Bigg Boss: ఆ కంటెస్టెంట్‌కు బుల్లితెర బ్యూటీల సపోర్ట్.. కొత్త విషయాలు బయటకు.. ఆమెకు కూడా భారీగానే!

తెలుగు బుల్లితెరపైకి ఎన్నో అనుమానాల నడుమ పరిచయమై.. ఎవరూ ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో స్పందనను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. పాశ్చాత్య నాగరికతకు అద్దం పట్టే కాన్సెప్టుతో నడిచే ఈ కార్యక్రమానికి మన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో ఏకంగా నాలుగు సీజన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక, ఇటీవలే ఐదో దానిని కూడా నిర్వహకులు మొదలు పెట్టారు. ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోన్న దీనికి కూడా మంచి స్పందనే వస్తోంది. ఇక, ఇందులో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే పాపులర్ అయిన వాళ్లు ఉన్నారు. వీరందరిలో ఇద్దరు ముగ్గురు టైటిల్ ఫేవరెట్లు కాకుండా మరో కంటెస్టెంట్‌కు సెలెబ్రిటీల మద్దతు లభిస్తోంది. ఇంతకీ ఎవరు? ఆ వివరాలు మీకోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

అన్నింటికీ మించేలా... అదిరిపోయేలా

అన్నింటికీ మించేలా... అదిరిపోయేలా

తెలుగులో బిగ్ బాస్ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే ఐదో సీజన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇందులో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను తీసుకొచ్చారు. అలాగే, గొడవలు, బూతులు, రొమాన్స్, ప్రేమ కహానీలు చూపిస్తూ మజాను పంచుతున్నారు. దీంతో ప్రారంభ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ వచ్చింది. ఈ ఉత్సాహంతోనే క్రమక్రమంగా సీజన్‌లో కొత్తదనం చూపిస్తూ మరింత ఆసక్తికరంగా నడుపుతున్నారు.

సరికొత్తవి చూపిస్తూ బిగ్ బాస్ ప్రయోగం

సరికొత్తవి చూపిస్తూ బిగ్ బాస్ ప్రయోగం

బిగ్ బాస్ ఐదో సీజన్ ఇప్పుడు నాలుగో వారం జరుగుతోంది. అయినప్పటికీ ఈ కొద్ది రోజుల్లోనే నిర్వహకులు సరికొత్తవి చూపించారు. ఇప్పటికే ఎన్నో వినూత్నమైన టాస్కులను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అలాగే, నామినేషన్స్‌లో సైతం ఎక్కువ మంది ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఓటింగ్ ఎక్కువ అవడంతో పాటు కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే, ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో బిగ్ బాస్‌కు కొంత ఆదరణ తగ్గుతుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో మరిన్ని ప్రయోగాలతో నిర్వహకులు ముందుకొస్తున్నారు. దీంతో షో మంచిగా సాగిపోతోంది.

ముగ్గురు బయటకు.. అందరూ వాళ్లేగా

ముగ్గురు బయటకు.. అందరూ వాళ్లేగా

బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి రికార్డు స్థాయిలో 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొదటి వారం ఏడుగురు సభ్యులు నామినేట్ అవగా.. అందులో నుంచి సరయు రాయ్ ఎలిమినేట్ అయింది. రెండో వారంలో ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉండగా సీనియర్ నటి ఉమాదేవి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇక, మూడో వారంలో ఐదుగురు మెంబర్లు నామినేషన్స్‌లోకి వెళ్లగా.. వాళ్ల నుంచి లహరి షారి ఎలిమినేట్ తిరిగి వచ్చేసింది. ఇలా మూడు వారాలు మూడు ఎలిమినేషన్స్ జరగగా.. ఆడవాళ్లే బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.

నాలుగో వారంలో ఎనిమిది మందితో

నాలుగో వారంలో ఎనిమిది మందితో

బిగ్ బాస్ షోలో నామినేషన్స ప్రక్రియ ఎంత ముఖ్యమైనదో తెలిసిందే. ఇది జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఒక్కో సమయంలో కొట్టుకుంటారా అన్నట్లు కూడా ఇది సాగుతూ ఉంటుంది. ఈ వారం కూడా కొన్ని గొడవలతో షో అలాగే సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో లోబో, ఆర్జే కాజల్, వీజే సన్నీ, సిరి హన్మంత్, ఆనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, ప్రియ, యాంకర్ రవిలు ఉన్నారు. వీరిలో ఎవరు వెళ్తారన్న దానిపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.

 తొలిసారి నామినేషన్స్‌లో ఉన్న సన్నీ

తొలిసారి నామినేషన్స్‌లో ఉన్న సన్నీ

బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంతో మంది కంటెస్టెంట్లు వచ్చినా.. చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకులకు సుపరిచితులు అయి ఉంటారు. అయితే, ఐదో సీజన్‌లో మాత్రం చాలా మంది తెలిసిన వాళ్లే ఉన్నారు. అందులో వీజే సన్నీ ఒకడు. యాంకరింగ్‌తో పరిచయం అయిన ఈ కుర్రాడు.. భారీ ఆశలతో హౌస్‌లోకి అడుగు పెట్టాడు. అందుకు అనుగుణంగానే ఆరంభం నుంచే తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. చక్కగా ఆడినా ఒక్కోసారి కొన్ని గొడవల్లో భాగం అవుతున్నాడు. దీంతో ఈ సీజన్‌లో తొలిసారి వీజే సన్నీ ఈ వారం నామినేషన్స్‌లోకి వచ్చాడు.

అతడికి బుల్లితెర బ్యూటీల మద్దతు

అతడికి బుల్లితెర బ్యూటీల మద్దతు

బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి వంటి వాళ్లు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. అయితే, వీజే సన్నీ మాత్రం ఆ రేంజ్‌లో లేకపోయినా ఫినాలే వరకూ చేరుకునే సత్తా ఉన్నవాడే అన్న టాక్ ఉంది. ఇక, ఈ వారం అతడు నామినేషన్స్‌లో ఉండడంతో బుల్లితెరకు సంబంధించిన అషు రెడ్డి, రోహిణి సహా ఎంతో మంది సెలెబ్రిటీలు సన్నీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు ఎంతో మంచోడని చెబుతూ ఓట్ చేయమని కోరుతున్నారు. అలాగే, అతడిలోని మంచితనాన్ని చూపిస్తూ పోస్టులు చేస్తున్నారు.

Recommended Video

Aishwarya Rajesh And Deva Katta Speaks About Republic Movie
ఆమెకు కూడా సెలెబ్రిటీలు సపోర్ట్ చేసి

ఆమెకు కూడా సెలెబ్రిటీలు సపోర్ట్ చేసి

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. కానీ, వారిలో కొందరికి మాత్రమే ప్రేక్షకుల మద్దతు లభిస్తోంది. అందులో సీనియర్ నటి ప్రియ ఒకరు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఆమె ఇప్పటికే నామినేషన్స్‌లో సేవ్ అయింది. ఇప్పుడు మరోసారి నామినేషన్స్‌లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గత సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్‌తో పాటు పలువురు ప్రముఖులు ప్రియకు సపోర్ట్ చేస్తున్నారు. తను ఎంతో చక్కగా ఆడుతుందని చెబుతూ ఓట్ చేయమని కోరుతున్నారు. దీంతో ఈ ఇద్దరి భారీగా ఓట్లు పడుతున్నాయని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X