Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లో పవర్ స్టార్.. ఏం పీకుతున్నారు అంటూ ఆ అమ్మాయిలపై ఘాటుగా!

గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టు.. ఊహకే అందని టాస్కులు.. చిత్ర విచిత్రమై సంఘటనలు.. ప్రేమ కహానీలు.. రొమాన్స్‌ను పండించే సన్నివేశాలు ఇలా రకరకాల పరిణామాలతో ఆసక్తికరంగా సాగుతోన్న ఏకైక షోనే బిగ్ బాస్. అందుకే తెలుగులో ఇది ఏకంగా నాలుగు సీజన్లను ఒకదానికి మించి ఒకటి సక్సెస్‌ఫుల్‌ అయింది. ఈ క్రమంలోనే నేషనల్ లెవెల్‌లో రికార్డులను సైతం క్రియేట్ చేసింది. ఇంతటి విజయవంతమైన ఈ షో ఐదో సీజన్ ఇటీవలే ప్రారంభం అయింది. ఇది కూడా ఆరంభం నుంచే జనరంజకంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఓ ఊహించని సంఘటన జరిగింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

గతంలో కంటే ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్

గతంలో కంటే ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్

బిగ్ బాస్ షో తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకోవడంతో ఐదో దానిపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సారి ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామంటూ నిర్వహకులు ముందే చెప్పారు. అందుకు అనుగుణంగానే అన్ని సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా ఐపీఎల్ సీజన్‌లో సైతం బిగ్ బాస్ షోకు మంచి రేటింగ్‌ను రాబడుతున్నారు.

 బొమ్మలు తయారు చేసే టాస్క్ ఇచ్చి

బొమ్మలు తయారు చేసే టాస్క్ ఇచ్చి

ఆరో వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో బ్లూ టీమ్‌లో సభ్యులుగా మానస్‌, సన్నీ, యానీ మాస్టర్‌.. ఎల్లో టీమ్‌ సభ్యులుగా షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ.. రెడ్‌ టీమ్‌ సభ్యులుగా విశ్వ, శ్రీరామ్‌, ప్రియ.. గ్రీన్‌ టీమ్‌ సభ్యులుగా రవి, లోబో, శ్వేతలను విభజించారు. ఇక, సిరి హన్మంత్, కాజల్‌ను సంచాలకులుగా నియమించారు.

పోటీపోటీగా టాస్క్.. వాళ్లకు బిగ్ ఆఫర్

పోటీపోటీగా టాస్క్.. వాళ్లకు బిగ్ ఆఫర్

'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కు పోటాపోటీగా జరిగింది. ప్రతి టీమ్ సభ్యులూ తమ దగ్గర ఉన్న మెటీరియల్‌తో బొమ్మలను చక్కగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేశారు. అయితే, అందులో కొన్ని బొమ్మలు సరిగా లేవని సంచాలకులు కమ్ మేనేజర్లు సిరి, కాజల్ రిజెక్ట్ చేశారు. ఇక, ఈ టాస్కులో రవి టీమ్‌కు స్పెషల్ పవర్స్ లభించాయి. దీంతో వాళ్లు మానస్ టీమ్‌ను స్వాప్ చేసుకున్నారు.

సంచాలకుల ఓవర్.. గొడవకు కారణం

సంచాలకుల ఓవర్.. గొడవకు కారణం

'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కులో సంచాలకులుగా చేస్తున్న సిరి హన్మంత్, కాజల్ ఓవర్ యాక్షన్ చేసినట్లు కనిపించింది. తాము చెప్పిందే వినాలి.. తమకు నచ్చినట్లు ఉండాలి అంటూ వీళ్లిద్దరూ అన్ని టీమ్‌లపై అధికారం చెలాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తమకు నచ్చినట్లు కొన్ని రూల్స్ కూడా పెట్టారు. ఇది హౌస్‌లో కొన్ని గొడవలకు కారణం అయిపోయింది.

సారీ చెప్పమనగానే.. పవర్ స్టార్ ఎంట్రీ

సారీ చెప్పమనగానే.. పవర్ స్టార్ ఎంట్రీ

కన్వేయర్ బెల్ట్ నుంచి మెటీరియల్ వస్తున్న సమయంలో సన్నీ ముందుగానే వాటిని తీసుకున్నాడని సంచాలకురాలైన సిరి హన్మంత్ ఆరోపించింది. అంతేకాదు, అతడు అందరి ముందే తనపై కేకలు వేశాడని.. ఇప్పుడు అందరి ముందే సారీ చెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో సన్నీ ఒక్కసారిగా పవర్ స్టార్‌లా మారిపోయి.. 'సారీ చెప్పేదే లేదు హా హా' అంటూ డైలాగ్ చెప్పాడు.

ఏం పీకుతున్నారు అంటూ ప్రియ ఫైర్

ఏం పీకుతున్నారు అంటూ ప్రియ ఫైర్

షణ్ముఖ్ జస్వంత్ టీమ్ కన్వేయర్ బెల్ట్ దగ్గర రూల్స్ పాటించిందని.. ఈ కారణంగా వాళ్లను అందరి కంటే ముందు నిల్చోబెడతామని సంచాలకులు మిగిలిన టీమ్‌లకు చెప్పారు. ఆ సమయంలో ప్రియ 'మిగిలిన టీమ్‌ సభ్యులు తప్పు చేసినప్పుడు ఎందుకు అడగలేదు. అప్పుడు మీరేం పీకుతున్నారు? మీ ఇష్టం వచ్చినట్లు రూల్స్ పెడితే మేము ఒప్పుకోము' అంటూ బాగా ఫైర్ అయింది.

Recommended Video

Actress Sree Leela Exclusive Interview Part 2 | Pelli SandaD
సిరిని హగ్ చేసుకుని ఓదార్చిన షన్నూ

సిరిని హగ్ చేసుకుని ఓదార్చిన షన్నూ

ప్రియ 'ఏం పీకుతున్నారు' అంటూ సంచాలకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న సన్నీ విజిల్స్ వేస్తూ తెగ ఎంజాయ్ చేశాడు. ఒకవైపు సన్నీ.. మరోవైపు ప్రియ తనపై కోప్పడడంతో సిరి హన్మంత్ ఎమోషనల్ అయిపోయింది. దీంతో షణ్ముఖ్ వచ్చి ఆమెను గట్టిగా హగ్ చేసుకుని ఓదార్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె కాసేపు కామ్‌గా ఉండిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X