For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: టాస్కులో లోబో, శ్వేత ఊహించని పనులు.. ఎవరూ లేనప్పుడు బెడ్ దగ్గరకు వెళ్లి మరీ అలా!

  |

  తెలుగు బుల్లితెరపై ఊహకే అందని విధంగా ప్రేక్షకాదరణను అందుకుని సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కంటెంట్‌తో నడిచేదే అయినా.. మన ప్రేక్షకులకు ఇది చాలా త్వరగానే చేరువైంది. అందుకే విజయవంతంగా నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదోది కూడా ప్రారంభం అవగా.. దీనికి కూడా మంచి స్పందనే దక్కుతోంది. అన్నింట్లోనూ కొత్తదనం చూపించేలా నిర్వహకులు ప్లాన్ చేస్తుండగా.. అందుకు అనుగుణంగానే ఆదరణ కూడా భారీగానే వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్కులో ఊహించని విధంగా లోబో, శ్వేత నీచమైన పనులు చేయడం చర్చనీయాంశం అవుతోంది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   అన్నీ కొత్తగానే అందుకే భారీ రేటింగ్

  అన్నీ కొత్తగానే అందుకే భారీ రేటింగ్

  మిగిలిన భాషల కంటే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్‌కు మాత్రమే భారీ రేటింగ్ వస్తుంది. దీంతో ఐదో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని నిర్వహకులు చెప్పారు. ఇందులో భాగంగానే 19 మంది కంటెస్టెంట్లను దింపడంతో పాటు ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచారు. దీంతో ప్రారంభ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత కూడా ప్రతి వారం సగటున మంచి రేటింగ్‌ను అందుకుంటోంది. దీంతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

  హాట్ షో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్: గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  రసవత్తరంగా ఆట.. గొడవల తర్వాత

  రసవత్తరంగా ఆట.. గొడవల తర్వాత

  బిగ్ బాస్ ఐదో సీజన్ రోజు రోజుకూ ఆసక్తికరంగానే సాగుతోంది. ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం ఎంతో రసవత్తరంగా సాగింది. ఇందులో పలువురు కంటెస్టెంట్ల మధ్య భీకరమైన మాటల యుద్ధం జరిగింది. దీంతో ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఎంతో రచ్చ రచ్చగా సాగింది. సోమవారం గొడవల తర్వాత కంటెస్టెంట్ల మధ్య దానికి సంబంధించిన చర్చలు కూడా గట్టిగానే జరిగాయి. ఈ క్రమంలోనే పలువురు కంటెస్టెంట్లు తమను నామినేట్ చేసిన వాళ్లపై కారాలు మిరియాలు నూరుతూ కనిపించారు. దీంతో మంగళవారం కూడా అదే వేడి కనిపించింది.

  బిగ్ బాస్ బొమ్మల ఫ్యాక్టరీ అనే టాస్క్

  బిగ్ బాస్ బొమ్మల ఫ్యాక్టరీ అనే టాస్క్

  ప్రతి వారం కెప్టెన్సీ కోసం పోటీ పడే వాళ్లను ఎంపిక చేసుకునేందుకు గానూ బిగ్ బాస్ ఓ టాస్క్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ వారం ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో బ్లూ టీమ్‌లో సభ్యులుగా మానస్‌, సన్నీ, యానీ మాస్టర్‌.. ఎల్లో టీమ్‌ సభ్యులుగా షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ.. రెడ్‌ టీమ్‌ సభ్యులుగా విశ్వ, శ్రీరామ్‌, ప్రియ.. గ్రీన్‌ టీమ్‌ సభ్యులుగా రవి, లోబో, శ్వేతలను విభజించారు. ఇక, రెడ్ అండ్ గ్రీన్ టీంకు మేనేజర్ కమ్ సంచాలకురాలిగా సిరిని.. బ్లూ, ఎల్లో టీంకు కాజల్‌ను మేనేజర్ కమ్ సంచాలకురాలిగా నియమించారు.

  స్విమ్‌సూట్‌లో కనిపించి షాకిచ్చిన ఈషా రెబ్బా: తడిచిన బట్టల్లో అందాలన్నీ చూపించిన తెలుగమ్మాయి

   అక్కడ కూడా అదే తీరు.. అసహనం

  అక్కడ కూడా అదే తీరు.. అసహనం

  ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కులో భాగంగా గార్డెన్‌ ఏరియాలో ఉన్న కన్వేయర్‌ బెల్ట్‌పై నుంచి బొమ్మలకు సంబంధించి రా మెటీరియల్‌ వస్తుంది. వాటిని తీసుకొని బొమ్మలను తయారు చేయాల్సి ఉంటుంది. గెలిచిన టీంకి మేనేజర్‌గా ఉన్నవాళ్లకి కూడా కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. బొమ్మల నాణ్యతని తనిఖీ చేసి ఎటువంటి లోపాలు లేకుండా చూసే బాధ్యత ఇద్దరు మేనేజర్లకు ఉంటుంది. ఇక, ఇందులో భాగంగా కన్వేయర్ బెల్ట్‌పై మెటీరియల్ వస్తున్న సమయంలో కొందరు ముందే వాటిని లాక్కోవడంతో పలువురు ఇంటి సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.

  గొడవలు.. రవి గ్రీన్ టీమ్‌ ముందంజ

  గొడవలు.. రవి గ్రీన్ టీమ్‌ ముందంజ

  మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కు పోటాపోటీగా జరిగింది. ప్రతి టీమ్ సభ్యులూ తమ దగ్గర ఉన్న మెటీరియల్‌తో బొమ్మలను చక్కగా తీర్చిదిద్దారు. అయితే, అందులో కొన్ని బొమ్మలు సరిగా లేవని సంచాలకులు కమ్ మేనేజర్లు సిరి, కాజల్ కొన్నింటిని రిజెక్ట్ చేశారు. దీంతో పలు టీమ్‌లు వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే కొన్ని గొడవలు కూడా జరిగాయి. అయితే, ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కులో అందరి కంటే రవి, శ్వేత, లోబోలు ఉన్న గ్రీన్ టీమ్ మాత్రమే ఎక్కువ బొమ్మలు చేసినట్లు కనిపించింది.

  బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్‌లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!

  టాస్కు కోసం లోబో నీచమైన పనులు

  టాస్కు కోసం లోబో నీచమైన పనులు

  ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కులో భాగంగా ప్రతి ఒక్కరూ ఎలాగైనా గెలవాలన్న కసితో ఆడుతున్నారు. అయితే, గ్రీన్ టీమ్ సభ్యుడైన లోబో మాత్రం ఇందులో విజయం సాధించేందుకు ఒక రకంగా తన తెలివికి పని చెప్పి నీచమైన పనే చేశాడు. కన్వేయర్ బెల్ట్‌పై మెటీరియల్‌ను అందుకోలేకపోయిన అతడు.. ఆ వెంటనే లోపల ఉన్న బెడ్‌ల దగ్గరకు వెళ్లి పిల్లోలను కట్ చేశాడు. అంతేకాదు, అందులో ఉన్న కాటన్‌ను దొంగతనంగా తీసుకొచ్చి తమ బొమ్మల తయారికీ ఉపయోగించాడు. ఇదంతా కెమెరాలలో రికార్డ్ అవడంతో అందరూ షాక్ అయిపోతున్నారు.

  Most Eligible Bachelor Trailer | Akhil Akkineni | Pooja Hegde
  శ్వేత వర్మ నుంచి ఊహించని విధంగా

  శ్వేత వర్మ నుంచి ఊహించని విధంగా

  ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కులో భాగంగా గ్రీన్ టీమ్‌లో ఉన్న శ్వేత వర్మ కూడా లోబోను ఫాలో అయిపోయింది. ఎప్పుడూ ఫెయిర్ గేమ్ ఆడుతూ అందరికీ ఆదర్శంగా నిలిచే ఆమె.. ఈ సారి మాత్రం కన్నింగ్ ప్లాన్లు వేసింది. ఇందులో భాగంగానే తమ టీమ్‌ తయారు చేసిన కొన్ని బొమ్మలను బెడ్ల కొంద దాచేచి వచ్చింది. దీనికి కారణం ఆ బొమ్మలను ఎదుటి టీమ్ వాళ్లు ధ్వంసం చేయొచ్చు అని అనుకోవడమే. దీంతో శ్వేత వర్మ తెలివిగా ఆలోచించి కన్నింగ్ పని చేసింది. దీంతో ఆమెను సోషల్ మీడియాలో నీచంగా ఆడుతున్నావ్ అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

  English summary
  Telugu Top Reality TV Series Bigg Boss Recently Started 5th Season. In Recent Episode.. Lobo and Swetha Varma Cunning Play in Task
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X