షణ్నుతో కనెక్షన్ ఇంకా ఎమోషనల్.. తప్పా? రైటా? తెలియట్లేదు: సిరి మాటలకు నాగ్ కౌంటర్
బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో నిర్వాహకులు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయారు అని కామెంట్స్ చాలానే వచ్చాయి. నిజానికి ప్రతీసారి ఇలాంటి కామెంట్స్ రావడం సహజమే. ఇంకా గుర్తింపు ఉన్న సెలబ్రెటీలను హౌజ్ లోకి తీసుకు వస్తారని అనుకున్న ప్రేక్షకులకు ప్రతిసారి కూడా పూర్తిస్థాయిలో సంతృప్తి కలగడం లేదనే కామెంట్స్ చాలానే వస్తున్నాయి.
అయితే అలాంటి కామెంట్స్ ఎన్ని వచ్చినప్పటికీ కూడా బిగ్ బాస్ మాత్రం అద్భుతమైన టాస్క్ లతో రొమాంటిక్ డ్రామాలతో మంచి బజ్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఇక ఈసారి సిరి, షణ్ముఖ్ జస్వంత్ జోడిని ఎవరు కూడా డామినేట్ చేయలేకపోతున్నారని అనిపిస్తోంది. శనివారం ఎపిసోడ్ లో కూడా సిరి తన మాటలతో వారి బాండింగ్ గురించి మరింత ఓపెన్ గా వివరణ ఇచ్చింది.

పరిస్థితులను బట్టి రంగులు మారుస్తూ..
బిగ్ బాస్ సీజన్ 5 మొదలయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు ఎదో ఒక లవ్ ట్రాక్ తో చాలా విబిన్నంగా కొనసాగుతున్నారు. అందరిది ఒక తరహాలో ఉంటే షన్ను, సిరి ట్రాక్ మాత్రం ఎవరు ఊహించని విధంగా ఉంది. ఈ ఇద్దరు కూడా పరిస్థితులను బట్టి ఎన్ని రంగులు మార్చినా కూడా చాలా ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. ఏదైనా గొడవ జరిగితే అప్పుడే ఒక్కటిగా పోరాడుతూ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటున్నారు.

కొన్నిసార్లు హద్దులు దాటి..
త్రిమూర్తులుగా తన గ్యాంగ్ ను మెయింటైన్ చేసిన షన్ను ఆ గ్యాంగ్ లో నుంచి జెస్సి వెళ్లిపోయిన అనంతరం సిరితో ఇంకా ఎమోషనల్ బాండింగ్ ను పెంచుకున్నాడు. వీరు ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా ముందుకు వెళుతున్నారు. సిరి అయితే కొన్నిసార్లు హద్దులు దాటి ప్రవర్తిస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏకంగా రక్తం కూడా చిందించడం మరొక షాకింగ్ విషయం. ఆ విషయంలో మాత్రం సిరి నిజంగా హద్దులు దాటేస్తోందని కూడా చెబుతున్నారు.

ఇలా మాత్రం ఉండకూడదు
ఇక శనివారం రోజు నాగార్జున గత వారం జరిగిన పరిణామాలను కూడా గుర్తు చేసుకుంటూ సిరిని ప్రశించాడు. ఎందుకు ఇలా జరుగుతోంది అని.. ఇక సిరి షన్నుపై మరోసారి తన ఎమోషనల్ బాండింగ్ బయటపెట్టింది. బాత్రూం లోపల, బయట తల బాదుకుంటు ఎందుకు గాయం చేసుకోవాల్సి వచ్చింది అంటూ నాగ్ సిరిని ప్రశ్నించాడు. కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చిన సిరి తన మనసులోని భావాలను కన్నీటితో వివరించింది. కోట్లాది మంది నిన్ను చూస్తే ఈ అమ్మాయిలా ఉండాలనుకోవాలి కానీ.. ఇలా మాత్రం ఉండకూడదు అని అనుకోకూడదు అని నాగ్ బుద్ధులు కూడా నేర్పారు.
Recommended Video

తప్పా? రైటా
ఇక ఆ విషయంపై సిరి మాట్లాడుతూ.. నేను చాలా ఎమోషనల్ పర్సన్. ఎదుటివాళ్లను హర్ట్ చేసే చేయాలని అనుకోను. ఎవరి ఏమనుకున్నా కూడా.. నన్ను నేనే బాధపెట్టుకుంటాను. రోజులు గడుస్తున్నన్ని రోజులు షణ్నుతో నా కనెక్షన్ ఇంకా బలంగా ఎమోషనల్ గా వెళుతోంది. ఇది తప్పా? రైటా? అని కూడా నాకు అర్థం కావడం లేదు.
ఏదేమైనా కూడా నా జీవితంలో నాకు ఎప్పుడు ఇలా అవ్వలేదు. నాకు ఈ ఫీలింగ్ కరెక్ట్ కాదని తెలిసినా కూడా చేయాలనిపిస్తే చేసేస్తున్నా.. అంటూ సిరి వివరణ ఇవ్వడంతో నాగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంకోసారి ఇలా గాయపర్చుకుంటే మాత్రం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇంటికి పంపించేస్తానని అంటూ హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











