Bigg Boss 5: షన్ను కోసం బంపరాఫర్.. బయటకు రాగానే బిజీబిజీగా..

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మొత్తానికి తుది దశకు చేరుకుంటుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కంటెస్టెంట్స్ చాలా విభిన్నంగా ఆకట్టుకున్నారు. అయితే కంటెస్టెంట్స్ ఎవరు కూడా లిమిట్స్ దాటకుండా చాలా తెలివిగా గేమ్ ఆడుతూ వచ్చారు. కొంత మంది మాత్రం అప్పుడప్పుడు కొన్ని విమర్శలను ఎదుర్కోక తప్పలేదు. షణ్ముఖ్ జస్వంత్ కూడా తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ముందుకు సాగుతున్నాడు. అయితే అతను బిగ్ బాస్ టైటిల్ గెలిచిన గెలవకపోయినా కూడా హౌస్ లో నుంచి బయటకు రాగానే కొన్ని ఆఫర్స్ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Mommy's Warning.. Shannu & Siri Self Goal || Oneindia Telugu
గ్రూప్ మెయింటైన్ చేస్తూ..

గ్రూప్ మెయింటైన్ చేస్తూ..

బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ రవి తర్వాత అందరికంటే కాస్త ఎక్కువ క్రేజ్ ఉన్న వారిలో షణ్ముఖ్ జస్వంత్ ఎక్కువ స్థాయిలో అభిమానులు మద్దతు అందుకుంటున్నాడు. అతను హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాడు అని కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. ముఖ్యంగా సిరి జెస్సీ లతో కలిసి దాదాపు చాలా రకాల గేమ్ లలో తెలివిగా గెలవడం జరిగింది.

సిరి కారణంగా విమర్శలు

సిరి కారణంగా విమర్శలు


గేమ్ ఎలా కొనసాగినా కూడా షణ్ముఖ్ జస్వంత్ మాత్రం వీలైనంత వరకు కూల్ గానే ముందుకు సాగుతూ వచ్చాడు. అతనిపై ఎంత మంది విమర్శలు చేసినా కూడా లిమిట్స్ దాటలేదు. ముఖ్యంగా సిరి విషయంలో అయితే చాలాసార్లు అపనిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సన్నీ అసభ్యంగా టచ్ చేసాడు అని సన్నీపై అబద్దాలు చెప్పినప్పుడు కూడా ఆమెకు మద్దతు పలకడం తీవ్ర విమర్శలకు గురి చేసింది.

లిమిట్స్ లో ఉంటే మంచిది అంటూ..

లిమిట్స్ లో ఉంటే మంచిది అంటూ..

ఏదేమైనా కూడా షణ్ముఖ్ జస్వంత్ తన తప్పు తెలుసుకుని ఆ తర్వాత ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటు వచ్చాడు. కానీ సిరితో అతను ఎక్కువగా ముందుకు వెళ్ళడం హద్దులు దాటినట్లు అనిపించడం వలన చాలా రకాల నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆఖరికి సిరి తల్లి కూడా లిమిట్స్ లో ఉంటే మంచిది అంటూ కౌంటర్ ఇవ్వడం ఒక పెద్ద కౌంటర్ అని చెప్పాలి.

గర్ల్ ఫ్రెండ్ సపోర్ట్

గర్ల్ ఫ్రెండ్ సపోర్ట్

ఇక సిరి మ్యాటర్ లో షణ్ముఖ్ జస్వంత్ కోసం అతని ప్రియురాలు దీప్తి సునయన మద్దతు పలకడం విశేషం..అతని గేమ్ అతన్ని ఆడనివ్వండి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. సిరి తో ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ కూడా దీప్తి సునైనా మాత్రం అతనికి చాలా సపోర్ట్ గా ఉంది అనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ లో అయితే షన్ను చివరి వరకు తనదైన స్టైల్ లోనే పోరాడతాను అనే విధంగా ముందుకు సాగుతున్నారు.

బయటకు రాగానే

బయటకు రాగానే

ఇక షణ్ముఖ్ జస్వంత్ గెలుస్తాడా గెలవడా అనే విషయాన్ని పక్కన పెడితే అతనికి హౌస్ లో నుంచి బయటకు రాగానే ఒక బంపర్ ఆఫర్ ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. దాదాపు స్టార్ హీరోల పాటలకు వచ్చినంత స్థాయిలో షణ్ముఖ్ జస్వంత్ షార్ట్ ఫిలిమ్స్ కు వ్యూవ్స్ అందుతూ ఉంటాయి.

హీరోగా ఛాన్సులు..

హీరోగా ఛాన్సులు..

ఇక ఎప్పటి నుంచో షణ్ముఖ్ జస్వంత్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా అవకాశాలు కూడా దక్కే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చాలా సార్లు కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ తరహా రోల్స్ చేయాలని అనుకోలేదు. ఎలాగైనా చేస్తే హీరోగానే చేయాలి అని అనుకున్నాడు. ఇక ప్రస్తుతం అతని డేట్స్ కోసం సన్నిహితులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. కథలు కూడా చాలానే రెడీగా ఉన్నాయట.
షణ్ముఖ్ జస్వంత్ కు నచ్చితే వెంటనే స్టార్ట్ చేయాలని కూడా కొందరు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ విషయంలో షన్ను ఎలాంటి కథలను సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X