Bigg Boss Telugu 5 elimination: ఈ వారం కూడా అదే రిపీట్.. ఎవరు అవుట్ అయ్యారంటే?
ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ ఆరవ వారాంతానికి చేరింది. ప్రతి శని, ఆదివారాల్లో నాగార్జున హౌస్ కి హాజరై సభ్యులందరినీ పలకరించి వారం మొత్తం మీద జరిగిన తప్పుల విషయంలో నిలదీస్తారు అనే సంగతి కూడా తెలిసిందే. ఇక అదే విధంగా నాగార్జున ఈ వారం కూడా హౌస్ సభ్యులందరినీ నిలదీశారు. అయితే ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

హౌస్ లో మళ్ళీ ప్రమోషన్స్
ఇక ఈ రోజు విడుదలైన మొదటి ప్రోమో ప్రకారం ప్రతి శనివారం లాగే ఈ శనివారం కూడా నాగార్జున ఎంతో ఉత్సాహంగా ఎంటరయ్యారు. ముందుగా ఒక మూవీ ప్రమోషన్ జరిగినట్టు చెబుతున్నారు. ఆ తరువాత ఆనీ మాస్టర్ తో మాట్లాడిన నాగార్జున సంచాలక్ తప్పు చేస్తే బిగ్ బాస్ వాళ్లను డిస్ క్వాలిఫై కూడా చేస్తారని చెప్పుకొచ్చారు. అలాగే ప్రతి దానికి నేను నా పిల్లల మీద ఒట్టేస్తాను అంటే కుదరదని వార్ణింగ్ ఇచ్చారు. నామినేషన్ల సమయంలో శ్రీరామ్ యాక్టర్లు అనే మాట అనడం మీద కూడా నాగార్జున తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అంటే యాక్టర్లు అంటే అంత చిన్న చూపా అని ప్రశ్నించారు నాగార్జున.

నాగార్జున క్లాస్
ఇక లోబోతో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ ప్రాపర్టీ కి నష్టం కలిగించకూడదు అనే విషయం నీకు తెలియదా అని ప్రశ్నించి రవి మతాల మేరకు చేశాను అంటే రవి గడ్డి తినమంటాడు, తినడానికి రెడీ అవుతావా అంటూ ఫైర్ అయ్యారు. ఇక ఈ విషయం మీద రవి కూడా శ్వేత చేతులో ఇరుక్కుంది. నాగార్జున కోపంతో నటరాజ్ మాస్టర్ వెళుతూ అన్న అనే పదం నిజమేనేమో అనే అనుమానం వస్తుందని అన్నారు.

సీక్రెట్ రూమ్ లో?
ఇక ఆ తర్వాత విడుదలైన ప్రోమో ప్రకారం హౌస్ లో ఉండేందుకు ఎవరికి అర్హత లేదు అని సీక్రెట్ రూమ్ కి పిలిచి ప్రశ్నించగా నలుగురు లోబో పేరు, నలుగురు ప్రియ పేరు చెప్పారు.. అయితే హౌస్ లో నుంచి ఎవరో ఒకరు బయటికి వెళ్లి పోవాలి హౌస్ గేట్స్ కూడా తెరుస్తున్నామని అంటూ నాగార్జున చెప్పడంతో చివరికి హౌస్ సభ్యులందరూ కలిసి లోబోను బయటకు పంపారని అంటున్నారు. అయితే ఆయనను సీక్రెట్ రూమ్ కి పంపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దాని మీద అయితే క్లారిటీ రాలేదు.

పది మంది నామినేషన్
ఇక ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయం శనివారానికి క్లారిటీ వచ్చేస్తుంది అన్న సంగతి తెలిసిందే. ఈ వారం కూడా దాదాపు 10 మంది సభ్యులు నామినేషన్ కి వెళ్లగా వారిలో విశ్వ, మానస్, శ్వేత వర్మ, యాంకర్ రవి, సిరి హన్మంత్, వీజే సన్నీ, శ్రీ రామచంద్ర, లోబో, జెస్సీ మరియు ప్రియాంక సింగ్ నామినేషన్ల జాబితాలో ఉన్నారు.

సెట్ శ్వేత బై
ఇక వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు శ్వేతా వర్మ ఈ వారం హౌస్ లో నుండి బయటకు వచ్చేస్తుంది.. ఓటింగ్లో శ్వేత వర్మకు దారుణమైన ఓట్లు పోల్ అవడంతో ఆమె బయటకు వచ్చేయక తప్పదని అంటున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











