Bigg Boss 5 Telugu: సన్నీ ఫస్ట్ టైం ఏడ్చాడు.. తట్టుకోలేకపోయానన్న మానస్.. ఆ రిగ్రెట్ ఏంటి షన్ను అంటూ నాగార్జున
బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరింది. హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శ్రీరామ్ ఇప్పటికే ఫైనల్స్ కు చేరుకున్నారు. ఇక మిగిలిన ఐదుగురిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. ఇక ఎప్పటిలాగే నాగార్జున శనివారం ఎంట్రీ ఇవ్వడంతో అంతా సందడిగా సాగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

శ్రీరామ్ ఇప్పటికే ఫైనల్స్ కు
హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శ్రీరామ్ ఇప్పటికే ఫైనల్స్ కు చేరుకోగా మిగిలిన సన్నీ, షణ్ముఖ్, మానస్, సిరి, కాజల్ లలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. ఆ మిగిలిన హౌస్ మేట్స్ అంటే ఐదుగురు, టాప్ 5కి చేరుకుంటారు. అయితే టాప్ 5లో ఉన్నవారిలో చివరి వారం గెలుపు కోసం వోటింగ్ పెడతారు. గెలిచిన వారిని అధికారికంగా ప్రకటిస్తారు.

'వీల్ ఆఫ్ ది వీక్స్'
అయితే ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్న సన్నీ, షణ్ముఖ్, మానస్, సిరి, కాజల్ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ఈ ప్రోమోలో నాగార్జున ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో 'వీల్ ఆఫ్ ది వీక్స్' అనే టాస్క్ ఆడించాడు.

'నీకు గుర్తులేదా కాజల్..?
ఈ 'వీల్ ఆఫ్ ది వీక్స్' టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ కి తమ జర్నీలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే ఎవరేం చేస్తారు..? ఏం చేయకుండా ఉంటారు..? ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ముందుగా కాజల్.. తనకు ఏ వీకో గుర్తులేదు అంటూ సంఘటన గురించి చెప్పబోతూ ఉండగా నాగార్జున కల్పించుకుని 'నీకు గుర్తులేదా కాజల్..? అది ఎలా పాజిబుల్' అంటూ కౌంటర్ వేశారు.

బాధను పంచుకున్నారు
ఇక ఆ తర్వాత సిరి 'లెవెన్త్ వీక్ సార్' అని చెప్పడంతోనే 'ఏం చేశాడు షన్ను..?' అని అడగడంతో షణ్ముఖ్ తలబాదుకోగా తరువాత సిరి, షణ్ముఖ్‌లు ఆ వారంలో జరిగిన దానిపై బాధపడ్డారు. అలా కంటెస్టెంట్ లు ఒక్కొక్కరూ కన్ఫెషన్ రూమ్ కి వెళ్లి తమ నాగార్జునతో మాట్లాడుతూ తమ బాధను పంచుకున్నారు. చాలా బాధపడ్డానని, తట్టుకోలేకపోయాను అంటూ సన్నీ.. ఫస్ట్ టైం సన్నీ ఏడవడం చూసి, నేను కూడా ఎమోషనల్ అయిపోయానని మానస్ చెప్పారు.

హిట్ స్టార్ ఎవరు..? ఫ్లాప్ స్టార్ ఎవరు..?
ఇక ఆ తరువాత హౌస్ మేట్స్ ని హిట్ స్టార్ ఎవరు..? ఫ్లాప్ స్టార్ ఎవరు..? అని ప్రశ్నించారు నాగ్. ముందుగా కాజల్.. షణ్ముఖ్ కి ఫ్లాప్ స్టార్ బ్యాడ్జ్ పెట్టింది. ఆ తరువాత శ్రీరామ్ కాజల్ కి ఫ్లాప్ స్టార్ బ్యాడ్జ్ పెట్టాడు, వెంటనే సిరికి ఫ్లాప్ స్టార్ ఇచ్చిన సన్నీ.. హౌస్ లో ఆమె ఒక్కదానితోనే పంచాయతీ ఉందని అన్నాడు. సిరి కూడా సన్నీకి ఫ్లాప్ స్టార్ బ్యాడ్జ్ ఇస్తూ ఎక్కువ నెగెటివిటీ క్యారీ చేయడం ఫస్ట్ నుంచి సన్నీలో నచ్చలేదని చెప్పింది.

నెక్స్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 5
ఇక ఫైనల్ గా ప్రోమోలో శ్రీరామ్ 'నెక్స్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 5' అని చెప్తూ సస్పెన్స్ లో పెట్టేశాడు. అయితే బిగ్ బాస్ లీక్స్ ప్రకారం వీజె సన్నీ హౌస్ లో రెండో ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 5 గా నిలిచాడని అంటున్నారు. అది ఈరోజు ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











