twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    BiggBoss5 ఒకరు బుల్లితెర స్టార్.. మరొకరు యూట్యూబ్ స్టార్.. ఐదో సీజన్ జాబితా లీక్!

    |

    బుల్లితెరపై బిగ్ బాస్ క్రియేట్ చేసిన, చేస్తున్న సంచలనాలు అంతా ఇంతా కాదు. ఇంటిల్లి పాది వినోదాన్ని అందించడంలో బిగ్ బాస్ శైలే వేరు. బిగ్ బాస్ షోను చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు అందరికీ ఎంతో ఇష్టముంటుంది. బిగ్ బాస్ అన్ని భాషల్లోనూ భారీగా క్లిక్ అయింది. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను ముగించుకుంది. ఇక ఐదో సీజన్‌కు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది.

    బిగ్ బాస్ రచ్చ..

    బిగ్ బాస్ రచ్చ..

    బిగ్ బాస్ షో నడిచినంత కాలం కూడా సోషల్ మీడియాలో హడావిడి, మీడియాలోనూ హల్చల్ జరుగుతూ ఉంటుంది. కంటెస్టెంట్ల అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ట్రోలింగ్, నెగెటివిటీ ఇలా ఎన్నో రకాలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది బిగ్ బాస్. అలా నాల్గో సీజన్ తెలుగులో గ్రాండ్ హిట్ అయింది.

    ఐదో సీజన్‌పై లాస్య..

    ఐదో సీజన్‌పై లాస్య..

    బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్ లాస్య ఆ మధ్య మాట్లాడుతూ.. జూన్‌లో ఐదో సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చింది. ఆల్రెడీ సెలెక్ట్ చేసే పనులు ప్రారంభమయ్యాయని పేర్కొంది. అయితే ఈ మధ్య కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

    వారికి చాన్స్..

    వారికి చాన్స్..

    ఐదో సీజన్‌లో మళ్లీ ఓ మీడియాలోని లేడీ యాంకర్‌కు, యూట్యూబ్ స్టార్, టిక్ టాక్ స్టార్‌లకు అవకాశాలు రాబోతోన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఓ కామన్ మ్యాన్ కూడా ఉండే అవకాశం ఉందట. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ మీద వీడియోలు చేసే క్రిటిక్స్‌కి కూడా అవకాశం ఇవ్వబోతోన్నట్టు టాక్.

    ఆ ఇద్దరి పేర్లు..

    ఆ ఇద్దరి పేర్లు..

    ప్రతీ సారి టీవీ 9 నుంచి ఒక కంటెస్టెంట్ ఉండటం ఆనవాయితే. ఈ సారి కూడా ఓ లేడీ యాంకర్ రాబోతోన్నట్టు టాక్. అంతే కాకుండా ఈ మధ్య రోజా అనే యాంకర్ బాగా పాపులర్ అయింది. ఆమెను కూడా బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

    ఆ ఇద్దరూ పక్కా..

    ఆ ఇద్దరూ పక్కా..

    యాంకర్ రవి మాత్రం బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఉన్నాడని సమాచారం అందుతోంది. ఇతను కాకుండా మరో కంటెస్టెంట్ కూడా పక్కా అని తెలుస్తోంది. తప్పతాగి కారు నడిపి వీరంగం సృష్టించి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన షణ్ముఖ్ కూడా ఉండబోతోన్నట్టు సమాచారం. ఈ రూమర్లు నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

    English summary
    Bigg Boss 5 Telugu Contestants Abcha Ravi and shanmukh Names Rounding..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X