ఆ స్ట్రాటజీ ఫాలో అవుతున్న తెలుగు బిగ్ బాస్.. ఆ టాప్ కంటెస్టెంట్ కు నో ట్రోఫీ..ఇలాగే ఊరించి అప్పుడు కూడా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకి కౌంట్ డౌన్ మొదలైంది. హౌస్‌లో ఇప్పుడు ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. ఇంకా చివరి ఎపిసోడ్‌కి పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కంటెస్టెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో కన్నడ బిగ్ బాస్ స్ట్రాటెజీని కనుక మన బిగ్ బాస్ మేకర్స్ ఫాలో అయితే ఆ కంటెస్టెంట్ కు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

జంట కాన్సెప్ట్, లవ్ ట్రాక్‌లు

జంట కాన్సెప్ట్, లవ్ ట్రాక్‌లు

మనందరికీ తెలిసినట్లుగా, జంట కాన్సెప్ట్, లవ్ ట్రాక్‌లు బిగ్ బాస్ షోలో బాగా పని చేస్తాయి. ఇక ఈ కాన్సెప్ట్లు పోటీదారులను హౌస్‌లో ఎక్కువ కాలం కాలం వెళ్లదీయడానికి సహాయ పడటమే కాకుండా షో కోసం భారీ TRPలను కూడా తీసుకొస్తుంది. వినోదం, టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇలాంటి కంటెస్టెంట్స్ ని కూడా ఆ ఛానెల్ సేవ్ చేస్తుందని చెప్పాలి.

హమీదను ఎలిమినేట్

హమీదను ఎలిమినేట్

ఈ బిగ్ బాస్ షో వచ్చిన అన్ని భాషలలో, కొంత మంది టైటిల్ గెలవడానికి లేదా చివరి రౌండ్‌కు చేరుకోవడానికి జంట వ్యూహాన్ని ఉపయోగిస్తారు. బిగ్ బాస్ తెలుగు 5 షో ప్రారంభమైనప్పుడు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 యొక్క జోడీగా హమీద మరియు శ్రీరామ్ ఉంటారని అందరూ ఊహించారు, కానీ మేకర్స్ హమీదను ఎలిమినేట్ చేయడంతో, ప్రేక్షకులు షాక్ అయ్యారు.

 సొంత ప్లాన్

సొంత ప్లాన్

అయితే, మేకర్స్ ముందే వారి సొంత ప్లాన్ ను కలిగి ఉన్నారు. అందుకే ప్రేక్షకులు ఊహించినట్టు కాక వారి వ్యూహాన్ని మార్చారు. బిగ్ బాస్ తెలుగు 5 మేకర్స్ సిరి మరియు షన్నులకు చాలా స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. అప్పుడే ఇంట్లో ఏం జరుగుతుందో ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది. షణ్ముఖ్ జస్వంత్ మరియు సిరి స్టార్ మా TRP మెటీరియల్స్ అని నెటిజన్లు నమ్ముతున్నారు.

ఒక ప్రోమోలో అయినా

ఒక ప్రోమోలో అయినా

అందుకే ఈ ఇద్దరినీ ప్రతిరోజూ కనీసం ఒక ప్రోమోలో అయినా హైలైట్ చేస్తున్నారు మేకర్స్. స్టార్ మా ప్రతిరోజూ కనీసం రెండు ప్రోమోలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒక ప్రోమోలో అయినా వీరు కనపడేలా కనిపిస్తున్నారు. అయితే మీరు కనుక కన్నడ బిగ్ బాస్ సీజన్ 8ని గమనిస్తే అరవింద్ కెపి మరియు దివ్య కూడా అదే పద్ధతిలో వ్యవహరించిన విషయం తెలిసిందే.

వాళ్ళు కూడా టిఆర్పి మెటీరియల్స్

వాళ్ళు కూడా టిఆర్పి మెటీరియల్స్

రవింద్ కెపి మరియు దివ్య కలర్స్ కన్నడ కోసం టిఆర్పి మెటీరియల్స్ అని చెప్పేవారు. వారు కుడా అన్ని ప్రోమోలలో కనిపించేవారు. ఈ దెబ్బతో వ్యూయర్స్ కూడా అరవింద్ ట్రోఫీని గెలుస్తాడు అని ఊహించారు, కానీమేకర్స్ ట్విస్ట్‌ ఇచ్చి మంజు పావగడను సీజన్ విజేతగా ప్రకటించారు. అయితే అసలు కన్నడ బిగ్ బాస్‌ని మధ్యలోకి ఎందుకు తీసుకువస్తున్నారు అని మీకు అనుమానం రావచ్చు, అయితే అక్కడ జరిగిందే ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

దాన్నే ఫాలో అయి

దాన్నే ఫాలో అయి


అయితే బిగ్ బాస్ 5 ను ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్‌ను మిస్ చేయని మరియు బిగ్ బాస్ అభిమానులు బిగ్ బాస్ తెలుగులో కూడా ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈసీజన్ 5లో బిగ్ బాస్ కన్నడ 8 నుండి అనేక టాస్క్‌లు మరియు కాన్సెప్ట్‌లు తీసుకోబడ్డాయి. ఫైనల్‌కి స్టార్ మా కూడా కలర్స్ కన్నడ వ్యూహాన్ని అనుసరించినా ఆశ్చర్యం లేదు.

షణ్ముఖ్ జస్వంత్‌ను తప్పించి

షణ్ముఖ్ జస్వంత్‌ను తప్పించి

అదే జరిగితే, బిగ్ బాస్ మేకర్స్ షణ్ముఖ్ జస్వంత్‌ను తప్పించి శ్రీరామ చంద్రను రన్నరప్‌గా ఎంచుకోవచ్చు, ఎందుకంటే ఈ సీజన్‌లో బిగ్ బాస్ విన్నర్‌గా విజె సన్నీ ఇప్పటికే హాట్ ఫేవరేట్ గా ఉన్నాడు. షన్నుకి ఇప్పటికే బయట గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు పాపులారిటీతో కూడా భారీ యూట్యూబ్ స్టార్‌గా ఉన్నాడు, అయితే శ్రీ రెడ్డి సమస్య తర్వాత శ్రీరామ చంద్ర ఇమేజ్ బాగా దెబ్బతింది. మరోవైపు వీజే సన్నీ హౌస్‌లో టాప్‌ ఫైవ్‌కి మంచి ఫైట్‌ ఇస్తున్నాడు. కాబట్టి అతను విజేతగా నిలిచే అన్ని అవకాశాలు ఉన్నాయి. షన్ను 2వ లేదా 3వ స్థానానికి ఫిక్స్ కావాల్సి ఉంటుందని అంటున్నారు.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X