recommended Video

Bigg Boss Telugu 5: Shanmukh Unstoppable | VJ Sunny Rampage | Filmibeat Telugu
మానస్ తో ఎమోషనల్..

మానస్ తో ఎమోషనల్..

ఏదేమైనప్పటికీ కూడా మానస్ కూడా ప్రియాంక వెళ్ళిపోయే సమయం లో చాలా ఎమోషనల్ గా అయ్యాడు. ఇక మానస్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని చాలా ఎమోషనల్ అయిన ప్రియాంక తనతో ఇంకా టైం స్పెండ్ చేయాల్సి ఉంటే బాగుండేది అని చాలా బాధపడింది. అంతే కాకుండా అతను ఎప్పుడు బాగుండాలి అని కోరుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X