Troll on Priya: వీజే సన్నీపై ఎటాక్.. ప్రియపై దారుణమైన ట్రోల్స్

బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పుడు కొంతమంది చాలా నెమ్మదిగా కనిపించారు. అసలు వీళ్ళు ఎక్కువరోజులు ఉంటారా ఉండరా? అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ అలాంటి వాళ్లే ఇప్పుడు ఎక్కువగా హైలెట్ అవుతూ వస్తున్నారు. ఏదేమైనా బిగ్ బాస్ హౌస్ లో కొట్లాటలు జరగడం అనేది చాలా కామన్. అయితే గత వారం నుంచి కూడా ప్రియ vs సన్నీ అనే విధంగా గొడవలు జరుగుతున్నాయి.

వీరిద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ విషయంలో అయితే ఎవరు తగ్గడం లేదు. సన్నీ ఎంతో ఓర్పుతో ఉన్నప్పటికీ కూడా ప్రియా కావాలని అతన్ని రెచ్చగొడుతూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ప్రియపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి.

దొంగతనం అందరి దగ్గర చేయాలి..

దొంగతనం అందరి దగ్గర చేయాలి..

నీకు అంతగా దొంగతనం చేయాలని అనిపిస్తే అందరి దగ్గర తీసుకోవాలి కానీ కేవలం సన్నీని ఎందుకు టార్గెట్ చేస్తున్నావ్? ప్రియా నువ్వు విలువ లేని మాటలు బాడీ లాంగ్వేజ్ తగ్గించుకుంటే మంచిది అంటూ కొందరు నెటిజన్లు హెచ్చరికలు చేస్తున్నారు. కావాలని ఆమె రెచ్చగొడుతోందని తిట్టిన తర్వాత సన్నీ సహనం కోల్పోతే అతని పై ఉమెన్ కార్డు ప్రయోగించాలని చూస్తున్నట్లు కూడా అర్థమవుతోందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

సహనం కోల్పోతున్న సన్నీ

సహనం కోల్పోతున్న సన్నీ

ప్రియా సన్నీ దగ్గర గుడ్లను దొంగతనం చేస్తుంది. అంతేకాకుండా అతని తిడుతూ కూడా సహనం కోల్పోతుంది. సన్నీ తన ఎగ్స్ సేవ్ చేసుకుంటున్నప్పుడు కొంత ఫిజికల్ అవ్వడం అయితే కామన్. కానీ అదే సమయంలో ప్రియా అతన్ని మెల్లగా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తోంది. సన్నీ కూడా వీలైనంత వరకు కూల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రియ మాటలకు అతను కొన్నిసార్లు సహనం కోల్పోవలసి వస్తోందని నెటిజన్లు చెబుతున్నారు.

నామినేషన్ దెబ్బ

నామినేషన్ దెబ్బ

కావాలని ప్రియ టాస్క్ లో సన్నీని రెచ్చగొట్టి అతనికి కోపాన్ని తెప్పించాలని చూస్తోంది. కానీ సన్నీ ఎక్కువగా తన సహనంతో ఓపికతో ఉంటున్నాడు. షన్ను అభిమానులు కూడా ఎక్కువగా సన్నీకి మద్దతు పలుకుతున్నారు. ప్రియ గారు రోజురోజుకీ తన గౌరవాన్ని కోల్పోతున్నట్లు చెబుతున్నారు. ప్రియా గారు కావాలని దొంగతనం చేస్తున్నారు అతని చెంప పగులుతది అని వార్నింగ్ కూడా ఇస్తుంది. దీంతో సన్నీ కంట్రోల్ లో ఉండలేకపోతున్నాడు. ఏమైనా అంటే మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఆమెకు నామినేషన్ దెబ్బ బాగా మాలుతున్నట్లు ఉంది అని కొందరు చెబుతున్నారు.

ప్రియకు నెగిటివ్ ఫ్యాన్స్

ప్రియకు నెగిటివ్ ఫ్యాన్స్

ప్రియ గారు అయితే చాలా క్లియర్ గా సన్నీని రెచ్చగొడుతున్నట్లు అలాగే వుమెన్ కార్డు కూడా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది అని చెబుతున్నారు. వీలైనంత వరకు సన్నీ తన సహనాన్ని ఓపికతో పట్టుకుని ఉండడం ప్రశంసించాల్సిన విషయమని, ఈ వారం అతనికి తమ ఓటు వేస్తామని మరికొందరు మద్దతు పలుకుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో అయితే సన్నీకి మద్దతు అందుతోంది. ఇక మరోవైపు ప్రియకు నెగిటివ్ ఫ్యాన్స్ ఎక్కువ అవుతున్నారు అని తెలుస్తోంది. ఓట్ల ప్రభావం కూడా పడనున్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ విషయంలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Recommended Video

Bigg Boss Telugu 5: షన్నుతో కాకుండా శ్రీరామ్‌ తో సిరి | VJ Sunny VS Priya వెకిలినవ్వుతో
దారుణమైన డైలాగ్స్

దారుణమైన డైలాగ్స్

వాల్ ఆఫ్ షేమ్ అంటూ ప్రియపై మరికొందరు దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన డైలాగ్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఒంటరిగా వుమెన్ ఏమైనా చేయగలదు.. ఏం పీకుతున్నారు. అబ్బాయిలతో బిజీగా వుంది. మొగోడిలా ఆడు. ఆడవాళ్లు చేస్తారు దొంగతనాలు అంటూ ఓ వర్గం నెటీజన్స్ ఆమె డైలాగ్స్ పై కూడా ట్రోల్స్ మొదలుపెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X