Bigg Boss: మరో బాంబ్ పేల్చిన దీప్తి సునైనా.. షణ్ముఖ్‌కు బిగ్ షాక్!

బిగ్ బాస్.. తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోన్న షో. ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ షో ద్వారా చాలా మంది సెలెబ్రిటీలుగా మారిపోయి వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అదే సమయంలో మరికొందరు మాత్రం విమర్శలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో సోషల్ మీడియా సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ ఒకడు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అతడు.. హౌస్‌లో సిరి హన్మంత్‌తో రొమాన్స్ చేసిన కారణంగా చెడ్డపేరు తెచ్చుకున్నాడు. దీంతో అతడి గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునైనా గుర్రుగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, షణ్ముఖ్‌కు ఆమె బ్రేకప్ చెప్పబోతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మరో పోస్ట్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

టాప్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుని

టాప్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుని

మొదటి నాలుగు సీజన్లు సూపర్ హిట్ అవడంతో ఐదో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో చాలా మంది ఫుల్ పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. వీరిలో షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. దీనికి కారణం వెబ్ సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన అతడికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉండడమే. అందుకు అనుగుణంగానే హౌస్‌లోకి వచ్చిన సమయంలో అతడి పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిపోయింది.

ఆమెతో రొమాన్స్ చేసి... విమర్శలతో

ఆమెతో రొమాన్స్ చేసి... విమర్శలతో

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే స్నేహితులు కావడంతో సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ హౌస్‌లో కూడా ఆరంభం నుంచే సన్నిహితంగా ఉన్నారు. అంతేకాదు, ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశారు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయారు. అంతేకాదు, ఒకానొక సందర్భంలో ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం అని కూడా చెప్పుకున్నారు. దీంతో వీళ్లు ప్రేమించుకుంటున్నారని అంతా అనుకున్నారు. అలా వీళ్లపై షో మొత్తంలో ఘోరంగా విమర్శలు వచ్చాయి.

చివర్లో షణ్ముఖ్‌కు దెబ్బ.. రన్నరప్‌గా

చివర్లో షణ్ముఖ్‌కు దెబ్బ.. రన్నరప్‌గా

బిగ్ బాస్ హౌస్‌లో వ్యవహార శైలితో ఎలా ఉన్నా ఆట పరంగా ఆకట్టుకోవడంతో షణ్ముఖ్ జస్వంత్, టాప్‌ 5లో నిలిచి ఫినాలేలో అడుగు పెట్టాడు. దీంతో అతడు ఈ సీజన్‌లో గెలుస్తాడని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే ఓట్లు కూడా భారీ స్థాయిలో పోలయ్యాయి. కానీ, చివర్లో అతడు సిరి హన్మంత్‌తో వ్యవహరించిన తీరుతో కొంత వెనకబడ్డాడు. అదే సమయంలో అతడి కంటే సన్నీకి ఎక్కువ ఓట్లు రావడంతో ఐదో సీజన్‌లో విన్నర్‌గా నిలిచాడు. దీంతో షణ్ముఖ్ జస్వంత్ రన్నర్‌గా మిగిలాడు. ఇది అతడితో పాటు అభిమానులను కూడా నిరాశకు గురి చేసింది.

షణ్ముఖ్‌, దీప్తి సునైనా బ్రేకప్ రూమర్

షణ్ముఖ్‌, దీప్తి సునైనా బ్రేకప్ రూమర్

ఐదో సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఉన్న సమయంలో సిరి హన్మంత్‌తో రొమాన్స్ చేయడం వల్ల షణ్ముఖ్ జస్వంత్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. మరీ ముఖ్యంగా అతడు వ్యవహరించిన తీరుపై భారీ స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీంతో అతడిపై ప్రియురాలు దీప్తి సునైనా కూడా గుర్రుగా ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆమె షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ కూడా చెప్పేసిందన్న టాక్ వినిపిస్తోంది. అందుకు అనుగుణంగానే ఆమె ఆ మధ్య కొన్ని పోస్టులు చేసింది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఫలితంగా ఇది హాట్ టాపిక్ అయింది.

షన్నూ క్లారిటీ.. బ్లాక్ చేసిందని చెప్పి

షన్నూ క్లారిటీ.. బ్లాక్ చేసిందని చెప్పి


సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే షణ్ముఖ్ జస్వంత్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్ నిర్వహించాడు. ఇందులో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించాడు. ఇక ఈ సెషన్‌లో అతడి అభిమానులంతా దీప్తి సునైనా గురించి, బ్రేకప్‌పై వస్తున్న వార్తల గురించి షణ్ముఖ్‌ను ప్రశ్నించాడు. దీంతో దీనిపై అతడు క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం తనను దీప్తి సునైనా బ్లాక్ చేసిందని.. తన కోపం తగ్గే వరకూ డిస్టర్బ్ చేయనని చెప్పాడు. అంతేకాదు, తన చేతిపై ఉన్న పచ్చబొట్టు పోయే వరకూ దీప్తిని వదిలిపెట్టనని కూడా క్లారిటీ ఇచ్చాడు.

మరో బాంబ్ పేల్చేసిన దీప్తి సునైనా

మరో బాంబ్ పేల్చేసిన దీప్తి సునైనా

ఒకవైపు దీప్తి సునైనా కొద్ది రోజులుగా విడిపోతున్నట్లు అనుమానాలు రేకెత్తేలా పోస్టులు చేస్తోంది. మరోవైపు, అందరూ అనుకున్నట్లు విడిపోవడం లేదని షణ్ముఖ్ జస్వంత్ సోషల్ మీడియా ద్వారా చెబుతున్నాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియక అందరూ జుట్టు పీక్కుంటున్నారు. ఇక, వీళ్లిద్దరూ మళ్లీ కలవాలని, అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టాలని వాళ్ల అభిమానులు కోరుకుంటూ తెగ పోస్టులు కూడా పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీప్తి సునైనా మరోసారి షాకింగ్ పోస్ట్ చేసింది. దీంతో బ్రేకప్ రూమర్లకు మరింత అనుమానం కలుగుతోంది.

Recommended Video

2021 Year Ender : Tollywood Top OTT Movies Of 2021 | Filmibeat Telugu
విడిపోతున్నట్లు పరోక్షంగా చెప్పిందా

విడిపోతున్నట్లు పరోక్షంగా చెప్పిందా


సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దీప్తి సునైనా.. తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతాలో తన ఫొటోను షేర్ చేసింది. దీనికి 'మార్పు అనేది చాలా సంక్లిష్టమైనది. కానీ ఇప్పుడు తప్పడం లేదు' అనే క్యాప్షన్ పెట్టింది. దీంతో ఆమె షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ చెబుతున్నట్లు పరోక్షంగా వెల్లడించిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమె చేసిన ఈ పోస్టుకు ఎక్కువ శాతం దానికి సంబంధించిన కామెంట్లే వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే వీళ్లిద్దరి అభిమానులు షణ్ముఖ్‌కు దూరం కావొద్దంటూ సూచిస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X