Bigg Boss: నాలుగో వారం ఆ ఇద్దరిలో ఒకరు ఔట్.. ఒక్కరోజులో మారిన ఓటింగ్.. టైటిల్ ఫేవరెట్లకు బిగ్ షాక్

అన్ని హంగులతో ఓ విలాశవంతమైన ఇల్లు.. చుట్టూ పదుల సంఖ్యలో కెమెరాలు.. కంటెస్టెంట్లుగా కొంత మంది సెలెబ్రిటీలు.. నిర్వహకులు ఇచ్చే టాస్కులలో తమ వంతు శ్రమను చూపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకోడానికి వాళ్లు చేసే ప్రయత్నాలు.. ఇదే బిగ్ బాస్ షో నేపథ్యం. గతంలో ఎన్నడూ చూడని ఇలాంటి షోకు ప్రేక్షకుల మద్దతు లభిస్తుందా అన్న అనుమానాలతో తెలుగులో ఇది ప్రారంభం అయింది. అయితే, ఊహించని విధంగా ఈ షో సూపర్ సక్సెస్ అయింది. అదే సమయంలో ఇప్పుడు ఐదో సీజన్ కూడా విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఇక, తాజా సీజన్‌లో నాలుగో వారం ఎలిమినేషన్‌పై అందరి దృష్టి పడింది. దీనికి కారణం ఈ వారం ఏకంగా ఎనిమిది మంది నామినేట్ అవడమే. ఈ నేపథ్యంలో ఓటింగ్ విధానం తాజాగా బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

అంచనాలకు తగ్గట్టే.. సూపర్ ఆరంభం

అంచనాలకు తగ్గట్టే.. సూపర్ ఆరంభం

మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్‌కు మాత్రమే భారీ రేటింగ్ వస్తుంది. దీనికి ఇక్కడి ప్రేక్షకులు అందిస్తున్న స్పందనే కారణం. దీంతో ఐదో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని నిర్వహకులు చెప్పారు. ఇందులో భాగంగానే 19 మంది కంటెస్టెంట్లను దింపడంతో పాటు ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచారు. దీంతో ప్రారంభ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ వచ్చింది. దీంతో అదిరిపోయే ఆరంభం దక్కినట్లు అయింది.

అవన్నీ సక్సెస్.. మరిన్ని ప్రయోగాలతో

అవన్నీ సక్సెస్.. మరిన్ని ప్రయోగాలతో

ప్రస్తుతం బిగ్ బాస్ ఐదో సీజన్ నాలుగో వారం ప్రసారం అవుతోంది. అయినప్పటికీ అప్పుడే నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వినూత్నమైన టాస్కులను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అలాగే, నామినేషన్స్‌లో సైతం ఎక్కువ మంది ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఓటింగ్ ఎక్కువ అవడంతో పాటు కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే, ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో బిగ్ బాస్‌కు కొంత ఆదరణ తగ్గుతుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో మరిన్ని ప్రయోగాలతో నిర్వహకులు ముందుకు వచ్చేందుకు ప్లాన్లు చేసుకుంటున్నారు.

మూడు వారాల్లో ముగ్గురు లేడీస్ అవుట్

మూడు వారాల్లో ముగ్గురు లేడీస్ అవుట్

బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ప్రతి వారం నామినేషన్స్‌లో ఎక్కువ మంది ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మొదటి వారం ఏడుగురు సభ్యులు నామినేట్ అవగా.. అందులో నుంచి సరయు రాయ్ ఎలిమినేట్ అయింది. రెండో వారంలో ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉండగా సీనియర్ నటి ఉమాదేవి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇక, మూడో వారంలో ఐదుగురు మెంబర్లు నామినేషన్స్‌లోకి వెళ్లగా.. వాళ్ల నుంచి లహరి షారి ఎలిమినేట్ అయిపోయింది. ఇలా ముగ్గురూ లేడీసే వెళ్లిపోయారు.

నాలుగో వారం లిస్టులో ఎనిమిది మంది

నాలుగో వారం లిస్టులో ఎనిమిది మంది

బిగ్ బాస్ షో మొత్తాన్ని నడిపించే టాస్కుల్లో నామినేషన్స్ ప్రక్రియే ముఖ్యమైనది. ఇది జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఒక్కో సమయంలో కొట్టుకుంటారా అన్నట్లు కూడా ఇది సాగుతూ ఉంటుంది. ఈ వారం కూడా కొన్ని గొడవలతో షో అలాగే సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో లోబో, ఆర్జే కాజల్, వీజే సన్నీ, సిరి హన్మంత్, ఆనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, ప్రియ, యాంకర్ రవిలు ఉన్నారు. వీరిలో ఎవరు వెళ్తారన్నది ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ వారం టాప్‌లో అతడే.. రవికి బిగ్ షాక్

ఈ వారం టాప్‌లో అతడే.. రవికి బిగ్ షాక్

నాలుగో వారానికి సంబంధించి మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉన్నారు. ఇందులో ఆరంభం నుంచే ఎక్కువ ఓట్లను సాధిస్తూ వీజే సన్నీ నెంబర్ వన్ పొజిషన్‌లో కొనసాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రైవేటు పోల్స్‌లో సైతం అతడికే ఎక్కువ మద్దతు దక్కుతోంది. ఇక, రెండో స్థానంలో ప్రియ ఉన్నట్లు తెలుస్తోంది. ఈమెకు కూడా బిగ్ బాస్ అధికారిక ఓటింగ్‌లో బాగానే ఓట్లు పోలవుతున్నాయని సమాచారం. టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా బరిలోకి దిగిన యాంకర్‌ రవి మాత్రం మూడో స్థానానికే పరిమితం అయ్యాడని అంటున్నారు.

ఒక్కరోజులో మారిన ఓటింగ్.. పైకి కిందకి

ఒక్కరోజులో మారిన ఓటింగ్.. పైకి కిందకి

నాలుగో వారం ఓటింగ్‌లో మొదటి మూడు స్థానాల్లో సన్నీ, ప్రియ, రవిలు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో సిరి హన్మంత్, కాజల్, లోబోలు ఉన్నారట. అయితే, కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు తర్వాత ఈ పొజిషన్లలో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి వరకూ డేంజర్‌ జోన్‌లో ఉన్న లోబో.. ఈ టాస్కు తర్వాత పైకి వచ్చాడట. అలాగే, దీనికి ముందు పైన ఉన్న సిరి, కాజల్ ఇప్పుడు కిందకు పడిపోయారనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా నాలుగో వారం పోల్స్‌లో లోబో నాలుగో స్థానంలో, సిరి హన్మంత్ ఐదో స్థానంలో, కాజల్ ఆరో స్థానంలో కొనసాగుతున్నారని సమాచారం.

Recommended Video

Mahesh Babu Is The Brand Ambassador For Big C
డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఒకరు అవుట్

డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఒకరు అవుట్

నాలుగో వారానికి సంబంధించి ఎనిమిది నామినేట్ అవగానే.. అందరి కంటే తక్కువ ఫాలోయింగ్ ఉన్న ఆనీ, నటరాజ్ మాస్టర్లు డేంజర్‌ జోన్‌లోకి వెళ్లే అవకాశం ఉందన్న టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరే ఇప్పుడు తక్కువ ఓట్లను అందుకుంటున్నారు. ఫలితంగా చివరి స్థానాల్లో ఉండడంతో పాటు ఎలిమినేషన్ అయ్యే ప్రమాదంలో పడిపోయారు. తాజా సమాచారం ప్రకారం.. నటరాజ్ మాస్టర్ ఏడో స్థానంలో, ఆనీ మాస్టర్ ఎనిమిదో స్థానంలో ఉన్నారట. ఇక, ఈ ఆదివారం వీళ్లిద్దరిలోనే ఒకరు హౌస్‌ నుంచి బయటకు వెళ్లిపోతారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X