Bigg Boss: మూడో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. అలా మారిపోయిన పోలింగ్.. వాళ్లిద్దరిలో ఒకరు ఔట్

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లోనూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అయితే, అన్నింటి కంటే ఎక్కువ ఆదరణను అందుకుంటూ నేషనల్ రికార్డులను బద్దలు కొడుతోన్నది మాత్రం తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ మాత్రమే. ఇది మన దగ్గర ఎంతో సక్సెస్ అయింది. అందుకే ప్రతి ఏడాది ఒకటి చొప్పున ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదోది కూడా ప్రారంభమై ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఈ వారం నామినేషన్స్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటింగ్‌లో ట్విస్టులు జరిగాయని తెలుస్తోంది. దీంతో మూడో వారం ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు మీకోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

తొలిసారి ఈ రేంజ్‌లో.. ఇద్దరు ఎలిమినేట్

తొలిసారి ఈ రేంజ్‌లో.. ఇద్దరు ఎలిమినేట్

బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు నేరుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు టైటిల్ కోసం బరిలోకి దిగారు. ఇక, వీరిలో మొదటి వారంలో సరయు బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటకు వెళ్లిపోయింది. రెండో వారంలో ఉమాదేవి ఎలిమినేట్ అయిపోయారు. దీంతో 17 మందే మిగిలారు.

 మూడో వారం నామినేటైన కంటెస్టెట్లు వీళ్లే

మూడో వారం నామినేటైన కంటెస్టెట్లు వీళ్లే

ఐదో సీజన్ ఆరంభంలోనే భారీ స్పందనను అందుకుని 18 రేటింగ్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే షో మొత్తంలో ఎంతో ముఖ్యమైన నామినేషన్స్ ప్రక్రియ కూడా ఎన్నో గొడవల మధ్య ప్రతి సోమవారం ఎంతో ఆసక్తికరంగా జరుగుతుంది. ఇక, ఐదో సీజన్‌కు సంబంధించి మూడో వారం నామినేషన్స్ టాస్క్ సైతం ఎంతో రచ్చ రచ్చగా జరిగింది. ఇందులో పలువురు కంటెస్టెంట్ల మధ్య భారీ స్థాయిలో గొడవ జరిగింది. ఇక, ఈ వారానికి సంబంధించి మొత్తం ఐదుగురు ప్రియ, ప్రియాంక సింగ్, మానస్, శ్రీరామ చంద్ర, లహరి షారీలు నామినేట్ అయిన విషయం తెలిసిందే.

ఆమె వెళ్లిపోవడం ఖాయమని అనుకుంటే

ఆమె వెళ్లిపోవడం ఖాయమని అనుకుంటే

మూడో వారం నామినేషన్స్ సమయంలో కొందరు కంటెస్టెంట్లు శృతి మించి మరీ మాట్లాడారు. అందులో సీనియర్ నటి ప్రియ పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. లహరి షారిని నామినేట్ చేసే క్రమంలోనే ఆమె వ్యక్తిగత ప్రవర్తన గురించి ప్రస్తావించింది. ఈ క్రమంలోనే యాంకర్ రవి పేరును కూడా వాడుకుంది. అప్పుడామె ప్రవర్తనను చూసిన వాళ్లంతా మూడో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేది ప్రియనే అని అనుకున్నారు. అయితే, ఆ తర్వాత ఈ విషయంలో ఆమె చెప్పిన విషయాలు నిజమేనని తేలడంతో ప్రేక్షకుల్లో అభిప్రాయాలు ఒక్కసారిగా మారిపోయాయి.

మూడో వారంలో బిగ్ ట్విస్ట్ ఉంటుందని

మూడో వారంలో బిగ్ ట్విస్ట్ ఉంటుందని

మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో ప్రైవేట్ పోల్స్‌లో సైతం సరయు రాయ్‌కు మాత్రమే ఆరంభం నుంచి తక్కువ ఓట్లు పోలయ్యాయన్న సంగతి విధితమే. అయితే, రెండో వారంలో పరిస్థితి అలా లేకపోయినా ఉమాదేవిని బయటకు పంపించారు. అయితే, మూడో వారంలో మాత్రం కంటెస్టెంట్ల స్థానాలు తరచూ మారుతున్నాయి. రోజుకోలా ఓటింగ్ ప్రక్రియ మార్పులు జరుగుతోంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్స్‌లో బిగ్ ట్విస్ట్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అందుకు అనుగుణంగానే అనధికార పోల్స్‌లో సేఫ్ జోన్‌లో ఉండాల్సిన వాళ్లు చివరకు వచ్చారు.

మూడో వారం అతడికే ఎక్కువ మద్దతుతో

మూడో వారం అతడికే ఎక్కువ మద్దతుతో

మూడో వారానికి సంబంధించిన పోలింగ్‌లో టాప్ ప్లేస్‌లో మానస్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం అతడు టాస్కుల్లో పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు. అసలు అతడికి స్క్రీన్ స్పెస్ కూడా దక్కలేదు. దీంతో వరస్ట్ పెర్ఫార్మర్‌గా జైలుకు కూడా వెళ్లాడు. అయినప్పటికీ అతడికే ప్రేక్షకులు మద్దతు తెలుపుతున్నారని అంటున్నారు. ఆరంభంలో ప్రియకు కూడా బాగానే ఓట్లు వచ్చినా.. ఆ తర్వాత అతడే నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు అనధికారిక పోల్స్‌లో తేలింది. అంటే ప్రియ రెండో స్థానంలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. తద్వారా వీళ్లిద్దరూ సేఫ్ అయ్యారని టాక్.

ప్రియాంక సింగ్‌కు ప్రేక్షకుల సపోర్టు ఉంది

ప్రియాంక సింగ్‌కు ప్రేక్షకుల సపోర్టు ఉంది

ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లలో ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ కూడా ఉంది. ఆరంభం నుంచి అద్భుతమైన రూపం.. అదిరిపోయే ఆటతో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈమె.. క్రమక్రమంగా తన మార్క్ చూపించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఫన్‌కు ఫన్ కూడా అందిస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. దీంతో ఈ వారం ఆమెకు భారీ స్థాయిలో ఓట్లు పడినట్లు ప్రచారం జరుగుతోంది. అనధికారిక పోల్స్‌లో ఆరంభం నుంచీ మూడో స్థానంలో కొనసాగతుందని అంటున్నారు. దీంతో ప్రియాంక సింగ్ ఈ వారం సేఫ్ అయినట్లేనని తెలుస్తోంది.

Recommended Video

Mahesh Babu Is The Brand Ambassador For Big C
 టైటిల్ ఫేవరెట్‌తో పాటు ఆమె‌కు డేంజర్‌గా

టైటిల్ ఫేవరెట్‌తో పాటు ఆమె‌కు డేంజర్‌గా

మూడో వారానికి సంబంధించి నామినేట్ అయిన సభ్యుల్లో టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన శ్రీరామ చంద్ర కూడా ఉన్నాడు. ఊహించని విధంగా అనధికారిక పోల్స్‌లో అతడు నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ వారం ఆరంభం నుంచీ లహరి షారి చివరి స్థానానికే పరిమితం అయిందని అంటున్నారు. దీంతో వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. అయితే, బిగ్ బాస్ షోలో ఏదైనా జరగొచ్చు అనే దాన్ని బేస్ చేసుకుని చివర్లో ట్విస్ట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ షాకిచ్చేలా ఉండబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X