Bigg Boss 5: షన్ను విషయంలో నమ్మానంటే ప్రాణం ఇచ్చేస్తా.. ప్రేక్షకుల ప్రశ్నకు సిరి దిమ్మతిరిగే సమాధానం!
బిగ్ బాస్ లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఊహించడం కష్టంగానే ఉంటుంది. అయితే బిగ్ బాస్ మాత్రం కంటెస్టెంట్స్ ఎమోషనల్ గా ఉన్నప్పుడే తనకు నచ్చినట్టుగా ఆటను మరింత సీరియస్ మార్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడని అర్థం అవుతూ ఉంటుంది. హౌస్ లో హింసకు తావు లేదు అంటూనే కంటెస్టెంట్స్ గొడవలు పడే టాస్క్ లోను కావాలని కాంట్రవర్సీ టాస్క్ లు పెడుతూ ఉంటారు.
సీజన్ 5 ఫైనల్ స్టేజ్ కి వచ్చేసరికి మొదట ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న బిగ్ బాస్ ఆ తర్వాత అసలైన గొడవలను క్రియేట్ అయ్యేలా పరిస్థితులను మారుస్తున్నాడు. ఇక ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు కంటెస్టెంట్స్ మధ్యలో చాలా రకాల అనుమానాలు మొదలయ్యాయి. అయితే కొందరు మాత్రం దిమ్మతిరిగేలా సమాధానం కూడా ఇచ్చారు.

షణ్ముఖ్ గ్రూప్..
బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా కొందరు ప్రత్యేకంగా గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్ గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనే కామెంట్స్ అయితే చాలానే వస్తున్నాయి. ఇక ఆ ప్రశ్న కూడా ప్రేక్షకుల నుంచి షణ్ముఖ్ కు చేరడంతో అతను తనకు గ్రూప్ లేదు అన్నట్లు ఫీల్ అవ్వడం మరొక ఆశ్చర్యకరమైన విషయం.

కొత్త ఛాలెంజ్
శుక్రవారం రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ప్రేక్షకుల సందేహాలను కంటెస్టెంట్స్ వద్దకు చేర్చారు. ఇక వాటికి సరైన సమాధానం ఇచ్చి ఓటు అడిగే అర్హత గెలుచుకోవాలి అనే చాలెంజ్ ఇచ్చారు. ఇక మొదటి నుంచి కూడా అందరూ వారికి నచ్చినట్లుగా సమాధానం ఇస్తూ వచ్చారు అయితే సిరి మాత్రం షణ్ముఖ్ విషయంలో ఎదుర్కొన్న ప్రశ్నకు ఊహించని విధంగా సమాధానం ఇచ్చింది.

సిరి ఆటను ఎందుకు అడనివ్వడం లేదు
మొదటి నుంచి కూడా షణ్ముఖ్ ప్రతి గేమ్ లోను సిరితో కలిసికట్టుగా ఉండి పోరాడుతున్నారు అనే సందేహం చాలామందిలో ఉంది. అంతే కాకుండా షణ్ముఖ్ జస్వంత్ సిరిని కంట్రోల్ చేస్తున్నాడు అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. తన ఆటను సొంతంగా ఎందుకు ఆడనివ్వడం లేదు అని కూడా ప్రేక్షకుల నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇక బిగ్ బాస్ కూడా అదే తరహాలో షన్నుని ప్రశ్నించారు.

తనపై గేమ్ ఆడాలని చూస్తే..
ఇక షన్ను ఆ సందేహాలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఇలాంటివి ప్రశ్నలు నేను ముందే ఊహించాను అంటూ ఆమెను ఎక్కడ కంట్రోల్ చేయాలో అక్కడే కంట్రోల్ చేయాలఅనుకుంటాను.ల్ అంటూ.. ఎవరైనా తనపై గేమ్ ఆడాలని చూస్తే వీలైనంత వరకు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను.
ఎందుకంటే తను టాప్ ఫైవ్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ కొన్నిసార్లు తన విషయంలో ఎలా ఫీల్ అవుతున్నానో అర్థం కావడం లేదు అని చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు.

ఒక్కసారి నమ్మానంటే ప్రాణం ఇచ్చేస్తా
షణ్ను కన్నా స్ట్రాంగ్ ప్లేయర్. కానీ మిమ్మల్ని మీరు ఎందుకలా కన్‌సైడర్ చేసుకోవడం లేదు? అనే ప్రశ్న సిరికి ఎదురైంది. ఇక అందుకు సిరి నేను స్ట్రాంగ్ ప్లేయర్‌నే అంటూ కాకపోతే కొన్ని సంఘటనల్లో షణ్ను నాకు సపోర్ట్ గా ఉన్నాడని చెప్పింది, అయితే తాను ఒక్కసారి నమ్మానంటే ప్రాణం ఇచ్చేస్తానని చెప్పుకొచ్చింది అంతే కాకుండా ఒక ఫ్రెండ్‌గా నేను వాడిని ఫస్ట్ ప్లేస్‌లో చూడాలనుకున్నానని తెలియజేసింది.


Click it and Unblock the Notifications











