Bigg Boss Elimination: ముందే లీకైన బిగ్ బాస్ ప్లాన్.. ఈ వారం ఆ కంటెస్టెంటే ఔట్.. కానీ చివర్లో అలా!

చిత్ర విచిత్రమైన టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య కొట్లాటలు.. కోల్డ్ వార్‌లు.. ప్రేమ వ్యవహారాలు.. రొమాంటిక్ సన్నివేశాలు.. మొత్తంగా ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలియని పరిస్థితులతో ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న ఏకైక షో బిగ్ బాస్. ఇంతకు ముందెన్నడూ చూడని కంటెంటే అయినా తెలుగు ప్రేక్షకులు దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందివ్వడంతో దేశంలో చాలా భాషల్లో వస్తున్నా.. మన దగ్గర మాత్రమే ఎక్కువ రేటింగ్‌ను అందుకుంటోంది. ఇప్పుడు ఐదో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక, ఈ సీజన్‌లో ఇప్పటికే ఎడుగురు ఎలిమినేట్ అయిపోయారు. ఎనిమిదో వారంలో ఎవరు బయటకు వెళ్లబోతున్నారో ఆ వివరాలు మీకోసం!

ముందే చెప్పారు.. నడిపిస్తున్నారు

ముందే చెప్పారు.. నడిపిస్తున్నారు

ఐదో సీజన్‌కు ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని నిర్వహకులు ముందే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే 19 మంది కంటెస్టెంట్లను తీసుకొచ్చి.. గొడవలు, బూతులు, రొమాన్స్ చూపిస్తూ పలు రకాలుగా మజాను పంచారు. దీంతో ప్రారంభ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ వచ్చింది. ఈ ఉత్సాహంతోనే షోను మరింత రసవత్తరంగా మార్చేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు.

19 మందిలో ఏడుగురు ఎలిమినేట్

19 మందిలో ఏడుగురు ఎలిమినేట్

తాజా సీజన్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున.. ఏడు వారాలకు ఏడుగురు సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. అందులో మొదటి వారం సరయు రాయ్, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారంలో హమీదా, ఆరో వారంలో శ్వేత వర్మ, ఏడో వారంలో ప్రియ ఎలిమినేట్ అయిపోయారు.

దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌తో రచ్చ

దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌తో రచ్చ

బిగ్ బాస్ షో జరుగుతోన్న సమయంలో వీకెండ్ ఎపిసోడ్స్ ఎంతో స్పెషల్‌గా ఉంటాయి. అలాంటిది దీనికి పండుగలు లాంటివి ఏమైనా వస్తే.. అవి ఇంకా ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. ఈ మధ్యనే షో నిర్వహకులు దసరా స్పెషల్ ఎపిసోడ్ నిర్వహించారు. ఇక, ఇప్పుడు అంటే ఆదివారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నారట. ఇందులో బిగ్ బాస్ టీమ్ సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసింది.

ఈ వారంలో ఆరుగురు నామినేషన్

ఈ వారంలో ఆరుగురు నామినేషన్

ఈ వారం జరిగిన నామినేషన్స్ టాస్కులో గొడవలు పెద్దగా కనిపించలేదు. అయితే, అనూహ్యంగా కొంత మంది త్యాగాలు చేస్తూ నామినేషన్స్‌లోకి వచ్చారు. ఇలా ఎనిమిదో వారానికి గానూ లోబో, యాంకర్ రవి, సింగర్ శ్రీరామ చంద్ర, షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్‌, మానస్‌లు నామినేట్ అయిపోయారు. వీరిలో ఎవరు బయటకు వెళ్తారన్న దానిపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

చివర్లో వాళ్లిద్దరిని ఉంచి సస్పెన్స్

చివర్లో వాళ్లిద్దరిని ఉంచి సస్పెన్స్

ఎనిమిదో వారం మొత్తం ఆరుగురు సభ్యులు నామినేషన్స్‌లో ఉండగా.. అందులో షణ్ముఖ్ జస్వంత్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. అతడి తర్వాత మానస్, శ్రీరామ్‌కు కూడా బాగానే ఓట్లు పోలయ్యాయట. ఇక, మిగిలిన ముగ్గురిలో సిరి హన్మంత్‌ కూడా ఈ వారం బయట పడిందని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. చివరి ఇద్దరిలో రవి, లోబో ఉంటారని తెలుస్తోంది.

అతడే ఎలిమినేట్ అయిపోయాడు

అతడే ఎలిమినేట్ అయిపోయాడు

ఆదివారం సాయంత్రం జరగబోతున్న దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌లో ప్రత్యేకంగా ఎంట్రీ ఇవ్వబోతున్న సెలెబ్రిటీల ద్వారా కొందరు కంటెస్టెంట్లను సేఫ్ అయినట్లు ప్రకటించబోతున్నారట. ఇక, చివర్లో లోబో, రవిని ఉంచి కాసేపు ఎమోషనల్ సీన్స్‌ను పండించే ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇక, ఈ వారం లోబోనే ఎలిమినేట్ అయిపోయాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Recommended Video

Manchi Rojulochaie చిన్న సినిమానే.. కానీ కంటెంట్ లో పెద్ద సినిమా..!!
ముందే లీకైన బిగ్ బాస్ ప్లాన్.. చివర్లో

ముందే లీకైన బిగ్ బాస్ ప్లాన్.. చివర్లో

తాజా సమాచారం ప్రకారం.. ఈ వారం ఎలిమినేట్ అయిన లోబోకు బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే, అది ఏంటి అనేది మాత్రం బయటకు రాలేదు. కానీ, అది బిగ్ బాంబ్ లేదా ఒకరికి మేలు చేకూర్చేదిగా ఉండే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దీంతో ఆదివారం జరిగే దివాళీ స్పెషల్ ఎపిసోడ్‌పై ఆసక్తి మరింత పెరిగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X