Bigg Boss: గుంటనక్క ఎవరో చెప్పిన నటరాజ్.. ఊహించలేదన్న నాగ్.. ఆమె వల్లే ఎలిమినేట్ చేశారంటూ!

సరికొత్త కంటెంట్‌తో నడిచే షోనే అయినా బుల్లితెర చరిత్రలోనే మరేదానికీ దక్కనంత ఆదరణను అందుకుంటూ సూపర్ డూపర్ హిట్ అయింది బిగ్ బాస్. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగు ప్రేక్షకులు ఊహించని రీతిలో స్పందనను అందించారు. ఫలితంగా ఇది భారీ స్థాయిలో విజయవంతం అవడంతో పాటు నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదోది కూడా అదే తీరుగా సాగుతోంది. ఇక, ఇందులో అన్ని ఎమోషన్స్‌ను చూపిస్తూ నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు ఎలిమినేట్ కూడా అయ్యారు. ఇక, తాజా ఎపిసోడ్‌లో నటరాజ్ మాస్టర్ బయటకు వచ్చేశాడు. ఆ సమయంలో ఇంట్లో గుంటనక్క ఎవరో చెప్పేశాడు. ఆ వివరాలు మీకోసం!

భారీ అంచనాలు.. అదిరిపోయే ఆరంభం

భారీ అంచనాలు.. అదిరిపోయే ఆరంభం

చాలా భాషల్లో ప్రసారం అవుతోన్న తెలుగు బిగ్ బాస్‌కు మాత్రమే భారీ ఆదరణ వస్తుంది. దీనికి ఇక్కడి ప్రేక్షకులు అందిస్తున్న స్పందనే కారణం. దీంతో ఐదో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే షోకు ముందే ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని నిర్వహకులు చెప్పారు. ఇందులో భాగంగానే 19 మంది కంటెస్టెంట్లను దింపడంతో పాటు ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచారు. దీంతో ప్రారంభ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ వచ్చింది. ఫలితంగా ఈ సీజన్‌కు గ్రాండ్ స్టార్ట్ దక్కినట్లైంది.

ఇప్పటి వరకూ ముగ్గురు... అడవాళ్లే ఔట్

ఇప్పటి వరకూ ముగ్గురు... అడవాళ్లే ఔట్

గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో తొమ్మిది మంది ఆడవాళ్లు, తొమ్మిది మంది మగవాళ్లు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. వీళ్లలో ఈ సారి లేడీ బిగ్ బాస్ అవుతారని అనుకున్నారు. అయితే, ఊహించని విధంగా ఇప్పటి వరకూ మూడు ఎలిమినేషన్స్ జరగగా అన్నింట్లోనూ ఆడవాళ్లే బయటకు వెళ్లిపోయారు. మొదటి వారంలో సరయు రాయ్, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారంలో లహరి షారిలు ఎలిమినేట్ అయ్యారు. దీంతో హౌస్‌లో ఆరుగురు ఆడవాళ్లు మాత్రమే మిగిలిపోయారు.

సందడిగా ఆదివారం ఎపిసోడ్.. నాగ్ అలా

సందడిగా ఆదివారం ఎపిసోడ్.. నాగ్ అలా


బిగ్ బాస్ షోలో ప్రతి ఆదివారం ఎలిమినేషన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందే కంటెస్టెంట్లు అందరితో హోస్ట్ నాగార్జున పలు రకాల ఆటలు ఆడిస్తుంటాడు. దీంతో సండే ఎపిసోడ్‌ ఫన్‌‌డేగా మారిపోతుంది. ఇక, నాలుగో వారానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా అదే విధంగా సాగింది. ఇక, ఆరంభంలోనే కంటెస్టెంట్లు అందరూ 'నిన్నే పెళ్లాడతా' సినిమాలోని పాటకు డ్యాన్స్ చేశారు. ఇది వచ్చి 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేశారు. దీంతో నాగార్జున ఎమోషనల్ అవుతూ కన్నీరు వస్తున్నాయని చెప్పాడు.

పలు రకాల ఆటలు... ఫుల్ ఫన్నీగా జరిగి

పలు రకాల ఆటలు... ఫుల్ ఫన్నీగా జరిగి

ఆదివారం ఎపిసోడ్‌లో భాగంగా హోస్ట్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లతో పలు రకాల ఆటలు ఆడించాడు. సినిమాల పేర్లు రాయడం, వాటిని గెస్ చేయడం అనే ఆట ఆడించాడు. ఇందుకోసం హౌస్‌మేట్స్‌ను రెండు టీమ్‌లుగా చేశాడు. ఇందులో శ్రీరామ్ టీమ్ గెలిచింది. ఆ తర్వాత దాక్కో దాక్కో మేక అనే టాస్క్‌ను పెట్టాడు. ఇక ఇందులో మేక అని చెప్పిన కంటెస్టెంట్ పులికి దొరక్కుండా పరిగెత్తాలి అని చెప్పాడు. దొరికితే మేక చచ్చినట్టు.. దొరక్కపోతే పులి చచ్చినట్టు తెలిపాడు. ఓడిన వారికి పనిష్మెంట్ అని చెప్పాడు. ఇందులో మానస్ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు.

నాల్గో వారం మాత్రం అతడు ఎలిమినేట్

నాల్గో వారం మాత్రం అతడు ఎలిమినేట్


బిగ్ బాస్ షో మొత్తాన్ని నడిపించే టాస్కుల్లో నామినేషన్స్ ప్రక్రియే ముఖ్యమైనది. ఈ వారం కూడా కొన్ని గొడవలతో షో అలాగే సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో లోబో, ఆర్జే కాజల్, వీజే సన్నీ, సిరి హన్మంత్, ఆనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, ప్రియ, యాంకర్ రవిలు ఉన్నారు. వీరిలో ఎవరు వెళ్తారన్న దానిపై ఆరంభం నుంచే అందరిలో క్లారిటీ ఉంది. అందుకు అనుగుణంగానే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో నటరాజ్ మాస్టర్ బయటకు వెళ్లిపోయాడు. దీంతో హౌస్‌లో 15 మందే మిగిలారు.

షోలో గుంటనక్క ఎవరో చెప్పిన నటరాజ్

షోలో గుంటనక్క ఎవరో చెప్పిన నటరాజ్

బిగ్ బాస్ హౌస్‌లో ఓ గుంటనక్క ఉందని ఆరంభంలోనే నటరాజ్ మాస్టర్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఆ నక్క ఇంట్లో అందరినీ మార్చేసే ప్రయత్నాలు చేస్తుందని కూడా చెప్పాడు. అప్పటి నుంచి అది ఎవరన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలిమినేషన్ సమయంలో నటరాజ్ మాస్టర్‌తో కంటెస్టెంట్లను జంతువులతో పోల్చే గేమ్ ఆడించాడు నాగార్జున. ఆ సమయంలో గుంటనక్క యాంకర్ రవి అని తేల్చేశాడు. అలాగే, సిరికి పాము, లోబో ఎలుక, విశ్వ ఊసరవెల్లి, శ్రీరామ చంద్ర మొసలి అని తెలిపాడు. ఇక, సింహం మాత్రం తానేనని చెప్పాడు.

Recommended Video

Naga Chaitanya Samantha Divorce, ఆమెపై దుష్ప్రచారం వద్దు | #ChaySam || Filmibeat Telugu
ఆమె వల్లే ఎలిమినేట్ చేశారని చెప్పాడు

ఆమె వల్లే ఎలిమినేట్ చేశారని చెప్పాడు

బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటకు వెళ్లిపోయే సమయంలో నటరాజ్ మాస్టర్ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న భార్యకు తన అవసరం వచ్చిందేమోనని.. అందుకే ఆ భగవంతుడు తనను ఇలా ఎలిమినేట్ చేసి ఆమె దగ్గరకు పంపుతున్నాడని చెప్పుకొచ్చాడతను. అంతేకాదు, తన భార్యకు ఇచ్చిన ప్రామిస్‌ను నెరవేర్చలేకపోయానని బాధ పడ్డాడు. ఆ సమయంలో నాగార్జున అతడిని ఓదార్చాడు. అలాగే, మీకు త్వరలోనే పండండి బిడ్డ పుట్టాలని నటరాజ్‌ను ఆశీర్వదించాడు. దీంతో నాలుగో వారం ఎలిమినేషన్ ఇలా పూర్తైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X