Bigg Boss 5 Telugu : ఈసారి ఊహించని చీఫ్ గెస్ట్.. మెగాస్టార్ ను కాదని మరీ పిలుపు.. ఎందుకో తెలుసా?
బిగ్ బాస్ 5 తెలుగు చివరికి వచ్చేసింది. మరో రెండు వారాల్లో షో ముగియనుంది. ఈ వారం నామినేషన్స్ కూడా ఆసక్తికరంగా జరిగాయి. చివరి నామినేషన్స్ ప్రక్రియ కావడంతో ఈ హౌస్ నుంచి 14వ వారం ఎవరు బయటికి వెళ్లిపోతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆఖరి వారం నామినేషన్స్ చాలా డిఫెరెంట్‌గా ప్లాన్ చేసాడు బిగ్ బాస్. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి ఐదుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. ఆ సంగతి పక్కన పెడితే ఫినాలే గెస్ట్ గా కొత్త పేరు తెర మీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఐదుగురు నామినేషన్స్
ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో కేవలం శ్రీరామ్ మాత్రమే సేఫ్ అయ్యారు. ఆయన టిక్కెట్ టూ ఫినాలే గెలవడంతో ఆయనెవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు అని బిగ్ బాస్ చెప్పడంతో ఈ వారం ఆయన సేఫ్ అయ్యారు. దీంతో మిగిలిన ఐదుగురు నామినేషన్స్ రసవత్తరంగా జరిగాయి.

టాప్ 2లో ఈ ఇద్దరూ
శ్రీరామచంద్ర మినహా మిగిలిన ఇంటి సభ్యులంతా నామినేట్ అయ్యారు. ఇందులో షణ్ముక్, సన్నీ , మానస్, సిరి, కాజల్ ఉన్నారు. వీళ్లలో టాప్ 5లోకి ఎవరు వెళ్తారు? ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఆ ఒక్క కంటెస్టెంట్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తుంటే మాత్రం సన్నీ, షణ్ముక్ సేవ్ అవ్వడం ఖాయం. ఈ ఇద్దరికి బయట మంచి ఫాలోయింగ్ ఉంది. కచ్చితంగా టాప్ 2లో ఈ ఇద్దరూ ఉంటారు అని అంచనా.

సిరి, కాజల్ లో ఎవరో ఒకరు
ఇక వీరిద్దరూ కాకుండా శ్రీరామ్ ముందే ఫైనల్‌కు వచ్చాడు అంటే ముగ్గురి ప్లేస్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లే. మిగిలిన రెండు స్థానాల కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ వారం మానస్, సిరి, కాజల్ ముగ్గురిలో ఎలిమినేషన్ అనేది జరుగుతుందని చెబుతున్నారు. సిరి, కాజల్ లో ఎవరో ఒకరు బయటకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా?
ఇక ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ లెక్కల ప్రకారం చూస్తుంటే కాజల్ కంటే సిరికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయని అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే బిగ్ బాస్ తెలుగు 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారని బిగ్ బాస్ వర్గాలు ధృవీకరించాయబు టెక్య్స్టిబడు. అల్లు అర్జున్ తన రాబోయే చిత్రం 'పుష్ప'ను ప్రమోట్ చేయడానికి బిగ్ బాస్ తెలుగు 5 ముగింపు ఎపిసోడ్‌లో పాల్గొననున్నాడబు అంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి?
ఈ పుష్ప డిసెంబర్ 17న విడుదల కానుండగా, బిగ్ బాస్ తెలుగు 5 ముగింపు ఎపిసోడ్ డిసెంబర్ 19, 2021న జరగనుంది. అయితే, ఈ వార్తల గురించి అధికారిక ధృవీకరణ అయితే ఏమీ లేదు. నిజానికి ముందు నుంచి ఈ సీజన్ కు కూడా మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కానీ ఆయన ఇప్పటికే మూడు సార్లు చీఫ్ గెస్ట్ గా రావడంతో అల్లు అర్జున్ ఈసారి రాబోతున్నాడని అంటున్నారు. ఆయన మొన్న ఢీ షో ఫినాలేకు కూడా చీఫ్ గెస్ట్ గా వెళ్లారు.


Click it and Unblock the Notifications











