Bigg Boss 5: ట్రాన్స్ జెండర్ అతన్ని ప్రేమిస్తుందని అంటే సెట్ కాదు.. ఎంతో మందిని చూశా: ప్రియాంక ఎమోషనల్

బిగ్ బాస్ హౌస్ లో గొడవలు ఎన్ని జరిగినా కూడా రొమాంటిక్ సన్నివేశాలు మాత్రం రెగ్యులర్ గా ఏదో ఒక సందర్భంలో కనిపిస్తూనే ఉంటాయి. కంటెస్టెంట్స్ చాలా వరకు స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆటలో భాగంగా కొన్ని సార్లు నటించక తప్పదు. గెలవాలి అంటే ఏదో ఒక వైపు ఉండాలి. కొందరు స్నేహంగా ఉంటూనే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. ఇక ఈసారి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో అలాంటి సన్నివేశాలు చాలానే కనిపించాయి. ఇక ట్రాన్స్ జెండర్ ప్రియాంక రొమాంటిక్ ట్రాక్ లను చాలా విభిన్నంగా కొనసాగించింది. అయితే మానస్ విషయంలో పింకి మరొక షాకింగ్ కామెంట్ చేయడం విశేషం.

ఓకే బైడ్ పై పడుకోవద్దని..

ఓకే బైడ్ పై పడుకోవద్దని..

72 వ రోజు బిగ్ బాస్ హౌస్ లో చిత్రవిచిత్రమైన డ్రామాలు కొనసాగాయి. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్ సిరి మధ్యలో కొనసాగిన డ్రామా ఎవరికీ అర్థం కాలేదు. 19 మంది 17 కెమెరాలు ఉన్నప్పుడు వేరు.. ఎనిమిది మంది 17 కెమెరాలు ఉన్నప్పుడు వేరు అంటూ ఇద్దరు కూడా ఓకే బైడ్ పై పడుకో వద్దు అని ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. రెగ్యులర్ గా ఇద్దరూ కలిసి ఒకే బెడ్ షేర్ చేసుకునే వారు. ఇక మధ్యలో జెస్సి వచ్చిన కూడా అతని దూరంగా ఉంచేవారు. కానీ 72వ రోజు మాత్రం ఈ జంట భిన్నంగా కనిపించింది.

కొంత డిస్టన్స్ అవసరమని..

కొంత డిస్టన్స్ అవసరమని..

షణ్ముఖ్ జస్వంత్ బాధపడుతుంటే సిరి ఎంత కోపంగా ఉన్నా కూడా చాలా కూల్ అయిపోతుంది. అతన్ని ఎవరు ఏమన్నా కూడా అస్సలు ఊరుకోదు. చాలా సైలెంట్ గానే వారి పై తన కోపాన్ని తెచ్చుకుంటుంది. షణ్ముఖ్ జస్వంత్ కూడా అదే తరహాలో ప్రవర్తిస్తూ ఉంటాడు. వీరు ఇద్దరు కూడా కలిసి గేమ్ ఆడుతున్నారు అని అందరికీ తెలిసిందే. కానీ అదే విషయాన్ని వీరికి చెబితే మాత్రం కొంచెం కూడా ఒప్పుకోరు. అందుకే కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ట్రై చేస్తున్నారు.

ప్రియాంక రొమాంటిక్ ట్రాక్

ప్రియాంక రొమాంటిక్ ట్రాక్

ఇక అందరు ఒక తరహాలో ఉంటే ప్రియాంక మాత్రం ఎప్పటికప్పుడు మరింత డిఫరెంట్ గా కనిపిస్తూ కెమెరాలను తనవైపు తిప్పుకుంటోంది. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా మానస్ తో ఒక డిఫరెంట్ రొమాంటిక్ ట్రాక్ నడుపుతోంది. అయితే మరికొన్ని సార్లు మాత్రం ఆమె ఎమోషనల్ గా ఫీల్ అవుతూ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా సన్నీ దగ్గర కూర్చున్న ప్రియాంక మానస్ గురించి చెప్పుకుని ఎంతగానో బాధ పడింది.

Recommended Video

VJ Sunny కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి బెదిరింపులు Madhavi Latha ఫైర్| Rowdy Rohini| Filmibeat Telugu
ఇలాంటి వాళ్ళను ఎంతో మందిని చూశా

ఇలాంటి వాళ్ళను ఎంతో మందిని చూశా

అతని గేమ్ నేను ఆడుతాను అని అనడం అస్సలు సరైనది కాదు అంటూ అతి ప్రేమ కూడా ప్రమాదమే అని మానస్ పట్ల అతి ప్రేమ ఏం చూపించాను అన్నయ్యా అంటూ సన్నీని ప్రశ్నించింది. మానస్ అంటే నాకు ఒక లైక్. కానీ నా ఆట నేను ఆడుతున్నాను. మా ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటే బయటకు వేరే విధంగా వెళుతుంది. మనస్ ఒక హీరో అతన్ని ట్రాన్స్ జెండర్ వచ్చి ఇష్టపడుతుంది అంటే అది సెట్ కాదు. నా జీవితంలో ఇలాంటి వాళ్ళను ఎంతో మందిని చూశాను అంటూ ప్రియాంక ఎమోషనల్ ఫీల్ అయింది. ఇకపై ప్రియాంక బాధపడుతూ ఉంటే మానస్ వచ్చి ఆమెకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X