For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: యాంకర్ రవికి బిగ్ బాస్ సీక్రెట్ ఆఫర్.. సంచలన విషయం లీక్.. అదే జరుగుతుందంటూ అనుమానం

  |

  ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతూ.. అన్ని చోట్లా అద్భుతమైన స్పందనతో నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. మరీ ముఖ్యంగా తెలుగులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే పరిచయం అయినా.. ఇక్కడి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు నాలుగు సీజన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇది కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ సాగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో బొమ్మల టాస్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా యాంకర్ రవికి బిగ్ బాస్ సీక్రెట్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఓ కంటెస్టెంట్ సంచలన విషయాన్ని లీక్ చేసి అందరిలోనూ అనుమానాలు పెంచేశాడు. ఆ వివరాలు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   అన్నింటికీ మించేలా ప్లాన్ చేసి సక్సెస్

  అన్నింటికీ మించేలా ప్లాన్ చేసి సక్సెస్

  తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్‌కు అన్నింటి కంటే భారీ రేటింగ్ వస్తుంది. దీంతో ఐదో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని నిర్వహకులు చెప్పారు. ఇందులో భాగంగానే 19 మంది కంటెస్టెంట్లను దింపడంతో పాటు ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచారు. దీంతో ప్రారంభ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత కూడా ప్రతి వారం సగటున మంచి రేటింగ్‌ను అందుకుంటోంది. దీంతో విజయవంతంగా ప్రసారం అవుతోంది.

  Monal Gajjar ఇన్‌స్టా నుంచి పిచ్చి పిచ్చి ఫొటోలు: అనుమానాలు మొదలు.. షాకింగ్ న్యూస్ చెప్పిన అఖిల్

  బొమ్మలు తయారు చేసే టాస్క్‌లో బిజీ

  బొమ్మలు తయారు చేసే టాస్క్‌లో బిజీ

  ఆరో వారానికి సంబంధించి కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసుకునేందుకు గానూ కంటెస్టెంట్లు అందరికీ బిగ్ బాస్ ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో బ్లూ టీమ్‌లో సభ్యులుగా మానస్‌, సన్నీ, యానీ మాస్టర్‌.. ఎల్లో టీమ్‌ సభ్యులుగా షణ్ముఖ్ జస్వంత్, ప్రియాంక, జస్వంత్ పడాల.. రెడ్‌ టీమ్‌ సభ్యులుగా విశ్వ, శ్రీరామ చంద్ర, ప్రియ.. గ్రీన్‌ టీమ్‌ సభ్యులుగా రవి, లోబో, శ్వేతలను విభజించారు. ఇక, రెడ్ అండ్ గ్రీన్ టీంకు మేనేజర్ కమ్ సంచాలకురాలిగా సిరి హన్మంత్.. బ్లూ, ఎల్లో టీంకు ఆర్జే కాజల్‌ను మేనేజర్ కమ్ సంచాలకురాలిగా నియమించారు.

  రవి గ్రీన్ టీమ్‌ ముందంజ... కన్నింగ్‌గా

  రవి గ్రీన్ టీమ్‌ ముందంజ... కన్నింగ్‌గా

  ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కు ఆరంభం నుంచే పోటాపోటీగా జరుగుతోంది. ప్రతి టీమ్ సభ్యులూ తమ దగ్గర ఉన్న మెటీరియల్‌తో బొమ్మలను చక్కగా తీర్చిదిద్దారు. అయితే, అందులో కొన్ని బొమ్మలు సరిగా లేవని సంచాలకులు కమ్ మేనేజర్లు సిరి, కాజల్ కొన్నింటిని రిజెక్ట్ చేశారు. దీంతో పలు టీమ్‌లు వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో కొన్ని గొడవలు కూడా జరిగాయి. అయితే, ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కులో కన్నింగ్ ప్లాన్‌తో పిల్లోలోని కాటన్ తీసుకొచ్చి అందరి కంటే రవి, శ్వేత, లోబోలు ఉన్న గ్రీన్ టీమ్ మాత్రమే ఎక్కువ బొమ్మలు చేసినట్లు కనిపించింది.

  బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

  రవికి బిగ్ బాస్ ఆఫర్.. సీక్రెట్‌గా లెటర్

  రవికి బిగ్ బాస్ ఆఫర్.. సీక్రెట్‌గా లెటర్

  కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్క్ బుధవారం కూడా కొనసాగింది. మెటీరియల్‌ను కన్వేయర్ బెల్ట్ మీద నుంచి తీసుకునేందుకు ఇంటి సభ్యులు తీవ్ర స్థాయిలో పోటీ పడ్డారు. అప్పుడు చాలా గొడవలు కూడా జరిగాయి. అయినప్పటికీ చాలా టీమ్‌లు వీలైనన్ని ఎక్కువ వస్తువులను దక్కించుకుని బొమ్మలను తయారు చేశాయి. అయితే సంచాలకులు మాత్రం తమకు నచ్చిన వాటినే ఎంపిక చేసుకున్నారు. ఈ టాస్కులో యాంకర్ రవికి బిగ్ బాస్ సీక్రెట్ ఆఫర్ ఇచ్చాడు. అయితే, దీన్ని మాత్రం నిర్వహకులు ప్రసారం చేయకపోవడం విశేషం.

  అది చూపించకున్నా.. అధికారం ఇచ్చి

  అది చూపించకున్నా.. అధికారం ఇచ్చి

  కన్వేయర్ బెల్ట్‌ నుంచి బొమ్మలు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ పంపించిన బిగ్ బాస్.. అందులో ఓ వస్తువులో లెటర్‌ను కూడా పంపించాడట. అది రవి టీమ్ సభ్యులకు దొరికింది. ఈ విషయాన్ని బిగ్ బాస్ అనౌన్స్ చేయగా.. యాంకర్ రవి ఆ తర్వాత ఇంటి సభ్యులకు వివరించాడు. అంతేకాదు, ఆ పవర్ దక్కడం వల్ల ఏదైనా ఒక టీమ్‌కు సంబంధించిన బొమ్మలను స్వాధీనం చేసుకోవచ్చని బిగ్ బాస్ సూచించాడు. దీంతో రవి టీమ్.. ఎక్కువ బొమ్మలు తయారు చేసిన మానస్, వీజే సన్నీ, ఆనీ మాస్టర్‌ల బ్లూ టీమ్‌‌కు చెందిన బొమ్మలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  అనుమానం వ్యక్తం చేస్తూ.. ఆ విషయం

  అనుమానం వ్యక్తం చేస్తూ.. ఆ విషయం

  యాంకర్ రవి టీమ్‌కు బిగ్ బాస్ సీక్రెట్ ఆఫర్ ఇవ్వడంపై మానస్ అసహనం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో తన టీమ్ సభ్యులైన సన్నీ, ఆనీ మాస్టర్‌తో మాట్లాడుతూ.. ‘యాంకర్ రవి ఆన్సర్ షీట్ ముందే ప్రిపేరై వచ్చాడు. ఆ బొమ్మలో స్లిప్ ఉందని ఎలా తెలుసు? అందుకే వాళ్లు మొదటి నుంచి చాలా కూల్‌గా ఉన్నారు. వాళ్లు పత్తి తీసుకుందాం బొమ్మలు కుట్టి గెలుద్దాం అని ఆడలేదు. ఆ పవర్ ఉన్న బొమ్మ వస్తుంది. దాన్ని తీసుకుని ఎవరు ఎక్కువ బొమ్మలు చేస్తే వాళ్ల దగ్గర నుంచి గుంజుకుందాం అనే ఆట ఆడారని టాస్క్ ఆడారు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  Actress Sree Leela Exclusive Interview Part 2 | Pelli SandaD
  క్రిమినల్ మైండ్.. అనుమానాలు స్టార్ట్

  క్రిమినల్ మైండ్.. అనుమానాలు స్టార్ట్

  మానస్ అలాంటి కామెంట్లు చేయగానే సన్నీ కూడా అదే రీతిలో స్పందించాడు. ‘అందరూ బొమ్మల్ని కష్టపడి కుడుతుంటే వాళ్లు మాత్రం చాలా రిలాక్స్‌గా ఉన్నారు. ఇంత క్రిమినల్ మైండ్ నేనెక్కడా చూడలేదు' అని చెప్పుకొచ్చాడు. వీళ్లిద్దరి మాటలు చూస్తుంటే గతంలో ఉమాదేవి ‘యాంకర్ రవికి అన్నీ ముందుగానే తెలిసిపోతున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారు? ప్రోమో ఎలా కట్ చేస్తారు? ఏ టాస్కులు ఇవ్వబోతున్నారు? అనేవి ముందే చెప్పేస్తున్నాడు' అని చేసిన కామెంట్లు బలం చేకూర్చుతున్నట్లు కనిపించింది. దీంతో అనుమానాలు మొదలయ్యాయి.

  English summary
  Telugu Top Reality TV Series Bigg Boss Recently Started 5th Season. In Recent Episode.. Maanas Shocking Comments on Anchor Ravi Game Plan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X