Bigg Boss: ఐదో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. తక్కువ ఓట్లు ఆమెకు.. బయటకు వెళ్లేది మాత్రం అతడే!

కంటెంట్ ఎలా ఉన్నా ప్రేక్షకుల మద్దతు దొరికితే ఓ కార్యక్రమం అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుందనడానికి ఉదాహారణగా నిలుస్తోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. అందుకే దేశంలోనే సక్సెస్‌ఫుల్ షోలలో ఇది ఒకటిగా ఉంది. మరీ ముఖ్యంగా తెలుగులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ షో.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకుని విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదోది కూడా ప్రారంభం అయింది. ఇక, ఇందులో ఇప్పటికే నాలుగు ఎలిమినేషన్లు అయిపోయాయి. ఐదో వారం ఏకంగా తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. అందులో ఎవరు బయటకు వెళ్తారన్న దానిపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ వారం బిగ్ ట్విస్ట్ ఉండబోతుందట. ఆ వివరాలు మీకోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 భారీ అంచనాలు... రికార్డు స్థాయి రేటింగ్‌

భారీ అంచనాలు... రికార్డు స్థాయి రేటింగ్‌

తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్‌కు మాత్రమే భారీ రేటింగ్ వస్తుంది. దీంతో ఐదో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని నిర్వహకులు చెప్పారు. ఇందులో భాగంగానే 19 మంది కంటెస్టెంట్లను దింపడంతో పాటు ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచారు. దీంతో ప్రారంభ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ వచ్చింది. దీంతో రికార్డు స్థాయిలో రేటింగ్‌ దక్కింది. అదే సమయంలో ఈ సీజన్‌పై ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది.

 4 వారాల్లో ముగ్గురు లేడీస్.. నటరాజ్‌తో

4 వారాల్లో ముగ్గురు లేడీస్.. నటరాజ్‌తో

ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ప్రతి వారం నామినేషన్స్‌లో ఎక్కువ మందిని ఉంచుతూ ప్రేక్షకులకే పవర్స్ ఇస్తున్నారు నిర్వహకులు. ఈ నేపథ్యంలో మొదటి వారం సరయు రాయ్ ఎలిమినేట్ అయింది. రెండో వారంలో సీనియర్ నటి ఉమాదేవి, మూడో వారంలో లహరి షారి ఎలిమినేట్ అయిపోయింది. ఇలా ఆరంభంలోనే ముగ్గురూ లేడీసే వెళ్లిపోయారు. ఇక, నాలుగో వారంలో మాత్రం ఎలిమినేషన్స్‌లో మార్పు కనిపించింది. ఫలితంగా ఈ సీజన్‌లో మొదటి మేల్ కంటెస్టెంట్‌ నటరాజ్ మాత్రం హౌస్‌ నుంచి వెళ్లిపోయాడు.

 ఐదో వారం ఏకంగా తొమ్మిది మంది రాక

ఐదో వారం ఏకంగా తొమ్మిది మంది రాక

బిగ్ బాస్ షోలోనే అత్యంత ముఖ్యమైన ప్రక్రియల్లో నామినేషన్స్ ఒకటి. ఇది జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఒక్కో సమయంలో కొట్టుకుంటారా అన్నట్లు కూడా ఇది సాగుతూ ఉంటుంది. ఈ వారం కూడా కొన్ని గొడవలతో షో అలాగే సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో ఏకంగా తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో లోబో, వీజే సన్నీ, ప్రియ, యాంకర్ రవి, మానస్, విశ్వ, హమీదా, షణ్ముఖ్ జస్వంత్, జస్వంత్ పడాలలు ఉన్నారు. వీరిలో ఎవరు బయటకు వెళ్తారన్నది ఎంతో ఆసక్తిగా మారింది.

 ఐదో వారం టాప్‌లో అతడే... ఆ తర్వాత

ఐదో వారం టాప్‌లో అతడే... ఆ తర్వాత

ఐదో వారానికి సంబంధించి మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉన్నారు. ఇందులో అందరూ అనుకున్నట్లుగానే షణ్ముఖ్ జస్వంత్ ఆరంభం నుంచీ టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడికి దాదాపు నలభై శాతం కంటే ఎక్కువ ఓట్లు పడినట్లు తెలిసింది. ఇక, రెండో స్థానంలో వీజే సన్నీ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రైవేటు పోల్స్‌లో సైతం అతడికే షణ్ముఖ్ తర్వాత ఎక్కువ ఓట్లు పడుతున్నాయట. మూడో స్థానంలో మరో మేల్ కంటెస్టెంట్ మానస్ ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ ముగ్గురికే దాదాపు 60 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయట.

నాలుగు నుంచి ఏడో స్థానం వరకు వాళ్లే

నాలుగు నుంచి ఏడో స్థానం వరకు వాళ్లే

ఐదో వారంలో చాలా మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉండడంతో ప్రేక్షకుల ఎవరికి ఓటు వేయాలన్న దానిపై అయోమయానికి గురైనట్లు కనిపించింది. అందుకే ఓటింగ్ పొజిషన్స్ తరచూ మారుతూ వచ్చాయట. ఇక, తాజా సమాచారం ప్రకారం.. టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా బరిలోకి దిగిన రవి ఈ వారం నాలుగో స్థానానికే పరిమితం అయ్యాడట. అలాగే, అతడి తర్వాత ప్రియ ఐదో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లతో పాటు జస్వంత్ ఆరో స్థానానికి చేరుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఏడో స్థానంలో మాత్రం లోబో ఉన్నాడట. వీళ్లంతా సేఫ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్.

 డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఒకరు అవుట్

డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఒకరు అవుట్

ఐదో వారానికి సంబంధించి తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అవగానే.. అందరి కంటే తక్కువ ఫాలోయింగ్ ఉన్న హమీదా, విశ్వ డేంజర్‌ జోన్‌లోకి వెళ్లారన్న టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరే ఇప్పుడు తక్కువ ఓట్లను అందుకున్నారట. ఫలితంగా చివరి స్థానాల్లో ఉండడంతో పాటు ఎలిమినేషన్ అయ్యే ప్రమాదంలో పడిపోయారు. తాజా సమాచారం ప్రకారం.. యాక్టర్ విశ్వ ఎనిమిదో స్థానంలో, హమీదా తొమ్మిదో స్థానంలో ఉన్నారట. ఫలితంగా ఈ ఆదివారం జరిగే ఎపిసోడ్‌లో వీళ్లిద్దరిలోనే ఒకరు హౌస్‌ నుంచి బయటకు వెళ్లిపోతారని సమాచారం.

ఐదో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్

ఐదో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్

బిగ్ బాస్ షో అంటేనే ఊహించని ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రేక్షకుల మద్దతు ఉన్న కంటెస్టెంట్లు ముందుగానే బయటకు వెళ్లిపోతూ ఉంటారు. ఇలా ఇప్పటికే చాలా సార్లు జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది. ఓటింగ్ పరంగా చివరి స్థానంలో ఉన్న హమీదాను కాపాడి.. విశ్వను ఎలిమినేట్ చేయబోతున్నారట. దీనికి కారణం హమీదా వల్ల హౌస్‌లో రొమాన్స్ పండుతోంది. దాని వల్ల షోకు బాగా ఉపయోగం అని వాళ్లు భావిస్తున్నట్లు ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X