Bigg Boss: ఈ వారం ఎలిమినేషన్‌ ఊహించని విధంగా.. షోలోకి మరొకరు ఎంట్రీ.. అందుకే వాళ్లందరికీ షాక్!

భారతదేశంలో ఉన్న చాలా భాషల్లో ప్రసారం అవుతూ... అన్ని చోట్లా భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అయితే, అన్నింటి కంటే ఎక్కువగా తెలుగులో ప్రసారం అవుతోన్న షోకు మాత్రమే ఆదరణ దక్కుతోంది. అందుకే మన దానికి మాత్రమే ఊహించని రీతిలో రేటింగ్ దక్కుతోంది. ఫలితంగా ఇది నేషనల్ లెవెల్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక, ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదోది కూడా ప్రారంభమై ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఈ వారం నామినేషన్స్‌లో ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులు మీకోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 అన్నీ కొత్తగానే... రేంజ్ పెంచేందుకు

అన్నీ కొత్తగానే... రేంజ్ పెంచేందుకు

బిగ్ బాస్ నాలుగు సీజన్లు విజయవంతం అవడంతో ఐదో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఇటీవలే నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అలాగే, ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచి భారీ రేటింగ్‌ను అందుకుందీ సీజన్. దీంతో ప్రారంభ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ వచ్చింది. ఇక, ఈ సీజన్‌లో అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపిస్తూ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరింత పెంచుతున్నారు.

 అన్నీ కొత్తగా.. ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్

అన్నీ కొత్తగా.. ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్

బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభమై మూడు వారాలే పూర్తయ్యాయి. ఇప్పుడు నాలుగో వారం జరుగుతోంది. అయినప్పటికీ అప్పుడే నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వినూత్నమైన టాస్కులను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అలాగే, నామినేషన్స్‌లో సైతం ఎక్కువ మంది ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఓటింగ్ ఎక్కువ అవడంతో పాటు కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే, ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో బిగ్ బాస్‌కు కొంత ఆదరణ తగ్గుతుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో మరిన్ని ప్రయోగాలతో నిర్వహకులు ముందుకొస్తున్నారు.

ముగ్గురు ఎలిమినేషన్.. ముగ్గురూ వాళ్లే

ముగ్గురు ఎలిమినేషన్.. ముగ్గురూ వాళ్లే

గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ప్రతి వారం నామినేషన్స్‌లో ఎక్కువ మంది ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మొదటి వారం ఏడుగురు సభ్యులు నామినేట్ అవగా.. అందులో నుంచి సరయు రాయ్ ఎలిమినేట్ అయింది. రెండో వారంలో ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉండగా సీనియర్ నటి ఉమాదేవి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇక, మూడో వారంలో ఐదుగురు మెంబర్లు నామినేషన్స్‌లోకి వెళ్లగా.. వాళ్ల నుంచి లహరి షారి ఎలిమినేట్ అయిపోయింది.

నాలుగో వారం నామినేషన్స్.. 8 మంది

నాలుగో వారం నామినేషన్స్.. 8 మంది

బిగ్ బాస్ షోలో ఎంతో ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే అన్న విషయం తెలిసిందే. ఇది జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఒక్కో సమయంలో కొట్టుకుంటారా అన్నట్లు కూడా ఇది సాగుతూ ఉంటుంది. ఈ వారం కూడా కొన్ని గొడవలతో షో అలాగే సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో లోబో, ఆర్జే కాజల్, వీజే సన్నీ, సిరి హన్మంత్, ఆనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, ప్రియ, యాంకర్ రవిలు ఉన్నారు. వీరిలో ఎవరు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.

 నాల్గో ఎలిమినేషన్‌ ఊహించని విధంగా

నాల్గో ఎలిమినేషన్‌ ఊహించని విధంగా

బిగ్ బాస్ షోలోనే అత్యంత విషాదకరమైన ప్రక్రియల్లో ఎలిమినేషన్ ఒకటి. ప్రతి వారం కొందరు నామినేట్ అవడం.. అందులో ప్రేక్షకుల మద్దతు దక్కని సభ్యులు ఎలిమినేట్ అవడం ఈ షోలో భాగంగా జరుగుతూ ఉంటుంది. అయితే, ఐదో సీజన్‌లో మాత్రం ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సారి ఏకంగా ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న దానిపై ఆసక్తికరమైన వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది.

 అందుకే వాళ్లందరికీ షాక్ ఇచ్చేశాడట

అందుకే వాళ్లందరికీ షాక్ ఇచ్చేశాడట

బిగ్ బాస్ షో అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఇప్పటి వరకూ జరిగిన అన్ని సీజన్లలోనూ ఊహించని పరిణామాలు చాలానే కనిపించాయి. ఇందులో భాగంగానే ఐదో సీజన్ నాలుగో వారంలో కూడా ఓ ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందట. అందుకే నాలుగో వారంలో ఏకంగా ఎనిమిది మంది సభ్యులను నామినేట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఈ మొత్తం సభ్యుల్లో ఇద్దరిని బయటకు పంపించబోతున్నారని అంటున్నారు. దీంతో ఆ ఇద్దరు ఎవరై ఉంటారా అని చర్చ జరుగుతోంది.

Recommended Video

Aishwarya Rajesh And Deva Katta Speaks About Republic Movie
 బిగ్ బాస్ షోలోకి మరొకరు వైల్డ్ ఎంట్రీ

బిగ్ బాస్ షోలోకి మరొకరు వైల్డ్ ఎంట్రీ

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఐదింతలు ఎక్కువగా ఉంటుందని నిర్వహకులు ముందుగానే చెప్పారు. అందుకు అనుగుణంగానే నాలుగో వారంలో ఇద్దరు సభ్యులను ఎలిమినేట్ చేయబోతున్నారట. అయితే, వాళ్లు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అదే.. ఐదో వారం ప్రారంభంలో ఓ సెలెబ్రిటీ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారట. అది ఎవరన్న దానిపై క్లారిటీ లేదు కానీ... షోలోకి వచ్చే వారి గురించి యాంకర్ వర్షిణి సౌందరాజన్, సీరియల్ యాక్టర్ నవ్య స్వామి పేర్లు మాత్రం బాగా వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X