Bigg Boss: ఆరో వారం సంచలన ఎలిమినేషన్.. డేంజర్‌ జోన్‌లో టాప్ కంటెస్టెంట్లు.. ఆ నలుగురిలో ఒకరు ఔట్

కాన్సెప్టు ఎలాంటిదైనా ప్రేక్షకుల మద్దతు దొరికిన ఏ షో అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దీనికి ఉదాహరణే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కంటెంటే అయినా తెలుగు ప్రేక్షకులు దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందిస్తున్నారు. ఫలితంగా దేశంలో చాలా భాషల్లో వస్తున్నా.. మన దగ్గర మాత్రమే ఎక్కువ రేటింగ్‌ను అందుకుంటోంది. ఇలా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఐదో దానిని కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక, ఈ సీజన్‌లో ఇప్పటికే ఐదుగురు ఎలిమినేట్ అయిపోయారు. ఆరో వారంలో మాత్రం ఏకంగా పది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వీళ్ల నుంచి ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అన్న దానిపై ఎన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

గ్రాండ్ ఆరంభం.. ఆసక్తిని పెంచుతూ

గ్రాండ్ ఆరంభం.. ఆసక్తిని పెంచుతూ

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్‌కు మాత్రమే భారీ రేటింగ్ వస్తుంది. దీంతో ఐదో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని నిర్వహకులు చెప్పారు. ఇందులో భాగంగానే 19 మంది కంటెస్టెంట్లను దింపడంతో పాటు ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచారు. దీంతో ప్రారంభ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ వచ్చింది. ఈ ఉత్సాహంతోనే షోను మరింత రంజుగా మార్చేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్‌పై ఆసక్తి క్రమంగా పెరుగుతూనే వస్తోంది.

5 వారాల్లో నలుగురు లేడీస్‌తో ఒక్కడే

5 వారాల్లో నలుగురు లేడీస్‌తో ఒక్కడే

తాజాగా వస్తున్న సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ప్రతి వారం నామినేషన్స్‌లో ఎక్కువ మందిని ఉంచుతూ ప్రేక్షకులకే పవర్స్ ఇస్తున్నారు నిర్వహకులు. ఈ నేపథ్యంలో మొదటి వారం సరయు రాయ్ ఎలిమినేట్ అయింది. రెండో వారంలో సీనియర్ నటి ఉమాదేవి, మూడో వారంలో లహరి షారి ఎలిమినేట్ అయిపోయింది. ఇలా ఆరంభంలోనే ముగ్గురూ లేడీసే వెళ్లిపోయారు. ఇక, నాలుగో వారంలో మాత్రం మేల్ కంటెస్టెంట్‌ నటరాజ్ మాత్రం హౌస్‌ నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ ఆరో వారంలో హమీదా బయటకు వెళ్లిపోయింది.

ఆరో వారం ఏకంగా పది మంది ఎంట్రీ

ఆరో వారం ఏకంగా పది మంది ఎంట్రీ

ఈ రియాలిటీ షోలోనే అత్యంత ముఖ్యమైన ప్రక్రియల్లో నామినేషన్స్ ఒకటి. ఇది జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఒక్కో సమయంలో కొట్టుకుంటారా అన్నట్లు కూడా ఇది సాగుతూ ఉంటుంది. ఈ వారం కూడా కొన్ని గొడవలతో షో అలాగే సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో ఏకంగా పది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో లోబో, వీజే సన్నీ, ప్రియాంక, రవి, విశ్వ, శ్రీరామ్, షణ్ముఖ్, జస్వంత్, శ్వేతా వర్మ, సిరి హన్మంత్‌లు ఉన్నారు. వీరిలో ఎవరు బయటకు వెళ్తారన్న దానిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ వారం టాప్‌లో అతడే... ఆ తర్వాత

ఈ వారం టాప్‌లో అతడే... ఆ తర్వాత

ఆరో వారానికి సంబంధించి మొత్తం పది మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉన్నారు. ఇందులో టైటిల్ ఫేవరెట్ అయిన షణ్ముఖ్ జస్వంత్ ఊహించినట్లుగానే టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడికి దాదాపు ముప్పై శాతం కంటే ఎక్కువ ఓట్లు పడినట్లు తెలిసింది. ఇక, రెండో స్థానంలో వీజే సన్నీ ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. మూడో స్థానంలో మిస్టర్ కూల్ శ్రీరామ చంద్ర కొనసాగుతున్నాడని అంటున్నారు. అధికారిక పోల్స్‌లోనే కాదు.. ప్రైవేటు పోల్స్‌లో సైతం ఈ ముగ్గురు మేల్ కంటెస్టెంట్లే టాప్ 3లో ఉన్నారట. వీళ్లకే సగం ఓట్లు పడ్డాయని తెలుస్తోంది.

మారిన స్థానాలు.. ఆరు వరకూ ఎవరు?

మారిన స్థానాలు.. ఆరు వరకూ ఎవరు?

ఆరో వారంలో చాలా మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉండడంతో ప్రతిరోజూ ఓటింగ్ పొజిషన్లు మారుతూ వచ్చాయి. సోమవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకూ ఇదే పద్దతి కనిపించింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా బరిలోకి దిగిన రవి ఈ వారం నాలుగో స్థానానికే పరిమితం అయ్యాడట. అలాగే, అతడి తర్వాత ఐదో స్థానంలో రోజుకొకరు ఉంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రియాంక సింగ్, శ్వేతా వర్మ కూడా సేఫ్ అయినట్లు అంటున్నారు. మిగిలిన వాళ్ల స్థానాలు క్రమంగా మారుతూ వస్తున్నాయని సమాచారం.

వాళ్లంతా డేంజర్ జోన్‌లో.. ఒకరు ఔట్

వాళ్లంతా డేంజర్ జోన్‌లో.. ఒకరు ఔట్

ఆరో వారానికి సంబంధించి పది మంది కంటెస్టెంట్లు నామినేట్ అవగా.. ప్రతి వారంలా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై క్లారిటీ రావడం లేదు. దీనికి కారణం ప్రతిరోజూ ఓటింగ్ పొజిషన్లు మారుతూ రావడమే అని అంటున్నారు. నామినేషన్స్‌లో ఉన్న పది మందిలో ఆరుగురు ఇప్పటికే సేఫ్ అవగా.. టైటిల్ ఫేవరెట్లు అనుకున్న సిరి హన్మంత్, లోబోతో పాటు విశ్వ, జస్వంత్ పడాలలు ఈ వారం డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అనధికారిక పోల్స్‌లో సైతం వీళ్లకే తక్కువ ఓట్లు పోలైనట్లు తెలిసింది. దీంతో వీళ్లలోనే ఒకరు వెళ్లిపోతారని అంటున్నారు.

Recommended Video

Bigg Boss Telugu 5 : కాజల్, సిరిలకు దిమ్మతిరిగే షాక్.. మా ఇష్టం అంటూ రెచ్చిపోయి..!| Filmibeat Telugu
ఆరో వారంలో సంచలన ఎలిమినేషన్

ఆరో వారంలో సంచలన ఎలిమినేషన్

బిగ్ బాస్ అంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల మద్దతు ఉన్న కంటెస్టెంట్లు ముందుగానే బయటకు వెళ్లిపోతూ ఉంటారు. ఇలా ఇప్పటికే చాలా సార్లు జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో వారం ఎలిమినేషన్‌లో సంచలనం ఏదైనా జరగబోతుందా అన్న టాక్ వినిపిస్తోంది. అంటే టైటిల్ ఫేవరెట్ అయిన సిరి హన్మంత్‌ను బయటకు పంపుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ, అంత సాహసం చేస్తారా అంటే చెప్పలేని పరిస్థితి. ఇది బిగ్ బాస్ కాబట్టి ఏదైనా జరగొచ్చు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X