Bigg Boss Elimination: వారం చివర్లో మారిపోయిన పోలింగ్.. ఆ ఇద్దరిలో ఒకరు వెళ్లిపోవడం ఖాయం!

తెలుగులో మరే షోకూ దక్కనంత స్పందనతో దాదాపు ఐదేళ్లుగా నెంబర్ వన్ స్థానంలో వెలుగొందుతోంది బిగ్ బాస్. గతంలో అసలు ఎప్పుడూ చూడని కాన్సెప్టే అయినా మన ప్రేక్షకులు మాత్రం దీనికి ఫిదా అయిపోయారు. దీంతో ఇది ఎవరూ ఊహించని రీతిలో రేటింగ్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక, ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఐదోది కూడా ప్రారంభం అయింది. అంతేకాదు, అప్పుడే ఒక వారం కూడా పూర్తైంది. ఈ నేపథ్యంలో అసలు ఫస్ట్ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగింది? ఎవరు సేఫ్ అవబోతున్నారు? అనే విషయాపై ఓ లుక్కేద్దాం పదండి!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

మొదటి వారం నామినేట్ అయింది వీళ్లే

మొదటి వారం నామినేట్ అయింది వీళ్లే

బిగ్ బాస్ షో మొత్తంలో ఎంతో ముఖ్యమైన ప్రక్రియల్లో నామినేషన్స్ ఒకటి. ఎంతో ఆసక్తికరంగా ఎన్నో గొడవల మధ్య ఇది ప్రతి సోమవారం జరుగుతుంది. ఇక, ఐదో సీజన్‌కు సంబంధించి మొదటి వారం నామినేషన్స్ టాస్క్ సైతం ఎంతో రచ్చ రచ్చగా జరిగింది. ఇందులో ఈ వారానికి యాంకర్ రవి, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, హమీదా, మానస్, సరయులు నామినేట్ అయ్యారు.

ఆ గొడవ తర్వాత మారిపోయిన ఓటింగ్

ఆ గొడవ తర్వాత మారిపోయిన ఓటింగ్

నామినేషన్స్ టాస్క్ తర్వాత ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఆరంభంలో యాంకర్ రవికి ఎక్కువగా ఓట్లు పడగా.. ఆ తర్వాత చాలా మంది టార్గెట్ చేసిన కారణంగా సింపతీ వచ్చి జస్వంత్ పడాలకు కూడా భారీగానే ఓట్లు పోలయ్యాయని తెలిసింది. అతడి తర్వాత మానస్‌కు కూడా మంచిగా ఓట్లు పడ్డాయి. లేడీ కంటెస్టెంట్లు ముగ్గురికీ కొంచెం తక్కువగా ఓట్లు పోలయ్యాయని టాక్.

 చివరి రెండు రోజుల్లో ఓటింగ్ సరళి ఇలా

చివరి రెండు రోజుల్లో ఓటింగ్ సరళి ఇలా

ఆరంభంలో మాదిరిగానే వారంతం వరకూ యాంకర్ రవి టాప్ ప్లేస్‌లోనే ఉన్నాడట. అయితే, జస్వంత్‌కు మాత్రం ఆనీ మాస్టర్‌తో గొడవ తర్వాత ఓటింగ్ తగ్గిపోయిందని తెలుస్తోంది. ఈ వారం ఓటింగ్ చివరి రెండు రోజుల్లో అతడి పరిస్థితి మాత్రమే కాదు.. మిగిలిన వాళ్ల ఓటింగ్ సరళిలో కూడా భారీగా మార్పులు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ఎలిమినేషన్‌పై ఆసక్తి పెరిగిపోయింది.

అతడితో పాటు వాళ్లు సేఫ్ అయ్యారని

అతడితో పాటు వాళ్లు సేఫ్ అయ్యారని

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ వారం జరిగిన ఓటింగ్ ప్రాసెస్‌లో యాంకర్ రవినే అందరి కంటే ఎక్కువ ఓట్లు సాధించి టాప్‌లో నిలిచాడట. అతడి తర్వాత స్థానంలో మానస్‌ ఉన్నాడని అంటున్నారు. వీళ్లిద్దరి తర్వాత జస్వంత్‌కే ఎక్కువ ఓట్లు పోలయ్యాయని తెలుస్తోంది. అంటే.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ముగ్గురు మేల్ కంటెస్టెంట్లు సేఫ్ అయ్యారని టాక్.

డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లు వీళ్లే

డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లు వీళ్లే

బిగ్ బాస్ ఐదో సీజన్ మొదటి వారానికి సంబంధించి మొత్తం ఆరుగురు నామినేషన్స్‌లో ఉండగా.. అందులో ముగ్గురు మేల్ కంటెస్టెంట్లు ఎక్కువ ఓట్లు సాధించి సేఫ్ అయ్యారని తెలుస్తోంది. దీంతో మిగిలిన ముగ్గురు అమ్మాయిలు ఆర్జే కాజల్, హమీదా, సరయులు డేంజర్ జోన్‌లోనే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రైవేటు పోల్స్‌లో కూడా ఇదే విధంగా ఓటింగ్ పొజిషన్స్ ఉన్నాయట.

ఈ ఇద్దరిలో ఒకరు వెళ్లడం ఖాయమని

ఈ ఇద్దరిలో ఒకరు వెళ్లడం ఖాయమని

ఈ వారం నామినేషన్స్‌కు సంబంధించి డేంజర్ జోన్‌లో ఉన్నారని చెబుతోన్న ఆర్జే కాజల్, హమీదా, సరయులలో ఎవరి పొజిషన్ ఏంటన్న దానిపైనా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, అన్నింట్లోనూ కాజల్ పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తోంది. ప్రైవేటు పోల్స్‌లో కూడా ఇలాగే ఉంది. దీంతో హమీదా కానీ, సరయు కానీ ఈ వారం ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉందని టాక్.

Recommended Video

Bigg Boss Telugu 5 కు నాగార్జున రెమ్యూనరేషన్ అన్ని కోట్లా ? || Filmibeat Telugu
ఏదైనా జరగొచ్చంటూ అందరిలో భయం

ఏదైనా జరగొచ్చంటూ అందరిలో భయం

బిగ్ బాస్ షో అంటేనే ఊహించని ఎన్నో అంశాలు జరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎలిమినేషన్స్‌లో అనుకున్న కంటెస్టెంట్ కాకుండా వేరే వాళ్లు కూడా ఎలిమినేట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీంతో ఈ వారం కూడా ఎవరైనా ఎలిమినేట్ అవ్వొచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో అసలు ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X