Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Bigg Boss 5 Telugu: హగ్స్ విషయంలో సిరి పరువుతీసిన నాగార్జున.. కాజల్ ను కూడా వదలకుండా పాతవి గుర్తు చేస్తూ!
ఎప్పటి లాగే శనివారం రానే వచ్చింది, బిగ్ బాస్ తెలుగులో ప్రతివారం లాగే ఎపిసోడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టారు. ముందుగా వారి ముందు కంప్లైంట్ బాక్స్ ను పెట్టారు. ఎవరికీ ఎవరి మీద కంప్లయింట్లు ఉన్నాయి అనే విషయం చెప్పాలని కోరారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఎవరి మీద ఎవరికి
బిగ్‌బాస్ సీజన్-5లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్‌లతో ఈ వారమంతా ఆసక్తికరంగా సాగింది. ప్రతి శనివారం లాగే ఈ శనివారం కూడా నాగార్జున వచ్చి హౌస్‌మేట్స్‌తో మాట్లాడారు. వస్తూనే కంప్లెయింట్ బాక్స్ తీసుకు రావడంతో పాటు హౌస్‌లో ఎవరి మీద ఎవరికి ఫిర్యాదులు ఉన్నాయి అని అడిగి వాటిని అందులో వేయమన్నారు.

నేనేం చేశాను
సిరిని ఎవరి మీద కంప్లైంట్ చేస్తావ్ అని నాగార్జున అడగ్గా.. షణ్ముఖ్ వైపు చూపించింది. వెంటనే షణ్ముఖ్ 'అసలు నేనేం చేశాను సార్' అంటూ పైకి లేవగా.. 'ఏం చేయడమేంటి..? సిరి కోసం సరిగ్గా ఆడకుండా, శ్రీరామ్ కోసం ఆడి' అని నాగ్ అనడంతో హౌస్ మేట్స్ అంతా నవ్వేశారు. ఆ తర్వాత నాగార్జున సిరితో మాట్లాడుతూ.. 'నువ్వు ఫ్రెండ్ అయినందుకు సిగ్గుపడుతున్నా.. అని అన్నాడు కదా..' అంటూ షణ్ముఖ్ కి సెటైర్ వేశారు. '

అరుస్తున్నాడని కాజల్
అయితే అయినా నువ్వు ఫ్రెండ్లీ హగ్ ఇస్తూనే ఉన్నావు' అంటూ సిరి పరువు తీశారు నాగార్జున. ఆ తర్వాత కాజల్ వంతు రాగా ఆమె సన్నీమీద కంప్లైంట్ చేసింది. 'ఏం మాట్లాడినా.. ఏం చెప్పినా.. ఆత్రం, ఆత్రం.. ఆగు ఆగు అంటూ' తనపై అరుస్తున్నాడని కాజల్ చెప్పింది. దీంతో సన్నీ.. పోన్లే హర్ట్ అయింది కదా అని సారీ చెప్పడానికి రెడీ అయ్యాడు. సారీ సర్ అంటే సారీ సార్ కాదు కాజల్ కు చెప్పమన్నారు.

సేఫ్ అయితే ట్రోఫీ
ఇక 'సారీ చెప్పేసి.. టిష్యూ పేపర్ నీ ఫేస్ పై వేసిన విషయాన్ని కూడా మర్చిపో.. బాగా తుడిచి మరీ వేసింది' అంటూ నాగార్జున పథ విషయాలు గుర్తు చేశారు. దీంతో కాజల్ 'Awww' అని అనగా.. నాగార్జున వెంటనే ఆమెను 'Awww' ఇమిటేట్ చేయడం ఆసక్తికరంగా అనిపించింది. నిన్నటి టాస్క్ లో సిరి హెలికాప్టర్ సౌండ్ విని ట్రాక్టర్ అని రాయడం మీద నాగార్జున కామెడీ చేసారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ ముందు ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ పెట్టి.. 'నువ్వు సేఫ్ అయితే ట్రోఫీ నీకు దక్కుతుంది లేదంటే లేదు' అంటూ శ్రీరామ్ ని ఉద్దేశిస్తూ నాగార్జున కామెంట్స్ చేశారు.

పింకీ ఎలిమినేట్
ఇక ఈ వారం హౌస్ నుంచి పింకీ ఎలిమినేట్ అయినట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయం సోషల్ మీడియాలో ఈ విషయం మీద పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి ఎలిమినేషన్ విషయంలో ప్రచారం అవుతున్న కంటెస్టెంట్స్ హౌస్ ని వీడుతున్నారు. కాబట్టి ప్రియాంక ఎగ్జిట్ ఖాయం అంటున్నారు. చూడాలి ఇందులో ఎంత మేరకు నిజం ఉందనేది.