7th week Elimination: ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. ఊహించని క్రాస్ ఓటింగ్‌తో ఆ కంటెస్టెంట్‌కు ముప్పు

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడోవారం రచ్చ రచ్చగా మారుతున్నది. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన కంటెస్టెంట్ల ఓటింగ్ విషయంలో అనేక ట్విస్టులు చోటు చేసుకొంటున్నాయి. ప్రతీ రోజు కంటెస్టెంట్ల ఓటింగ్ ఫలితాలు తారుమారు అవుతున్నట్టు సమాచారం. అయితే ఈ వారం కొందరు టాప్ ఓటింగ్ సాధించే కంటెస్టెంట్లు నామినేషన్‌లో లేకపోవడం వల్ల భారీగా క్రాస్ ఓటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రం వరకు ఓటింగ్ పరిస్థితి ఎలా ఉందంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 వీజే సన్నీతో ప్రియ గొడవ

వీజే సన్నీతో ప్రియ గొడవ

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటి షోకు సంబంధించి ఆరో వారాల పాటు చాలా బోర్‌గా ఎపిసోడ్స్ సాగాయి. ఏడో వారంలో కంటెస్టెంట్ల మధ్య భారీగా విభేదాలు రావడం, ఒకరినొకరు దూషించుకోవడంతో ఓటింగ్ తీరు కూడా మారిపోయింది. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా వీజే సన్నీ, ప్రియ మధ్య జరిగిన గొడవ కారణంగా క్రాస్ ఓటింగ్ భారీగా నమోదైనట్టు సమాచారం.

కాజల్, లోబోకు సానుకూలంగా

కాజల్, లోబోకు సానుకూలంగా

వీజే సన్నీ, మానస్ ముందు నుంచి ఒక జట్టుగా మంచి అవగాహనతో ఆడుతున్నారు. తాజాగా వారిద్దరితో కాజల్ చేరడంతో ఇంటిలో కొత్త గ్రూప్‌ ఏర్పడింది. అలాగే సన్నీకి లోబో కూడా క్లోజ్ కావడంతో ఓటింగ్ వారికి సానుకూలంగా మారింది. వీజే సన్నీ, మానస్ నామినేషన్‌లో లేకపోవడం వల్ల వారి ఓట్లు కాజల్, లోబోకు పడుతున్నట్టు సమాచారం.

షుణ్ముఖ్ ఓట్లు ఎవరికంటే..

షుణ్ముఖ్ ఓట్లు ఎవరికంటే..

గత ఆరువారాల ఓటింగ్ సరళిని బేరిజు వేస్తే షణ్ముఖ్ జస్వంత్ అత్యధికంగా ఓట్లు సాధిస్తున్న వారిలో టాప్‌ స్థానంలో నిలిచారు. అయితే గురువారం ఎపిసోడ్‌లో జెస్సీ సీక్రెట్ టాస్క్ దారుణంగా ఫ్లాప్ కావడం, సిరి హన్మంతుపై షణ్ముఖ్ కోపగించుకోవడంతో షణ్ముఖ్ ఓట్లు ఎవరికి పడుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కాజల్‌ సేఫ్ అవుతుందా?

కాజల్‌ సేఫ్ అవుతుందా?

ఇక మిగితా కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. యాంకర్ రవి, ఆర్జే కాజల్ వారి సొంతం బలంపైనే నెగ్గుకొస్తున్నారు. ఇప్పుడు కాజల్‌కు వీజే సన్నీ, మానస్ కూడా తోడు కావడంతో ఆమె ఓటింగ్‌కు ఢోకా లేకుండా ఉంది. దాంతో ప్రియతో గొడవ కారణంగా ప్రియకు తప్పించి.. మిగితా కంటెస్టెంట్లకు భారీగా ఓట్లు వేసేందుకు వీజే సన్నీ, మానస్ ఫ్యాన్స్ ట్రై చేస్తున్నట్టు సమాచారం.

Recommended Video

Santosh Sobhan Vs Director Maruthi Truth Or Dare | Manchi Rojulochaie
ప్రియ లేదా అని మాస్టర్‌కు ముప్పు

ప్రియ లేదా అని మాస్టర్‌కు ముప్పు

తాజా సమాచారం ప్రకారం.. ప్రియ, అని మాస్టర్ ఓటింగ్‌లో చివరి స్థానాల్లో కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. రోజు రోజుకు మారుతున్న లెక్కలు, ఈక్వేషన్స్ కారణంగా ఈ వారం ఎలిమినేషన్ విషయంలో కాస్త గట్టి పోటీ కనిపిస్తున్నది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఓటింగ్‌లో మార్పు లేకుంటే.. ప్రియ గానీ, లేదా అని మాస్టర్‌లో ఎవరో ఒకరికి ముప్పు పొంచి ఉండే అవకాశం కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X