Bigg Boss 5: మరోసారి మానస్ పై ప్రేమను బయటపెట్టిన ప్రియాంక.. కరెక్ట్ కాదని తెలిసినా అదే ఫీలింగ్!
బిగ్ బాస్ లో పరిస్థితులు ఎంత మారుతున్న కూడా ఒక విషయంలో మాత్రం కంటెస్టెంట్స్ వారే స్టైల్ ను ఏ మాత్రం మారడం లేదు. ముఖ్యంగా రొమాంటిక్ విషయంలో అయితే కొందరు ఎప్పటిలానే రొటీన్ గా కనిపిస్తున్నారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. బిగ్ బాస్ లో ప్రేమలు ఆప్యాయతలు కొనసాగడం సర్వసాధారణం.
హౌస్ లో నుంచి బయటకు వెళ్లిన తర్వాత అవి ఎంత వరకు ఉంటాయో తెలియదు కానీ బిగ్ బాస్ లో ఉన్నంత వరకు కూడా కంటెస్టెంట్స్ చాలా తెలివిగా కెమిస్ట్రీని కొనసాగిస్తున్నారు. ఇక ప్రియాంక మానస్ పై తనకున్న ప్రేమను మరోసారి చాలా ఓపెన్ గానే బయటపెట్టేసింది. అతనంటే అంటే ఎంత ఇష్టమో ఆమె తన హావభావాలతోనే కూల్ గా చూపించేసింది.

చాలా తక్కువ కాలంలోనే
బిగ్ బాస్ తెలుగులో సక్సెస్ అవుతుందా లేదా అని మొదట్లో నేను చాలా అనుమానాలు వచ్చాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ మొదలు పెట్టిన ఈ రియాలిటీ షో చాలా తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ అందుకుంది. ఇక నాగార్జున పోస్ట్ గా గత రెండు సీజన్స్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగించారు. అయితే ఈసారి మాత్రం ఆయన హోస్టింగ్ పై కొంత విబిన్నంగా కామెంట్స్ వస్తున్నాయి. అసలు నాగార్జున బిగ్ బాస్ ను ఫాలో అవుతున్నారా లేదా అని మేము కూడా వైరల్ అవుతున్నాయి.

ఇప్పటి నుంచి మరొక లెక్క
బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులు కొంత అసంతృప్తి చెందారు అనే చెప్పాలి. అప్పట్లోనే మళ్ళీ రొటీన్ కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ లోకి దింపారు అనే కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. ఏదేమైనా బిగ్ బాస్ మాత్రం టాస్క్ లతో జనాలను అంతకంతకు ఆకట్టుకుంటూనే ఉంది. ఇక 12వ వారం లో కి చేరుకున్న సీజన్ 5 మరింత ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క అదే తరహాలో కొనసాగుతోంది.

మానస్ తో ప్రేమలో..
ఇక టాప్ 5 లో ఎవరు ఉంటారు అనేది అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఈసారైనా అమ్మాయిలు టైటిల్ గెలుచుకుంటారా? లేదా అనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్ అయినటువంటి ప్రియాంక తనదైన శైలిలో బిగ్ బాస్ విన్నర్ గా నిలవాలని చూస్తోంది ఆమె మొదటి నుంచి కూడా మానస్ తో ఒక కెమిస్ట్రీ అయితే ఫాలో అవుతోంది. ఇక ఇటీవల తన మనసులోని మరొక మాట తో హైలెట్ గా నిలిచింది. మనసులో ఉన్న ప్రేమను చాలా ఓపెన్ గా బయటపెట్టడం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతుంది.
Recommended Video

కరెక్ట్ కాదని తెలుసు
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మార్కు ఉండేలా అడుగులు వేస్తూ ఉంటారు. ఇక కొందరు అయితే లవర్స్ అదే తరహాలో ముందుకు సాగుతూ ఉంటారు. ప్రియాంక కూడా మానస్ పై ప్రేమను చూపిస్తూ హైలెట్ అవుతోంది. ఇక రీసెంట్ గా నేను నిన్ను ఇష్టపడుతున్నానేమో అనిపిస్తుందని మానస్ కు చెప్పేసింది.
మొదటి రోజు నుంచి నిన్ను చేస్తుంటే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ కలుగుతోందని అంటూ.. కరెక్ట్ కాదన్న సంగతి నాకు తెలుసు. కానీ నీ విషయంలో నాకు బాగా అనిపిస్తుంది' అని వివరణ ఇచ్చింది. బిగ్‌బాస్ అన్‌సీన్‌లో ప్రసరమైన ఈ ట్రాక్ వైరల్ అవుతోంది. మరి ప్రియాంక రానున్న రోజుల్లో ఇంకా ఏ విధంగా అడుగులు వేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











