For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Teugu 5 Nominations: రెండో వారంలో ఏడుగురు నామినేట్.. ఆ ముగ్గురికి మరోసారి షాక్

  |

  తెలుగులో ఎన్నో రకాల షోలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనసులు దోచుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు 'బిగ్ బాస్'. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన దీనికి ప్రేక్షకుల ఊహించని రీతిలో స్పందనను అందిస్తున్నారు. ఫలితంగా ఈ షో నాలుగు సీజన్లను ఒకదానికి మించి ఒకటి భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదో సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇప్పుడీ షోలో అత్యంత ముఖ్యమైన నామినేషన్స్ ప్రక్రియ వివరాలు లీకయ్యాయి. ఈ వారం ఏకంగా ఏడుగురు సభ్యులు నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం!

  తొలిసారి అంత మందితో ప్రయోగం

  తొలిసారి అంత మందితో ప్రయోగం

  అంగరంగ వైభవంగా మొదలైన ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు నేరుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు ఉన్నారు.

  పవన్ కల్యాణ్ సెన్సేషనల్ రికార్డ్: ఒకే సినిమాతో రెండు ఘనతలు సొంతం.. ఇండియాలోనే ఏకైక హీరో

  మొదటి వారం సరయు ఎలిమినేట్

  మొదటి వారం సరయు ఎలిమినేట్

  సీజన్ ప్రారంభం అయిన మొదటి వారంలోనే ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో యాంకర్ రవి, జస్వంత్, ఆర్జే కాజల్, హమీదా, మానస్, సరయులు ఉన్నారు. వీళ్ల నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై చాలా రకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే, అంతా అనుకున్నట్లుగానే మొదటి వారం సరయు షో నుంచి బయటకు వెళ్లిపోయింది.

  షోలోనే ముఖ్యమైన ఘట్టానికి టైమ్

  షోలోనే ముఖ్యమైన ఘట్టానికి టైమ్

  బిగ్ బాస్ షోలోనే ఎంతో ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే అన్న విషయం తెలిసిందే. ఇది జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఈ టాస్క్ సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య ప్రేమ, స్నేహం కూడా పుడుతుంది. అవే సగటు బిగ్ బాస్ ప్రేక్షకుడికి మజాను పంచుతాయి. ఈ ప్రక్రియ ప్రతి సోమవారం ఎపిసోడ్‌లో ఎన్నో గొడవలతో సాగుతూ ఉంటుంది.

  ప్యాంట్‌ లేకుండా హీరోయిన్ ఘాటు ఫోజు: ప్రైవేట్ ఫొటో షేర్ చేసిన వర్మ.. మామూలోడు కాదుగా!

  ఈ వారం ఎవరు ఉంటారో అంటూ

  ఈ వారం ఎవరు ఉంటారో అంటూ

  బిగ్ బాస్ ఐదో సీజన్‌కు సంబంధించి మొత్తం 19 మంది ప్రముఖులు హౌస్‌లోకి కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒకరు ఎలిమినేట్ అవగా.. సిరి హన్మంత్ కెప్టెన్ అయింది. దీంతో 17 మంది నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఈ వారం ఎవరు నామినేట్ అవుతారా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. దీంతో ఈ ఎపిసోడ్ కోసం అంతా వేచి చూస్తున్నారు.

  నామినేషన్ ప్రక్రియ వివరాలు ఇవే

  నామినేషన్ ప్రక్రియ వివరాలు ఇవే

  రెండో వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ రెండు గ్రూపుల మధ్య జరగబోతుందని తెలుస్తోంది. ఇంట్లోని సభ్యులందరినీ రెండు జట్లుగా విభజించిన బిగ్ బాస్.. రెడ్ కలర్ అనే టాస్క్ ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాదు, ఇందులో కొన్ని గొడవలు కూడా జరిగాయనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ ఎపిసోడ్ మొత్తం ప్రేక్షకులకు మస్త్ మజాను పంచబోతుందట.

  Bigg Boss: లేడీ కంటెస్టెంట్‌లకు దెబ్బ మీద దెబ్బలు.. ఐదుగురిలో నలుగురు ఎలిమినేట్

  రెండో వారం ఏడుగురు నామినేట్

  రెండో వారం ఏడుగురు నామినేట్

  ఐదో సీజన్‌కు సంబంధించి మొదటి వారం బిగ్ బాస్ షోలో ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అవగా.. రెండో వారం మాత్రం ఏకంగా ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ వారం జరిగిన నామినేషన్స్ టాస్కులో హమీదా, జస్వంత్, ఆర్జే కాజల్, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, వీజే సన్నీ, లహరి షారిని నామినేట్ అయ్యారట.

  Seetimaarr Movie Team Vinayaka Chaviti Special Interview
  ఆ ముగ్గురు మళ్లీ వచ్చేశారంటూ

  ఆ ముగ్గురు మళ్లీ వచ్చేశారంటూ

  తాజాగా బయటకు వచ్చిన జాబితాను చూస్తే.. ఇందులో గత వారం నామినేట్ అయిన హమీదా, జస్వంత్, ఆర్జే కాజల్‌లు మరోసారి నామినేషన్స్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇక, మిగిలిన నలుగురు మాత్రం తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చారు. మరి ఇప్పుడు ప్రేక్షకులు ఎవరికి మద్దతిస్తారు? ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ లిస్ట్‌పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  English summary
  Telugu Top Reality TV Series Bigg Boss Recently Started 5th Season. 2nd Week Hamida, RJ Kajal, Jessie, VJ Sunny, Umadevi and Nataraj Gets Nominated.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X