For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 5: హౌస్ లో అమ్మాయిల విషయంలో సన్నీ ఆవేదన.. సైలెంట్ గా చేతులెత్తేసిన నాగార్జున!

  |

  బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉండాలి. కంటెస్టెంట్స్ వారి సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటూ ఓ వైపు పోరాడుతూనే మరోవైపు అభిమానుల మద్దతు కూడా అందుకోవాలి. అయితే బిగ్ బాస్ హౌస్ లో కొన్ని సార్లు తెలియకుండానే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. పొరపాటు జరిగినప్పుడు అతను ఎలా రియాక్ట్ అయ్యాడు అనే దానిపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇక బిగ్ బాస్ 5 లో సన్నీ రీసెంట్ ప్రవర్తించిన విధానం ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రియ విషయంలో అయితే సన్నీ చాలా ఓపికతో వెళ్లడం అతనికి బాగా కలిసి వచ్చింది. ఇక నాగార్జున సన్నీ విషయంలో ఏం చెప్పాలో అర్థం కాక చేతులెత్తేయడం వర్గం వారికి మాత్రం నచ్చడం లేదు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది.

  సన్నీకి ఆ విషయంలో ఫిదా

  సన్నీకి ఆ విషయంలో ఫిదా


  కొన్నిసార్లు పొరపాటు చేసినప్పటికీ కూడ ఆ తరువాత ఎలా ప్రవర్తించారు అని దాని పైనే కంటెస్టెంట్ భవిష్యత్తు ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లో గొడవలు జరగడం చాలా కామన్. విలన్స్ గా ఉన్న కూడా కొన్ని సార్లు అదే వారికి చాలా ప్లస్ అయ్యే అంశం కూడా. చాలాసార్లు ఆ విషయంలో కొంతమంది సక్సెస్ అవుతూ వచ్చారు. కానీ ఇబ్బంది పెట్టే విధంగా చిరాకు తెప్పిస్తే మాత్రం ప్రేక్షకులను కూడా ఒక్కసారిగా మారిపోతూ ఉంటారు. అయితే మరొకరు తప్పు చేయడం వల్ల సన్నీకి మాత్రం బాగా కలిసి వచ్చింది. అతనికి ఓపిక కూడా చాలామంది ఫిదా అయ్యారు.

  సిరి విషయంలో ఆణిముత్యంలా..

  సిరి విషయంలో ఆణిముత్యంలా..


  బిగ్ బాస్ హౌస్ లో అబ్బాయిలు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఫిజికల్ టాస్క్ లో ఆడే సమయంలో అమ్మాయిలతో ఏ విధంగా ప్రవర్తించినా కూడా కాస్త రిస్కుతో కూడుకున్న పని. అది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కొన్ని సార్లు తెలియకుండానే కంటెస్టెంట్స్ పొరపాట్లు చేయాల్సి వస్తుంది. ఇక కొంతమంది అమ్మాయిలు కావాలని రెచ్చగొడుతూ ఎమోషనల్ గా వుమెన్ కార్డ్ ప్లే చేసే అవకాశం కూడా ఉంది. గతంలో సిరి, సన్నీ మధ్యలో ఫిజికల్ టాస్క్ లో సన్నీ షర్ట్ లోపల చేయి పెట్టాడు అని అపనింద పడింది. ఆ విషయంలో వీడియో చూపించడం ద్వారా సన్నీ అప్పుడే ఆణిముత్యంలా బయటకు వచ్చాడు.

  పోరాడక తప్పలేదు..

  పోరాడక తప్పలేదు..


  గతంలో ఈ విషయంలో సన్నీ పొరపాటు చేయకపోయినా కూడా చాలా ఓపికతో ఫిజికల్ టాస్క్ ఆడాడు. ఆ విషయంలో అతను బ్యాడ్ క్యారెక్టర్ అనే ముద్ర వేసే ప్రయత్నం కూడా చేశారు కానీ వీడియో చూపించడం వల్ల సన్నీ సేఫ్ గా బయటకు వచ్చాడు. రేసేంట్ గా ప్రియా అయితే సన్నీ ని చాలా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అతను ఫిజికల్ గా నెట్టివేసే ప్రయత్నం చేశాడు. ఆమె వుమెన్ కార్డ్ ప్లే చేసి ఎంతగానో బాధించింది. కానీ సన్నీ మాత్రం అక్కడ తన గుడ్లను కాపాడుకోవడానికి పోరాడక తప్పలేదు.

   సన్నీ అప్సెట్

  సన్నీ అప్సెట్

  ఆ సమయంలో మగవాళ్ళు ఉండి ఉంటే సన్నీ దూకుడు మరోలా ఉండేదోమో. అప్పటికి సన్నీ చేయితో టచ్ చేయకుండా తన బాడీని అడ్డుపెట్టి గుడ్లను కాపాడుకున్నాడు. ఆ విషయంలో ఎవరైనా సరే వారి గేమ్ ఆడడానికి దూసుకు వస్తారు. అయితే ప్రియా సన్నీ ఫిజికల్ గా ఇబ్బంది పెట్టాడు అని చెప్పడంతో సన్నీ కొంత అప్సెట్ అయ్యాడు. ఇదే విషయాన్ని నాగార్జున ముందు కూడా చెప్పాడు.

   తెలివికి మ్యాటర్ మార్చేసిన నాగార్జున

  తెలివికి మ్యాటర్ మార్చేసిన నాగార్జున


  ఫిజికల్ టాస్క్ ల విషయంలో ఆడవాళ్ళతో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తోంది అని చెప్పినప్పుడు నాగార్జున ఎలా స్పందిస్తాడో అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన తెలివిగా ముందుగా హెచ్చరిక జారీ చేయాలని చెప్పాడు. సన్నీ మళ్ళీ వివరించే ప్రయత్నం చేయగా నాగార్జున సైలెంట్ గా మ్యాటర్ మార్చేసి వరస్ట్ పెర్ఫామర్ ఎవరు అని అడగడం ఆశ్చర్యాన్ని కలిగించింది. బహుశా ఆ సెన్సిటివ్ మ్యాటర్ లో ఎలా స్పందించినా కాంట్రవర్సీ అవుతుందని అనుకున్నారో ఏమో..? ఏదేమైనా బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చినప్పుడు అందరూ సమానమే. లేకపోతే ఇలాంటి ఆటలోకి రాకూడదు అనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే కొందరు కావాలి అని వుమెన్ కార్డ్ ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ నాగార్జున చేతులెత్తేయడం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. ఆ విషయంలో సన్నికి ఎదో ఒక విధంగా చూసి గేమ్ ఆడు అని చెప్పినా సరిపోయేదేమో . ఇక ఈ వారం ఆ ప్రభావం ప్రియపై గట్టిగానే ఉంది. ఆమె హౌస్ నుంచి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  English summary
  Bigg boss 5 sunny upsetting on women card and Nagarjuna silence,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X